Business

ఉద్యోగుల జీతాల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న బైజూస్ వ్యవస్థాపకుడు

ఉద్యోగుల జీతాల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న బైజూస్ వ్యవస్థాపకుడు

ప్రముఖ భారతీయ ఎడ్ టెక్ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత ఇంటిని, అతని కుటుంబ సభ్యుల ఇళ్లను తాకట్టు పెట్టి మరీ తన ఉద్యోగుల జీతాల కోసం డబ్బును సేకరించారు. రవీంద్రన్ ఆస్తులలో రెండు ఇళ్లు, దక్షిణ భారత దేశంలోని బెంగుళూరులో నిర్మాణంలో ఉన్న 12 బిలియన్ డాలర్ల విలువైన విల్లాను రుణం తీసుకోవడానికి తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ నిధులు కంపెనీ మాతృ సంస్థ థింక్ అండ్ లర్న్ ప్రైవేట్ లో 15 వందల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించడంతో ఉపయోగపడతాయని కంపెనీతో దగ్గర సంబంధాలున్న వర్గాలు తెలిపారు. పెట్టుబడి దారులు దాని వాల్యూవేషన్ తగ్గించడం, ఆడిటర్స్, బోర్డు సభ్యులు వైదొలగడంతో సహా కంపెనీ వరుస ఎదురు దెబ్బలను ఎదుర్కొంటుంది.

ఇటీవల ఫారిన్ ఎక్స్ఛేంచ్ మేనేజ్ మెంట్ యాక్ట్ ( ఫెమా) కింద 1.12 బిలియన్ డాలర్ల ఉల్లంఘటనకు సంబంధించి బైజూస్ కు భారత ఫెడరల్ ఫైనాన్షియల్ క్రైం ఫైటింగ్ ఏజెన్సీ షోకాజ్ నోటీసు జారి చేసింది.

నవంబర్ లో ప్రకటించిన 2022 కు సంబంధించిన కంపెనీ ఆడిట్స్ ఫలితాలు వెల్లడించిన బైజూస్.. దాని ఆన్ లైన్ విద్యా వ్యాపారం నిర్వహణ నష్టం 6 తగ్గి 24బిలియన్ రూపాయలకు తగ్గింది.

ఏదీ ఏమైనా.. రవీంద్రన్ కంపెనీ నష్టాల్లో ఉన్నందున ఉద్యోగలు చెల్లింపుల కోసం డబ్బును సేకరించేందుకు తన ఇంటిని తాకట్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z