DailyDose

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు

రాష్ట్రవ్యాప్తంగా ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో ఈ నెల 27న గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. డిప్యూటీ చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ (సీఎల్‌సీ) డి.శ్రీనివాసులు సోమవారం సింగరేణిలోని 13 కార్మిక సంఘాలతో హైదరాబాద్‌లోని కార్మికశాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. మూడు నెలల క్రితం హైకోర్టు వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం డిసెంబరు 27న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. తాజా ఓటర్ల జాబితాను కార్మిక నేతలకు అందజేశారు. మొత్తం 39,748 మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొననున్నారు.

ఇప్పటికే నామినేషన్లు పూర్తి
అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అక్టోబరు 30 నుంచి సింగరేణి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించిన విషయం తెలిసిందే. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కూడా పూర్తయింది. ఆ తర్వాత శాసనసభ ఎన్నికలకు షెడ్యూలు విడుదలవడంతో.. సింగరేణి ఎన్నికలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం సింగరేణిలో ఎన్నికల నిర్వహణ జరుగుతుందని కార్మికశాఖ వెల్లడించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z