Health

ఈ టాబ్లెట్‌తో జాగ్రత్త!

ఈ టాబ్లెట్‌తో జాగ్రత్త!

నెలసరి, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ సందర్భాల్లో సాధారణంగా వినియోగించే మెఫ్తాల్‌ ఔషధానికి సంబంధించిన ప్రతికూల ప్రభావా(రియాక్షన్‌)లను గమనించి, అప్రమత్తమవ్వాలని ఆరోగ్యరంగ వృత్తి నిపుణులు, వ్యాధిగ్రస్తులకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నవంబర్‌ 30వ తేదీన ఒక అడ్వైజరీని జారీ చేసింది. సాధారణంగా రుమటాయిడ్‌ ఆర్థ్రరైటిస్, ఆస్టియో ఆర్ర్థరైటిస్, మహిళల్లో నెలసరి సమయంలో సంభవించే డిస్‌మెనోరోయియా, నొప్పి, వాపు, జ్వరం, దంతాల నొప్పి వంటి చికిత్సలో మెఫేనమిక్‌ యాసిడ్‌ పెయిన్‌ కిల్లర్‌ను వినియోగిస్తుంటారు.

ఈ పెయిన్‌ కిల్లర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్‌ ఫార్మాకోపియా కమిషన్‌(ఐపీసీ) తాజాగా ఔషధ భద్రత హెచ్చరికను జారీ చేసింది. ఫార్మకోవిజిలెన్స్‌ ప్రోగ్రామ్‌ ఆఫ్‌ ఇండియా(పీవీపీఐ) వారి డేటాబేస్‌ను ప్రాథమికంగా విశ్లేíÙంచగా కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఈ ఔషధాన్ని వినియోగించిన సందర్భాల్లో ఇసినోఫిలియా, సిస్టెమిక్‌ సింప్టమ్స్‌(డ్రెస్‌) సిండ్రోమ్‌ వంటి డ్రగ్‌ రియాక్షన్‌లు కనిపించాయి. పెయిన్‌ కిల్లర్‌ను వాడిన సమయంలో ఏమైనా దుష్ప్రభావాలు కనబడితే వెంటనే పీవీపీఐ అధికారిక ఠీఠీఠీ. జీpఛి.జౌఠి.జీn వెబ్‌సైట్‌ లేదా హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1800–180–3024ను సంప్రదించవచ్చు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z