DailyDose

ఎక్స్’ సేవలకు కొద్దిసేపు తీవ్ర అంతరాయం

ఎక్స్’ సేవలకు కొద్దిసేపు తీవ్ర అంతరాయం

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ఎక్స్‌ (ట్విటర్‌ Twitter) సేవలకు అంతరాయం ఏర్పడింది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా గురువారం ఉదయం కొద్దిసేపు దీనిలో తీవ్ర సమస్య తలెత్తింది. ఎక్స్‌ (X) ఖాతాలను తెరవగానే టైమ్‌లైన్లు ఖాళీగా దర్శనమిచ్చాయని పలువురు యూజర్లు ఫిర్యాదులు చేశారు. ఏ పోస్టులూ కన్పించడం లేదని తెలిపారు. అటు ఫాలోయింగ్‌, ఫర్‌ యూ, లిస్ట్‌ పేజీలు కూడా ఖాళీగా కనిపించాయి.

ఎక్స్‌ ప్రీమియం, ఎక్స్‌ ప్రో వెర్షన్‌లు కూడా పనిచేయలేదని పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. డౌన్‌డిటెక్టర్‌ పోర్టల్‌ ప్రకారం.. అమెరికాలో దాదాపు 47వేల మందికి పైగా యూజర్లకు ఈ సమస్య ఎదురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఆ సమయంలో ‘ఎక్స్‌’ పోస్టింగ్‌ సదుపాయం మాత్రం యథావిధిగా పనిచేసింది. కానీ, పోస్ట్ చేస్తే ఆ ట్వీట్లు మాత్రం టైమ్‌లైన్‌లో కన్పించలేదని యూజర్లు చెప్పారు. దీంతో #TwitterDown ట్రెండ్ అయింది. దాదాపు గంటపాటు ఎక్స్‌ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిసింది.ఇటీవల ‘ఎక్స్‌ (X)’ మాధ్యమంలో పలు సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. గతవారం కూడా దీని సేవలు గంట పాటు నిలిచిపోయాయి. సిబ్బంది కొరత, ఇతర సాంకేతిక కారణాల వల్ల ట్విటర్‌ సేవలు ఇలా నిలిచిపోతున్నాయని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z