Business

వందలాది మంది ఉద్యోగులను తొలగించిన ‘పేటీఎం’

వందలాది మంది ఉద్యోగులను తొలగించిన ‘పేటీఎం’

ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ ‘పేటీఎం’ (Paytm) ఉద్యోగుల కోతకు తెరతీసింది. పేటీఎం మాతృసంస్థ అయిన ‘వన్‌ 97 కమ్మూనికేషన్‌’ (One 97 Communications)లో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.

ఆ కథనాల ప్రకారం.. పేటీఎంలోని వివిధ విభాగాల్లో సుమారు 1,000 మందికిపైగా ఉద్యోగులను (employees) తొలగించింది. ఈ తొలగింపు ప్రభావం పేమెంట్స్‌, సేల్స్‌, ఆపరేషన్స్‌ వంటి విభాగాలపై పడింది. ఈ తొలగింపు మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం మందిని ప్రభావితం చేయనుంది. సిబ్బంది ఖర్చులను 15 శాతం మేర తగ్గించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z