DailyDose

2024లో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం-తాజా వార్తలు

2024లో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం-తాజా వార్తలు

2024లో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం

 2024 ఎన్నికల్లో వైసీపీ బీఫామ్‌పై పోటీ చేసే వారు ఓడిపోతారని….టీడీపీ-జనసేన బీఫామ్‌పై పోటీ చేసే వాళ్లు గెలవడం ఖాయమని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని చెప్పుకొచ్చారు. టికెట్స్ లేవంటే వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, హ్యాపీగా వెళ్లిపోతున్నారని చెప్పుకొచ్చారు. టికెట్స్ లేవంటే వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు హ్యాపీగా వెళ్లిపోతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఆదివారం విజయవాడలో బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో 2024లో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు అరెస్ట్‌తోనే వైఎస్ జగన్ పతనం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడమే ఇక మిగిలుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. 2023 జగన్ విధ్వంస నామ సంవత్సరంగా మిగిలిపోతుందని ధ్వజమెత్తారు. 2024లో రాక్షస పాలన అంతరిస్తుందని, ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారంటూ జోస్యం చెప్పారు. బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీసీలకు చంద్రబాబు నాయుడే సరైన న్యాయం చేస్తారని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో ఒక వెలుగు వెలిగిన మంత్రి బొత్స సత్యనారాయణ నేడు జగన్ ముందు ఎలా ఉన్నారో చూస్తే బలహీన వర్గాల పరిస్థితి ఎలా వుందో అర్థం అవుతుందని చెప్పుకొచ్చారు. మంత్రి బొత్సతో మైకులు లేకుండా మాట్లాడితే ఆయన మొత్తం చెపుతారని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న చెప్పుకొచ్చారు.

* 3న గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం

జనవరి 3న గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది ఈ భేటీ. గత ఆదివారం జరగాల్సిన విస్తృతస్థాయి సమావేశం.. కలెక్టర్లతో సమావేశం కారణంగా జనవరి మొదటి వారానికి వాయిదా పడింది. ఏఐసీసీ ఇంఛార్జ్‌ తర్వాత మొదటిసారి సమావేశంలో పాల్గొననున్నారు దీపాదాస్‌‌మున్షి. పార్లమెంట్‌ ఎన్నికలే అజెండాగా పీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి.. చర్చించనున్నారు.

పవన్ కల్యాణ్‌కు బుర్ర బుద్ధి లేదు

 జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర గృహనిర్మాణశాఖలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇళ్ల నిర్మాణంలో కుంభకోణాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణలపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పవన్ కల్యాణ్ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. ఏపీలో జరిగిన అభివృద్ధి దేశంలోని మరే రాష్ట్రంలోనూ జరగలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చినా చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు కనిపించలేదని ఎద్దేవా చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. అక్కాచెల్లెమ్మల సొంతింటి కలను తమ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పుకొచ్చారు. 21 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తున్నట్లు మంత్రి జోగి రమేశ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటి నిర్మాణాలు పూర్తయ్యాయని…చాలాచోట్ల గృహప్రవేశాలు కూడా జరగుతున్నట్లు వెల్లడించారు. గృహనిర్మాణ శాఖలో ఏం స్కాం జరుగుతుందో చెప్పాలంటూ పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్‌కు అసలు బుర్ర ఉందా అని నిలదీశారు. కనీస జ్ఞానం, బుద్ధి ఉండి ఉంటే స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై ప్రధాని మోడీకి లేఖ రాసేవాడని మంత్రి జోగి రమేశ్ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌కు బుద్ధి ఉంటే చంద్రబాబు పాలనపై నిలదీసేవాడని మంత్రి జోగి రమేశ్ ఎద్దేవా చేశారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీలో హక్కే లేదు అని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు.చివరకు పవన్ కల్యాణ్‌కు రాష్ట్రంలో ఆధార్ కార్డు కూడా లేదు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ తాబేదారుగా పనిచేస్తున్నారని తీవ్రస్థాయిలో జోగి రమేశ్ మండిపడ్డారు.అసలు పవన్ కల్యాణ్‌కు జ్ఞానం కూడా లేదు అని విమర్శించారు. చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ ఏ గడ్డయినా అడ్డదిడ్డంగా తింటారంటూ మండిపడ్డారు. మరోవైపు‘ రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళ్దాం. ఇల్లు ఎవరు ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేశారనేదానిపై అడిగి తెలుసుకుందాం’ అందుకు సిద్ధమా అని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌కు మంత్రి జోగి రమేశ్ ఛాలెంజ్ చేశారు.

గవర్నర్‌ వల్లే ఆ కులానికి అన్యాయం జరిగింది!

ఎరుకల సమాజిక వర్గానికి గవర్నర్‌ అన్యాయం చేశారని మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) అన్నారు. మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని జిల్లెలగూడలో ఉన్న చందన చెరువు కట్టపై ఏకలవ్యుని విగ్రహాన్ని(Ekalavya statue) ఎమ్మెల్సీ యెగ్గె మల్లేష్‌, మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, ఎరుకల సంఘం నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాడు కేసీఆర్‌ ఎరుకల సామాజిక వర్గం నుంచి సత్యనారాయణను ఎమ్మెల్సీగా ఎంపిక చేసి గవర్నర్‌కు పంపిస్తే ఆమె తిరస్కరించారని పేర్కొన్నారు. ఎరుకల సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకాలు వేసింది గవర్నర్‌ తమిళిసై అని పేర్కొన్నారు. ఆమె కారణంగానే ఆ కులానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాంచరమ్మ జాతరకు కేసీఆర్‌ పది లక్షలు ఇచ్చే వారన్నారు. జాతర్లకు బోనాలకు, అన్ని పండుగలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించిన అంశాన్ని ఆమె గుర్తు చేశారు. అన్ని కుల సంఘాల వారికి కేసీఆర్‌ సముచిత స్థానం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు భూపాల్‌ రెడ్డి, పోరెడ్డి పద్మ, కామేష్‌ రెడ్డి, ఎరుకల సంఘం నాయకుడు నాగయ్య, తదితరులు ఉన్నారు.

ఎన్నికల సమయంలో 750కి పైగా హామీలు ఇచ్చిన జగన్‌

పాదయాత్ర, ఎన్నికల సమయంలో 750కి పైగా హామీలు ఇచ్చిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. మరో నేత తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. పాలనా వైఫల్యాలను ఎమ్మెల్యేలపై జగన్‌ రుద్దుతున్నారని ధూళిపాళ్ల మండిపడ్డారు. ఆయనకు గెలుపుపై నమ్మకముంటే గతంలో 151 నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలను తిరిగి అక్కడి నుంచే బరిలో నిలపాలని సవాల్‌ విసిరారు. శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేస్తూ రాజకీయంగా వారిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. మద్యనిషేధం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌.. దాన్ని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

* మంత్రి మేరుగు నాగార్జునకు షాక్

మంత్రి మెరుగు నాగార్జునకు వేమూరు నియోజకవర్గ వైసీపీ నేతలు షాక్ ఇచ్చారు. వేమూరు మండలం బలిజేపల్లి, పరహాపురం, వేమూరు, అబ్బనగూడవల్లి గ్రామాలకు చెందిన నాయకులతో కలిసి వైసీసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేమూరి మురళి కృష్ణ రాజీనామా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం తాము ఎంతో కష్టపడ్డామని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.త్వరలోనే తమ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నికలకు ముందు కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేయడంతో బాపట్ల జిల్లాలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది.

* పవన్ కల్యాణ్‌కు కనీసం ఏపీలో ఓటు ఉందా?

గృహ నిర్మాణల భూ సేకరణలో అవినీతి జరిగినట్లు ప్రధానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ లేఖ రాయడంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు కొట్టేసిన స్కిల్ స్కాంలో పవన్ కల్యాణ్‌కు ఎంత ముట్టిందో విచారణ చేయమని తాము కూడా లెటర్ రాయబోతున్నామన్నారు. మనీ లాండరింగ్ ఎలా జరిగిందో విచారణ జరిపించాలని కోరతామని, ఆ ప్రభుత్వంలో పవన్ కూడా భాగస్వామే అని జోగి రమేష్ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z