DailyDose

మెట్రోరైలు విస్తరణపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం

మెట్రోరైలు విస్తరణపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం

నగరంలో మెట్రోరైలు విస్తరణపై కొత్త ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గతంలో ప్రతిపాదించిన కొన్నింటిని నిలిపేస్తూ.. మరికొన్నింటిని కొనసాగిస్తూ.. కొత్తగా కొన్ని మార్గాల్లో పొడిగించాలని నిర్ణయించింది. ఎక్కువ ప్రాంతాలను కలిపేలా మార్గాలను నిర్దేశించింది. 5 మార్గాల్లో 76 కి.మీ. మేర మెట్రో విస్తరణ తమ ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ఐటీ కారిడార్‌కు ఇప్పటివరకు సరైన ప్రజారవాణా లేదు. రాయదుర్గం వరకే మెట్రో ఉంది. దీంతో ఇక్కడి నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ చేరుకోవడానికి ఉదయం గంటన్నరపాటు ట్రాఫిక్‌లో నరకంగా ఉంటోంది. కొత్తగా విస్తరించే మార్గాల్లో రాయదుర్గం నుంచి గచ్చిబౌలి, విప్రో, అమెరికన్‌ కాన్సులేట్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు 12 కి.మీ. నిర్మించనున్నారు. దీంతో ట్రాఫిక్‌ కష్టాల నుంచి ఊరట లభిస్తుంది. మరోవైపు ఎక్కువ మంది ప్రయోజనం కల్గించే మార్గాలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది.

జాతీయ రహదారి కూడలిలో..: బెంగళూరు జాతీయ రహదారి సిటీలోకి ప్రవేశించే ఆరాంఘర్‌ వద్ద నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. దూర ప్రాంత బస్సుల కోసం ఇక్కడే ఎక్కువ మంది ఎదురుచూస్తుంటారు. ఈ ప్రాంతానికి మెట్రో అనుసంధానం లేకపోవడంతో సిటీకి చేరుకోవడానికి ట్రాఫిక్‌లో ఎక్కువ సమయం పడుతోంది. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌, ఎల్బీనగర్‌ నుంచి చంద్రాయణగుట్ట జంక్షన్‌, అక్కడి నుంచి ఆరాంఘర్‌ వరకు మెట్రోని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించి అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది. 19 కి.మీ. ఉండే ఈ మార్గం కొత్త హైకోర్టు నిర్మించే ప్రాంతాన్ని కూడా కలుపుతుంది.`

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z