Fashion

మునగాకుతో జుట్టు సమస్యకు చెక్‌ పెట్టవచ్చు!

మునగాకుతో జుట్టు సమస్యకు చెక్‌ పెట్టవచ్చు!

మునకాగు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి వీటి గురించి తెలుసు. మునగాకులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఆయుర్వేదంలో కూడా మునగాకుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని తగ్గించుకోవడంలో మునగాకును ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే వారంలో ఒక్కసారైనా మునగాకుతో తయారు చేసిన వంటలు తినమని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ మునగాకులో ఐరెన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా.. చర్మ, జుట్టు సమస్యల్ని కూడా అదుపు చేయవచ్చు.

చాలా మంది ప్రస్తుతం పలు రకాల జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఇలాంటి వారు మునగాకును ఉపయోగిస్తూ బెటర్ అని పోషకాహార నిపుణులు అంటున్నారు. మరి ఇంకెందుకు లేట్.. కురుల విషయంలో మునగాకు చేసే మ్యాజిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మునగాకు పొడి ఎలా తయారు చేయాలి?
ఒక్కసారి మునగాకు పొడి తయారు చేసుకుంటే.. ఎన్నో రకాలుగా ఉపయోగించు కోవచ్చు. ముందుగా మునగాకును శుభ్రంగా క్లీన్ చేసుకుని.. కాటన్ క్లాత్ పై పరచాలి. నీరు అంతా లాగేశాక.. దాన్ని ఎండలో ఆరబెట్టాలి. ఇలా మూడు, నాలుగు రోజులు అలానే వదిలేస్తే.. బాగా ఎండుతాయి. మరీ ఎక్కువగా ఎండ తగలకుండా చూసుకోవాలి. దీన్ని చేతితో అయినా నలుపుకుని.. పౌడర్ లా చేసుకోవచ్చు. లేదా మిక్సీలో అయినా వేసుకుని పౌడర్ తయారు చేసుకోవచ్చు.

హెయిర్ ప్యాక్..
తయారైన మునగాకు పొడిని అర స్పూన్.. చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. అందులోకి లవంగాల పొడి, తులసి ఆకుల పొడి, బ్రహ్మీ పౌడర్, షాంపూ కొద్దిగా వేసుకుని.. పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి.. ఓ పది నిమిషాలు మసాజ్ చేసి.. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే కొత్తగా వెంట్రుకలు వచ్చి.. ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.

మునగాకు ప్రయోజనాలు:
మునగాకులో ఉండే మెరింగాలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కణాలను నిర్మిస్తుంది. అందు వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే కుదుళ్లు కూడా బలపడతాయి. బట్ట తలపై కూడా జుట్టు పెరుగుతుంది. అదే విధంగా స్కాల్ఫ్‌పై రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z