Business

ఆర్‌బీఐ కొత్త నిబంధనలు

ఆర్‌బీఐ కొత్త నిబంధనలు

బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ)రుణ ఎగవేతలపై జరిమానా ఛార్జీలకు సంబంధించి ఆర్‌బీఐ కీలక నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వేసే జరిమానా ఛార్జీలను ఆదాయ వృద్ధి సాధనంగా ఉపయోగించడాన్ని నిషేధించిన ‘ఫెయిర్‌ లెండింగ్‌ విధానం’ ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ సోమవారం తెలిపింది.

బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు జరిమానా వడ్డీని ఆదాయ పెంపు సాధనంగా ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆర్‌బీఐ గత ఏడాది ఆగస్టు 18న ఇందుకు సంబంధించిన నిబంధనలను సవరించింది. దీని ప్రకారం బ్యాంకులు రుణ పునఃచెల్లింపుల్లో వైఫల్యం వంటి ‘‘సహేతుకమైన’’ ప్రాతిపదికపై మాత్రమే జరిమానా ఛార్జీలను విధించడానికి వీలవుతుంది. ఇటువంటి జరిమానా ఛార్జీలు బ్యాంకుల బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం వివక్షత లేని పద్ధతిలో డిఫాల్ట్‌ కింద ఉన్న మొత్తంపై మాత్రమే అమలువుతాయి. అటువంటి ఛార్జీలపై వడ్డీని లెక్కించడం జరగదు. బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌ సూచనలు క్రెడిట్‌ కార్డ్‌లు, అంతర్జాతీయ వాణిజ్య రుణాలు, వాణిజ్య రుణాలకు వర్తించదు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z