Movies

నా కెరీర్‌లో ఇలాంటి ప్రయోగాత్మక సినిమా రావడం నా అదృష్టం

నా కెరీర్‌లో ఇలాంటి ప్రయోగాత్మక సినిమా రావడం నా అదృష్టం

ఒకే ఒక్క పాత్రతో తెరకెక్కిన చిత్రం ‘105 మినిట్స్‌’. ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్ర పోషించగా… రాజు దుస్సా దర్శకత్వం వహించారు. బొమ్మక్‌ శివ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్‌ని విడుదల చేశారు. హన్సిక మాట్లాడుతూ ‘‘ఇలాంటి ఓ ప్రయోగాత్మక చిత్రం నా కెరీర్‌లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. నటిగా నాకు ఇదొక అనుభవం. 34 నిమిషాల షాట్‌ని ఒకే టేక్‌లో చేశాం. అందుకోసం 8 రోజులుపాటు రిహార్సల్స్‌ చేశా. ఇలాంటి మరెన్నో ప్రయోగాలు సినిమాలో ఉంటాయి. సామ్‌ సీఎస్‌ సంగీతం ఈ సినిమాకి మరొక ప్రధాన పాత్రగా మారింది. ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుందీ చిత్రం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘తొలిసారి దర్శకత్వం వహిస్తున్న నన్ను, కంటెంట్‌ని నమ్మి ఈ సినిమా నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాతకి కృతజ్ఞతలు. అందరూ కలిసి ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z