Devotional

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సఫలం – Horoscope – Feb 08 2024

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సఫలం – Horoscope – Feb 08 2024

మేషం
అన్ని కార్య‌ములందు విజ‌యాన్ని సాధిస్తారు. అంత‌టా సౌఖ్యాన్ని పొందుతారు. శ‌త్రు బాధ‌లుండ‌వు. శుభ‌వార్త‌లు వింటారు. గౌర‌వ‌, మ‌ర్యాద‌లు అధిక‌మ‌వుతాయి. అద్భుత శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను పొంద‌గ‌లుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆక‌స్మిక ధ‌న‌లాభ‌ముంటుంది.

వృష‌భం
అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు. నూత‌న కార్యాల‌కు ఆటంకాలున్నా స‌త్ఫ‌లితాలు పొందుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధ‌న న‌ష్ట‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాలి. ఆత్మీయుల స‌హాయ‌, స‌హ‌కారాల‌కై వేచి ఉంటారు. దైవ‌ద‌ర్శ‌నం ల‌భిస్తుంది.

మిథునం
నూత‌న కార్యాలు ఆల‌స్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజ‌నం వ‌ల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విష‌యం మిమ్మ‌ల్ని మ‌న‌స్తాపానికి గురి చేస్తుంది. వీలైనంత వ‌ర‌కు అస‌త్యానికి దూరంగా ఉండుట మంచిది. అన‌వ‌స‌ర భ‌యాందోళ‌న‌కు లోన‌వుతారు.

క‌ర్కాట‌కం
నూత‌న వ‌స్తు, వ‌స్త్ర‌, వాహ‌న‌, ఆభ‌ర‌ణ‌, లాభాల‌ను పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్య‌మైన కార్య‌క్ర‌మం పూర్త‌వుతుంది.

సింహం
అకాల భోజ‌నాదుల వ‌ల్ల అనారోగ్యం ఏర్ప‌డుతుంది. పిల్ల‌ల ప‌ట్ల ఎక్కువ ప‌ట్టుద‌ల‌తో ఉండుట అంత మంచిదికాదు. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండుట మంచిది. మ‌నోద్వేగానికి గురి అవుతారు. కోపాన్ని త‌గ్గించుకోవ‌డం అన్ని విధాలా శ్రేయ‌స్క‌రం. కొత్త ప‌నులు ప్రారంభించ‌రాదు.

క‌న్య
ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధు, మిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డే అవ‌కాశాలుంటాయి. స్త్రీల మూల‌కంగా శ‌త్రు బాధ‌ల‌నుభ‌విస్తారు. ఏదో ఒక విష‌యం మ‌న‌స్తాపానికి గురి చేస్తుంది. పిల్ల‌ల ప‌ట్ల మిక్కిలి ప‌ట్టుద‌ల ప‌నికిరాదు. ప‌గ సాధించు ప్ర‌య‌త్నాన్ని వ‌దిలివేయ‌డం మంచిది.

తుల
శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరును. బంధు, మిత్రుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు. ప్ర‌యాణాల వ‌ల్ల లాభం చేకూరును. శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం ల‌భిస్తుంది. ధ‌న‌చింత ఉండ‌దు. స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుదురు.

వృశ్చికం
క‌ళాకారుల‌, మీడియా రంగాల వారికి మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి. దేహాలంక‌ర‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. పేరు, ప్ర‌తిష్ఠ‌లు సంపాదిస్తారు. నూత‌న వ‌స్తు, వ‌స్త్ర‌, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు.

ధ‌నుస్సు
ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో న‌ష్ట‌పోయే అవ‌కాశ‌ముంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవ‌కాశాన్ని జార‌విడుచుకుంటారు. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండుట అవ‌స‌రం.

మ‌క‌రం
ధ‌ర్మ‌కార్యాలు చేయుట‌యందు ఆస‌క్తి పెరుగుతుంది. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మాన‌సికానందాన్ని అనుభ‌విస్తారు. పేరు ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు.

కుంభం
కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండుట‌చే మాన‌సికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు ల‌భిస్తుంది. నిన్న‌టి వ‌ర‌కు వాయిదా వేయ‌బ‌డిన కొన్ని ప‌నులు ఈరోజు పూర్తి చేసుకోగ‌లుగుతారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల్ని క‌లుస్తారు.

మీనం
ఆక‌స్మిక ధ‌న‌లాభ‌ముంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు ల‌భిస్తాయి. బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది. సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఉంటారు. ప్ర‌తి విష‌యంలో అభివృద్ధి ఉంటుంది. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z