NRI-NRT

NY: క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ వెబ్‌సైట్ ప్రారంభం

NY: క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ వెబ్‌సైట్ ప్రారంభం

క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF – https://qef.org/) వెబ్‌సైట్‌ను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మధుసూధన్ సాయి న్యూయార్క్‌లో గురువారం నాడు ప్రారంభించారు. ఇంజినీరింగ్ విధానాల్లో సరికొత్త సాంకేతికను తీసుకురావడానికి తమ సంస్థ చేస్తున్న కృషిని క్యూఈఎఫ్ వ్యవస్థాపకులు ఈ సందర్భంగా వివరించారు.

QEF అధ్యక్షుడు శ్రీ అట్లూరి మాట్లాడుతూ…నాణ్యమైన ఇంజినీరింగ్ సమాజానికి ఈ వెబ్‌సైట్ ఒక మంచి వేదికగా ఉపయుక్తమవుతుందని అన్నారు. ఆలోచనల పరివ్యాప్తికి, నూతన సాంకేతికతకు బీజాలు వేయవచ్చునని ఆశాభావాన్ని వెలిబుచ్చారు.

మధుసూధన్ సాయి మాట్లాడుతూ ఐకమత్యం, సానుభూతి, మెరుగైన ప్రపంచం కోసం కృషి చేయడం QEF లక్ష్యాలుగా ఉండడం ముదావహం అన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ సంతోష్ యామ్సాని, కమిటీ సభ్యులు శరత్ వేట, కేదార్ ఫాడ్కే, సోమారావు తదితరులు పాల్గొన్నారు.




👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z