Movies

విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వాలని కోర్టును అభ్యర్థించిన జక్వెలిన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వాలని కోర్టును అభ్యర్థించిన జక్వెలిన్

ఆర్థిక మోసం కేసులో సుకేశ్ చంద్రశేఖర్‌‌‌నుఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగానే బాలీవుడ్ నటి, శ్రీంలక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను ఎదుర్కొంటుంది. కొన్ని రోజుల క్రితం జాక్వెలిన్‌కు చెందిన రూ.7.27కోట్ల విలువైన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. ఆమె పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో.. విదేశాలకు వెళ్లేందుకు 15రోజుల పాటు అనుమతి ఇవ్వాలని ఈ అందాల భామ కోరింది. కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిల్ మార్చి 18న విచారణకు రానుంది. ఆమె పిటిషన్‌పై ఈడీ స్పందించాల్సిందిగా ఆడిషనల్ సెషన్స్ జడ్జీ ప్రవీణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తరఫున అడ్వకేట్ అర్జిత్ సింగ్ ఈ పిటిషన్ కోర్టుకు సమర్పించారు. ‘‘ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో జాక్వెలిన్‌ను నేరస్థురాలని ఎక్కడ పేర్కొనలేదు. ఆమె శ్రీలంకకు చెందినప్పటికీ , 2009నుంచి ఇండియాలోనే నివసిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. ఈడీ విచారణకు ఎల్లప్పుడు సహకరించింది. ఎటువంటి కారణం లేకుండా ఈడీ ఆమె పాస్‌పోర్టును సీజ్ చేసింది. అందువల్ల ఆమె విదేశాలకు ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వాలి’’ అని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆ పిటిషన్‌లో పేర్కొంది.