Politics

మూడు రాజధానుల పేరుతో ఖజానా నింపుకునే యత్నం – TNI రాజకీయ వార్తలు

మూడు రాజధానుల పేరుతో ఖజానా నింపుకునే యత్నం – TNI రాజకీయ వార్తలు

* రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేయాలని తొలి నుంచి ప్రయత్నిస్తోందని సీపీఎం నేత బాబూరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అమరావతి సీఆర్డీఏ పరిధిలో భూమిలను అమ్మడానికి తీసుకొచ్చిన 389, 390 జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ జీవోలు కేవలం ఆరంభం మాత్రేమే అని… దశల వారీగా భూములను పూర్తిగా అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలోనే రాజధాని అని చెబుతూ మరోవైపు ఉద్యోగుల కోసం కట్టిన ప్లాట్లను ప్రైవేటుకు అప్పజెప్పటంలో అర్థం ఎంటో చెప్పాలన్నారు. సింగపూర్ కంపెనీకి టీడీపీ భూములు అమ్ముతున్నప్పుడు వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు ఎందుకు అమ్ముతుందని బాబూరావు ప్రశ్నించారు.

*బాలినేని తరహాలోనే.. నాకు ఇంటిపోరు తప్పడం లేదు: శ్రీధర్‌రెడ్డి
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే తనకూ ఇంటిపోరు తప్పడం లేదని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. వాపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా ముఖ్యనేతలు వారి నియోజకవర్గాల్లో కాకుండా తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని ఆక్షేపించారు.మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే తనకూ ఇంటి పోరు తప్పట్లేదని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వాపోయారు. జిల్లాకు చెందిన వైకాపా ముఖ్యనేతలు వారి నియోజకవర్గాల్లో కాకుండా తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. ఈ విషయంలో తెదేపా, జనసేన చేస్తున్న వ్యాఖ్యలను శ్రీధర్ రెడ్డి ఖండించారు.

*దేశానికి ప్రధాని అయిన తెలంగాణ బిడ్డ PV..: స్పీకర్ Pocharam
పీవీ నరసింహరావు 101వ జయంతి సందర్భంగా శాసనసభ లాబీ హాల్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి విప్ యంయస్ ప్రభాకర్ రావు, అసెంబ్లీ సెక్రెటరీ డా.వి.నరసింహాచార్యులు పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ దేశానికి ప్రధాని అయిన పీవీ తెలంగాణ బిడ్డని కొనియాడారు. ఈ రోజు దేశం ఆర్ధిక సమస్యలను తట్టుకుని నిలబడుతుందంటే దానికి కారణం పివీ తెచ్చిన ఆర్థిక సంస్కరణలే కారణమన్నారు. భూ సంస్కరణలను కూడా అమలు చేసింది ఆయనేనన్నారు. పీవీ చూపించిన బాటలో మనమందరం పయనించాలని పోచారం శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే 130 కోట్ల మంది ప్రజలు గౌరవించే వ్యక్తి పీవీ అన్నారు. 14 భాషలు తెలిసిన బహు భాషా కోవిదుడని కొనియాడారు. మనమందరం ఆయనను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వారి ఆశయాలకు అనుగుణంగా నడవాల్సిన అవసరం ఉందన్నారు.

*ప్రతి ఒక్కరూ కీర్తించాల్సిన వ్యక్తి PV : Revanth
భారత్ ఆర్ధికంగా శక్తి వంతంగా నిలవడానికి పీవీ నరసింహారావే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేడు పీవీ జయంతి సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. భూ సంస్కరణలు తెచ్చి.. భూమి లేని పేదలకు భూమి ఇచ్చారన్నారు. ప్రపంచ దేశాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి పీవీ సరళీకృత విధానాలే కారణమన్నారు. ప్రతి ఒక్కరూ కీర్తించాల్సిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధానిగా ఎదగడంలో ఆయన సేవలు మరవలేనివన్నారు. దివంగత జైపాల్ రెడ్డి . పీవీ అడుగుల్లో నడిచారన్నారు. తెలంగాణ అభ్యున్నతికి కాంగ్రెస్ పాటు పడుతుందన్నారు. వంగర గ్రామంలో పీవీ జ్ఞాపకార్దం చేపట్టిన పనులు అసంతృప్తిగా జరిగాయని తెలుస్తోందన్నారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని రేవంత్ పేర్కొన్నారు. పీవీ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎప్పుడు గౌరవిస్తుందని రేవంత్ పేర్కొన్నారు.

*పీవీని కేంద్రం విస్మరించడం బాధాకరం: మంత్రి Talasani
మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నర్సింహారావు ను కేంద్రం విస్మరించడం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అ న్నారు. పీవీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని పీవీఘాట్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మల్లారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… కిష్ట పరిస్థితులలో ఉన్న దేశాన్ని ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధిలోకి తీసుకువచ్చిన పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలకు భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పిన పీవీని గౌరవించకపోవడం విచారకరమన్నారు. పీవీ శతజయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించి గౌరవించిందని తెలిపారు. మన మధ్య భౌతికంగా లేకపోయిన మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచే గొప్ప వ్యక్తి పీవీ నర్సింహా రావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు.

*ముర్ముపై రామకృష్ణ వ్యాఖ్యలు సిగ్గుచేటు: Vishnuvardhan reddy
గిరిజన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పై సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… ముర్ముపై వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గుచేటన్నారు. గిరిజన అభ్యర్థి రబ్బరు స్టాంపు రాష్ట్రపతి అవుతుందని అనడానికి రామకృష్ణకు సిగ్గు అనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. కమ్యూనిస్టులను గిరిజన సమాజం నుండి బహిష్కరించాలన్నారు. మహిళల పట్ల కమ్యూనిస్టులకు చిన్నచూపు ఉందని విమర్శించారు. దేశ చరిత్రలో మొట్టమొదటి సారి గిరిజనులకు రాష్ట్రపతి అయ్యే అవకాశం వస్తే, అది చూసి ఓర్వలేని కమ్యూనిస్టులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా కనీసం ఉనికి లేకపోయినా, ప్రజలు ఛీత్కరించినా వారి ఆలోచనలలో మార్పు రాకపోగా గిరిజనుల మీద తమ ద్వేషాన్ని వెళ్లగక్కడం దురదృష్టకరమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

*YCP గూండాలు అధికార మదంతో రెచ్చిపోతున్నారు: Nara Lokesh
వైసీపీ గూండాలు అధికార మదంతో రెచ్చిపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పే ర్కొన్నారు. నిన్న ఒక జర్నలిస్ట్‌ పై శ్రీకాళహస్తిలో వైసీపీ నేత దాడి చేసిన ఘటనపై ఆయన స్పందించారు. ‘‘ప్రతిపక్షాలు, ప్రజలు, అధికారులు అయిపోయారు. ఇప్పుడు జర్నలిస్టుల వంతు వచ్చింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ వద్ద జర్నలిస్ట్ ఈశ్వర్‌పై వైసీపీ నేత, శ్రీకాళహస్తీశ్వర ఆలయం బోర్డు మెంబర్ జయశ్యాం అలియాస్ బుల్లెట్టు జయశ్యాం దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈశ్వర్‌కి చెందిన స్థలాన్ని కబ్జా చెయ్యడమే కాకుండా ప్రశ్నించినందుకు బూతులు తిడుతూ భౌతిక దాడికి పాల్పడటం దారుణం. జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడిన జయశ్యాంపై కఠిన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్ట్ స్థలాన్ని తిరిగి ఆయనకి చెందేలా చూడాలి’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

*పంటల బీమా పథకం మొత్తం లోపభూయిష్టమే: TDP MLC
పంటల బీమా పథకం మొత్తం లోపభూయిష్టమే అని టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్ రవి) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… జగనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించాడని… దానికి అర్హత, ఆథరైజేషన్ వ్యాలిడిటీ ఏమీ లేవని వ్యాఖ్యానించారు. జగన్ రైతులకు పంటల బీమా ప్రీమియం ఎంత కట్టారో తెలపాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకంతో రైతులు నష్టపోయి, పార్టీ నాయకులు, మద్దతుదారులు లాభపడుతున్నారని తెలిపారు. లేని ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించి రైతులను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.అధికంగా పంటలు వేసిన ప్రాంతానికి పంటల బీమా చెల్లించకపోవడం దారుణమని అన్నారు. ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసిన పంటకు తక్కువ బీమా ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రజాధనాన్ని, రాష్ట్ర ఆదాయాన్ని తన మద్దతుదారులకు పంటల బీమా రూపంలో దోచిపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. గతంలో ఉన్న ధరల స్థిరీకరణ పథకానికి రెక్కలొచ్చాయన్నారు. జగన్ రైతుల పక్షపాతి కాదు.. కక్షపాతి అని విమర్శించారు. అమ్మఒడి పథకానికి లేనిపోని నిబంధనలు పెట్టి అవకతవకలకు పాల్పడుతున్నారని రవీంద్రనాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

*నోరు అదుపులో పెట్టుకో..: Budha Venkanna
మాజీ మంత్రి కొడాలి నాని పై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. అప్పుడే కొడాలి నానికి చెమటలు పడుతున్నాయన్నారు. జగన్జై ల్లో ఉంటే తల్లి, చెల్లి రోడ్ల మీదకు వచ్చి పాదయాత్ర చేశారని.. అలాంటి వారిని అధికారంలోకి రాగానే ఇంటి నుంచి గెంటేయలేదా? అని ప్రశ్నించారు. వెన్నుపోటుకు, గొడ్డలిపోటుకు పేటెంట్ జగన్ అని విమర్శించారు. ఇంకా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. ‘‘కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకో.. సొంత బాబాయ్ ని గొడ్డలితో నరికించిన చరిత్ర ఎవరిది? అంటే వెన్నుపోటు దారుడు ఎవరో .. కొంచెం మైండ్ పెట్టి ఆలోచించు. దమ్ముంటే చర్చకు రా… వెన్నుపోటు, గొడ్డలి పోటు ఎవరిదో తేలుద్దాం. కొడాలి నానిని నాడు టీడీపీ నుంచి బయటకు గెంటేశాం. ఎన్టీఆర్‌‌ను తిట్టిన వైయస్ నీకు దేవుడా? నిన్ను ఎమ్మెల్యేని చేసిన చంద్రబాబు వెన్నుపోటు దారుడా? తల్లి, చెల్లిని పార్టీ నుంచి గెంటేసిన జగన్ వెన్నుపోటుదారుడు కాదా? రేపు గుడివాడ మహానాడుతో కొడాలి నాని పని అయిపోతుంది. నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది… గుడివాడ ప్రజలే తగిన బుద్ది చెబుతారు’’ అని పేర్కొన్నారు.

*వైసీపీ సర్కార్ మైనార్టీలను వాడుకుని వదిలేసింది: Bonda uma
ఎన్నికల సమయంలో ముస్లింలకు పెద్దపీఠం వేస్తామని జగన్మోహన్ రెడ్డి అనేక వాగ్దానాలు చేశారని… అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలను వదిలి పారేశారని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. దులహన్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో ముస్లిం సంఘాల నాయకులు ధర్నాలో బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు అధికారంలో ఉండగా మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముస్లింలకు అనేక లోన్‌లే ఇప్పించి వాళ్ళ అభివృద్ధికి టీడీపీ ఎంతో సహకరించిందని గుర్తుచేశారు. మైనార్టీ సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, అయితే మైనారిటీ కార్పొరేషన్‌కు వైసీపీ నిధులు కేటాయించకపోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో మైనార్టీలను వాడుకొని వదిలేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. మైనార్టీలను జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా మోసం చేశారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే గతంలో ఏ విధంగా ముస్లింలకు పెద్దపీట వేస్తామని బోండా ఉమా స్పష్టం చేశారు.

*మత్స్యకారులకు ఇన్సూరెన్స్ సదుపాయం: ఎంపీ GVL
దేశంలో మోదీ ప్రభుత్వం వచ్చాకే విడిగా ఫిషరీస్ మినిస్ట్రీని ఏర్పాటు చేసిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ…. మత్స్యసంపద యోజన కింద కోల్ట్ స్టోరేజి, మార్కెటింగ్ చేయాల్సి ఉందని తెలిపారు. ప్రతిజిల్లాలో మత్స్యమార్కెట్ కమిటీలు ఏర్పాటు అవసరం ఉందన్నారు. ఫిషింగ్ హార్బర్‌లో సర్వైలెన్స్ కెమెరాలు, పోలీస్ సబ్ పోస్ట్ ఏర్పాటు చేయాలని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకున్నవారు చాలా తక్కువగా ఉన్నారని, ప్రతిఒక్కరికీ రుణసదుపాయం అందేలా బ్యాంకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మత్స్యకారులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామన్నారు. మత్స్యకారులు వెనుక బడినవర్గంలో ఉన్నారని… ఎస్టీ రిజర్వేషన్ డిమాండ్ కూడా ఉందన్నారు. సముద్ర కాలుష్య సమస్య మీద కూడా దృష్టిపెడతామమని ఎంపీ జీవీఎల్ వెల్లడించారు.

*కేతిరెడ్డి భూదాహానికి ఎంతో మంది బలి: BJP leader
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూ దాహానికి, ధన దహానికి ఎంతో మంది బలయ్యారని బీజేపీ, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్మవరం డీఎస్పీ కార్యాలయం ముందు సూర్యనారాయణ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ధర్మవరం ప్రజలు శాంతి కోరుకుంటారనే తాము ఐదేళ్లు శాంతియుతంగా ఉన్నామని తెలిపారు. గుడ్ మార్నింగ్ పేరుతో దౌర్జన్యాలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడి ప్రసక్తే లేదని… దాడికి పాల్పడిన వారికి శిక్ష పడేలా చేస్తామని అన్నారు. ‘‘ఎంతమందిని చంపుతావ్.. నీ చంపుడు కార్యక్రమాలు తిమ్మంపల్లిలో చూసుకో ఇక్కడికి వలస వచ్చావ్. నాలుగు జతల బట్టలు పెట్టుకొని ధర్మవరం వచ్చావ్… వెయ్యి కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది’’ అంటూ ప్రశ్నించారు. ఇక్కడి పోలీసులు ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని గోనుగుండ్ల సూర్యనారాయణ ఆరోపించారు.

*BJP నేతలపై దాడికి ఆ ఎమ్మెల్యేనే కారకుడు: Somuveerraju
ధర్మవరం ప్రెస్‌‌క్లబ్‌లో బీజేపీపై నేతలపై జరిగిన దాడి ఘటనపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… పట్టపగలు పాత్రికేయుల సమావేశంలో ఉండగా మారణాయుధాలతో వచ్చి హత్యకు ప్రయత్నం చేశారన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి ఎమ్మెల్యే కారుకుడని ఆరోపించారు. డీఐజీ, ఎస్పీలతో ఘటనపై మాట్లాడినట్లు చెప్పారు. దాడి చేస్తానని ఎమ్మెల్యే ముందుగా ప్రకటించిన విషయాన్ని పోలీసులు దర్యాప్తు అంశంగా తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహా సంఘటనలను ప్రభుత్వం నిలువరించకపోతే బీజేపీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని సోమువీర్రాజు స్పష్టం చేశారు.

*ప్రజలు ప్రాణాలు కాపాడే మందుల్లో కూడా కల్తీ: Pattabhi Ram
నిన్న మద్యంలో, నేడు ప్రజల ప్రాణాలు కాపాడే మందుల్లో కూడా జగన్ బందిపోటు ముఠా కల్తీకి పాల్పడుతోందని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన యు.ఎస్.ఎఫ్.డి.ఏ (యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ) పరిశోధనలో అరబిందో ఫార్మా కల్తీకి సంబంధించి సంచలన వాస్తవాలు వెల్లడించిందన్నారు. జనవరి 12, 2022న యు.ఎస్.ఎఫ్.డి.ఏ అరబిందోకి రాసిన ఘాటైన లేఖలో ఈ కల్తీ విషయంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసిందన్నారు. జూన్ 2019లో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉన్న అరబిందో ఫార్మా తనిఖీలో కల్తీ పదార్ధాలు కనుగొని యు.ఎస్.ఎఫ్.డి.ఏ మొదటిసారి హెచ్చరికలు చేసిందన్నారు. కానీ పద్ధతి మార్చుకోకపోవడంతో తెలంగాణ బోరపట్ల గ్రామంలోని అరబిందో ఫార్మాలో ఆగష్టు, 2021లో తనిఖీ చేసి కల్తీ జరుగుతున్నట్లు కనుగొనటంతో మరోసారి జనవరి, 2022లో ఘాటుగా హెచ్చరికలు చేసిందన్నారు. మందుల్లో కల్తీ అక్రమాలు కట్టిపెట్టకపోతే అమెరికాలో అరబిందో ఉత్పత్తి చేసే మందులను నిషేధిస్తామని వార్నింగ్ ఇచ్చిందన్నారు.

*మార్పు రాకపోతే సాగనంపుడు ఖాయం: Vijayashanti
బీజేపీ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్‌పై ఫైరయ్యారు. సర్కారు దవాఖానాల్లో ప్రజలకు సరిగా వైద్యం అందడం లేదని ఘాటుగా విమర్శించారు. తీరు మారకపోతే తెలంగాణ ప్రజానీకం గట్టిగా బుద్ధి చెప్ప‌డం ఖాయమని పేర్కొన్నారు.వైద్యం అందించ‌లేని ఈ స‌ర్కార్ ఉంటే ఎంత‌? లేకుంటే ఎంత‌?..‘‘తెలంగాణలో వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామ‌ని కేసీఆర్, ఆయన భ‌జ‌న బ్యాచ్ గొప్ప‌లు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో 36.2 శాతం ప్రజలు మాత్రమే ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకుంటున్నారని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్) స‌ర్వేలో తేట‌తెల్ల‌మైంది. మిగతా 63.8 శాతం ప్రజలు ట్రీట్‌మెంట్ కోసం ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తున్నారు. దేశంలో సగం మంది అంటే, 49.9 శాతం ప్రజలు ప్రభుత్వ దవాఖానాలకు పోతుండగా, మన రాష్ట్రం దేశ సగటు కంటే వెనుకబడి ఉందని ఆ సర్వే పేర్కొంది. దేశంలో చివరి నుంచి నాలుగో స్థానంలో మన రాష్ట్రం ఉంది. ఇది విన‌డానికే సిగ్గుగా ఉంది. కనీసం పేద‌ల‌కైనా వైద్యం అందించ‌లేని ఈ స‌ర్కార్ ఉంటే ఎంత‌? లేకుంటే ఎంత‌?… ప్రభుత్వ దవాఖానాలకు వెళ్లకపోవడానికి జనం చెప్పిన కారణాలను కూడా సర్వే వెల్లడించింది. పేషెంట్లను అస్సలు పట్టించుకోరని, కేర్ తీసుకోరని రాష్ట్రంలో సగం మంది చెబుతున్నారు. తాము ఉంటున్న ప్రాంతంలో ప్రభుత్వ దవాఖాన అందుబాటులో లేకపోవడం వల్లే ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయించాల్సి వస్తోందని 40 శాతం మంది చెప్పారు. ప్రభుత్వ దవాఖానాలను రాత్రి పూట మూసేయడం, డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, గంటలకొద్ది వెయిట్ చేయించడం, టెస్టుల కోసం రోజుల తరబడి తిప్పించడం, హాస్పిటల్‌‌‌‌లో ఉండే అపరిశుభ్రత తదితర కారణాలను ఎక్కువ మంది చెబుతున్నారు. ఏం కేసీఆర్ సారు?… స‌ర్కార్ ద‌వాఖానాల్లో సౌకర్యాలు క‌ల్పించామ‌ని గొప్ప‌లు చెప్పుకుంటారు … ఇప్పుడు దీనికి నీ స‌మాధానం ఏంటి? ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో వ‌స‌తులు క‌ల్పించు. లేదంటే పేద‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్న కేసీఆర్ స‌ర్కార్‌కి తెలంగాణ ప్ర‌జానీకంస గట్టిగా బుద్ధి చెప్ప‌డం ఖాయం.’’ అని పేర్కొన్నారు.

*ఆర్మీని ఆదానీకి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది: జగ్గారెడ్డి
ఆర్మీని ఆదానీకి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు.ఇప్పటికే దేశంలోని ప్రభుత్వ ఆస్తులను అంబానీ, అదానీలకు కట్టబెడుతున్న మోదీ ఇప్పుడు ఆర్మీపై పడ్డారని విమర్శించారు. ఆర్మీలో నాలుగేళ్లు పనిచేసి వచ్చాక అడ్డుక్కుని తినాలా? అని ఆయన ప్రశ్నించారు. జై జవాన్.. జై కిసాన్ అన్నదే కాంగ్రెస్ నినాదం జగ్గారెడ్డి పేర్కొన్నారు.అగ్నిపథ్‌ను రద్దు చేసేవరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.దేశంలోని యువత భవిష్యత్ తో చెలగాటమాడవద్దని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హితవు చెప్పారు.

*యువతను మోదీ, కేసీఆర్ మోసం చేస్తున్నారు: రేవంత్‌రెడ్డి
యువతను ఒక పక్క మోదీ, మరోపక్క కేసీఆర్ మోసం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏళ్లతరబడి ఖాళీలను భర్తీ చేయడం లేదని అన్నారు. దేశాన్ని కాపాడే ఆర్మీలో కాంట్రాక్ట్ పద్ధతి తీసుకురావడం దారుణమని అన్నారు. సికింద్రాబాద్ అల్లర్ల నిరసనకారులపై కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.అగ్నిపథ్‌పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదని నిలదీస్తే క్రిమినల్ కేసులు పెట్టి.. బేడీలు వేసి అరెస్ట్ చేశారని అన్నారు.

*తెలంగాణ రైతులకు చేసిందేమీ లేదు కానీ..: రేణుకాచౌదరి
పోడు భూముల సమస్యపై కేసీఆర్ హామీ ఏమైంది? అని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి ప్రశ్నించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న మహిళలపై పోలీసుల దాడులు సమంజసం కాదన్నారు. డిపార్ట్‌మెంట్‌కు చెప్పేదొకటి.. ఆయనిచ్చే స్టేట్‌మెంట్ మరొకటని మండిపడ్డారు. గిరిజన మహిళలపై దాడులు చేసి సమస్య పెండింగ్ పెడుతున్నారని చెప్పారు. తెలంగాణ రైతులకు చేసిందేమీ లేదు కానీ.. పొరుగు రాష్ట్రాల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నారని ఆమె ఆరోపించారు.

*68.10 లక్షల మంది రైతుబంధుకు అర్హులు: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణలో రైతుబంధు కోసం 68.10 లక్షల మంది అర్హులుగా తేలినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.ఈ నెల 28వ తేదీ నుండి రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమకానున్న నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ దఫా కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు రైతుబంధు సాయం అందనున్నదని తెలిపారు. పంపిణీకి రూ.7521.80 కోట్లు సిద్ధంగా వున్నాయని తెలిపారు.రోజుకు ఒక ఎకరా నుండి ఆరోహణా క్రమంలో రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్టు మంత్రి చెప్పారు. సీసీఎల్ఎ వ్యవసాయ శాఖకు వివరాలు అందించినట్టు తెలపారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎకరాల వారీగా బిల్లుల జాబితా రూపొందించి ఆర్థికశాఖకు అందించారని అన్నారు. వానాకాలం రైతుబంధు నిధుల పంపిణీకి అంతా సిద్దం చేశామనని తెలిపారు.మొదటిసారి రైతుబంధు తీసుకునే రైతులు వెంటనే క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అందించి నమోదు చేసుకోవాలని సూచించారు. కేంద్రం ఎన్ని ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టించినా రైతుల మీద అభిమానంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు నిధుల విడుదలకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి, కంది ఇతర అపరాలు, నూనెగింజల పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని మంత్రి సూచించారు.జులై 15వ తేదీ వరకు పత్తి విత్తుకునే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.వర్షాలు కొంత ఆలస్యమయినందున తేలిక నేలలలో 5 నుండి 6.5 సెంటిమీటర్లు, బరువు నేలలలో 6 నుండి 7.5 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదు అయిన తర్వాతనే రైతులు వర్షాధార పంటలను విత్తుకోవాలన్నారు.

*రాజధాని నిర్మాణం చేతకాకపోతే సీఎం పదవి నుంచి దిగిపో: రఘురామ
అమరావతి నిర్మాణం చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్మోహన్‌ రెడ్డి దిగిపోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. ‘ఐదేళ్లు వ్యాపారం చేసి రూ.40 వేల కోట్లు సంపాదించావు. వ్యాపారం చేసుకో, డబ్బులను సంపాదించుకో… రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు ఇంకొకరు చూసుకుంటారు’ అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన జగన్‌ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని, కోర్టు ఆదేశాల మేరకు మరో రూ.10 వేల కోట్లు అప్పులు చేసి, అమరావతి నిర్మాణాన్ని చేపడితే తప్పా? అని ప్రశ్నించారు. అలాగే, ‘నువ్వు హాజరైనా, హాజరు కాకపోయినా, వచ్చే నెల 4న నా నియోజకవర్గమైన నరసాపురం పరిధిలోని భీమవరంలో జరిగే ప్రధాని పర్యటనకు నేను మాత్రం హాజరవుతా’ అని స్పష్టంచేశారు. ‘నా చుట్టూ ఉన్న సన్నిహితులను వేధించడం ద్వారా నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు.

*రాజధాని లేకుండా పాలనా?: సోము
రాజధాని లేకుండా పాలించ డం ప్రజలను మోసం చేయడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయ న మాట్లాడారు. ‘‘ప్రభుత్వం రైతుల భూములు అమ్ముకోవడం దారుణమైన విషయం. వారి భూములు వారికి అప్పగించాలి. రాజధానిపై రాష్ట్రం ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలి. సీఎం జగన్‌ సచివాలయానికి వెళ్లకుండా ఇంటి నుంచే పాలన సాగించడం దారుణం. బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా ఆవిర్భవిస్తుంది. మేం అధికారంలోకి వస్తే రూ.10 వేల కోట్లతో మూడేళ్లలో రాజధాని నిర్మిస్తాం. పేదలకు కేంద్రం ద్వారా సోనామసూరి బియ్యం అందిస్తాం’’ అంటూ వీర్రాజు హామీలిచ్చేశారు.

*1 నుంచి ధాన్యం సొమ్ము చెల్లిస్తాం: కారుమూరి
రబీ సీజన్‌లో ధాన్యం అమ్మిన రైతులకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రెండు వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సోమవారం తణుకు నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో చంద్రబాబు పౌరసరఫరాల ద్వారా రూ.20 వేల కోట్ల రుణాలు చేసి, పసుపు కుంకుమకు మళ్లించారని, ఇప్పుడు ధాన్యం డబ్బులు కొద్దిగా ఆలస్యమైతే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

*అటెండెన్స్ పేరుతో అమ్మ ఒడి లబ్ధిదారులను తగ్గించిన జగన్‌రెడ్డి..: పట్టాభి
ప్రజలను మోసం చేస్తూ జగన్‌ మోసపు రెడ్డిగా మారారని టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిల్లల సంఖ్య చెప్పి అధికారంలోకి వచ్చాక తల్లుల లెక్క చెబుతున్నారని ఆయన విమర్శించారు. అటెండెన్స్ పేరుతో అమ్మ ఒడి లబ్ధిదారులను తగ్గించిన జగన్‌రెడ్డి.. తన అటెండెన్స్‌ కోసం శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు? ఆయన ప్రశ్నించారు.

*మేము సిద్ధం.. ప్రభుత్వం సిద్ధమా?: బొండా ఉమ
కల్తీ మద్యంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని టీడీపీ నేత బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌జేఎస్ ల్యాబ్‌లో జే బ్రాండ్స్ హానికరమని తేలిందన్నారు. అవి మంచి బ్రాండ్స్ అని చెప్పడానికి అంబటి ఏమైనా శాస్త్రవేత్తనా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ వచ్చాక ఎక్కడా దొరకని 106 కొత్త బ్రాండ్స్ వచ్చాయన్నారు. అన్ని బ్రాండ్లకు టెస్టులు చేయించడానికి తాము సిద్ధం.. ప్రభుత్వం సిద్ధమా? అని ప్రశ్నించారు.

*అమ్మఒడికి 13వేలు ఇచ్చి..నాన్నబుడ్డికి రూ.54వేలు లాగుతున్నారు: తులసిరెడ్డి
అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.13వేలు ఇచ్చి.. నాన్నబుడ్డి పథకం ద్వారా రూ.54వేలు లాక్కోవడం భావ్యమా అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. పైగా, లబ్ధిదారుల సంఖ్య గత ఏడాదికంటే ఈ ఏడాది 52,463 తగ్గిందని, జగన్‌ అధికారంలోకి వచ్చి నాలుగో ఏడాది అవుతుండగా, అమ్మఒడి ఒక ఏడాది ఎగ్గొట్టారని విమర్శించారు. ఇంగ్లీష్‌ పట్ల మోజు, తెలుగుపట్ల ద్వేషం ఉంటే దీనిని విద్యార్థుల మీద ప్రయోగించే ముందు జగన్‌ తన సొంత పత్రిక, చానెల్‌ మీద ప్రయోగించాలని హితవు పలికారు. సాక్షి పత్రికను తెలుగు భాషలో ముద్రించడం మాని ఆంగ్లంలో ముద్రించాలని, టీవీ ప్రసారాలు ఇంగ్లీష్‌లో చేయాలని సవాల్‌ విసిరారు.

*అగ్నిపథ్‌ను రద్దు చేయాలి: శైలజానాథ్‌
అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్రం ప్రభుత్వం బేషరతుగా రద్దు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌ విధానాన్ని నిరసిస్తూ రాష్ట్ర సచివాలయం వెళ్లే మార్గంలో మల్కాపురం వై జంక్ష్షన్‌ వద్ద సోమవారం కాంగ్రెస్‌ పార్టీ నేతలు నిరసన దీక్ష చేశారు. శైలజానాథ్‌ మాట్లాడుతూ అగ్నిపథ్‌ అనేది ఆరెస్సెస్‌ కార్యకర్తలతో సైన్యాన్ని నింపే ఉద్దేశమని ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రఽధాన కార్యదర్శి చిలకా విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.