Politics

నేనూ రాజీనామా చేస్తా? – TNI నేటి రాజకీయ వార్తలు

నేనూ రాజీనామా చేస్తా? –  TNI  నేటి  రాజకీయ వార్తలు

* ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి జరుగుతుందంటే తానూ రాజీనామా చేస్తానని ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మునుగోడు ఉపఎన్నిక సెమీ ఫైనల్ అని తెలిపారు. తనను సంప్రదించకుండానే కాంగ్రెస్పె ద్దలు కమిటీ వేశారని, ఉపఎన్నిక విషయం ఇక వాళ్లే చూసుకుంటారని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్‌ బయటకు వస్తారని, ఆ నియోజకవర్గానికి మాత్రమే వరాలు కురిపిస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుయ్యబట్టారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తనను పిలవలేదని, అందుకే ఆ ఉప ఎన్నికకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నిర్వహించిన సమావేశాలకు పార్టీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఏ మీటింగ్‌ జరిగినా నాకు సమాచారం ఇవ్వడం లేదు. సమావేశానికి రావాలని ఆహ్వానించకపోతే ఎలా వెళ్లాలి? చండూరులో జరిగిన బహిరంగ సభలో నన్ను అసభ్యంగా తూలనాడారు. హోం గార్డుతో పోల్చారు. దీని వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు. పార్టీ నుంచి నన్ను బయటకు వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. అవమానిస్తే పార్టీ నుంచి నా అంతట నేనే వెళ్లిపోతానని అనుకుంటున్నారు. నన్ను వెళ్లగొట్టి కాంగ్రెస్‌ను ఖాళీ చేద్దామనుకుంటున్నారు’’ అని ఆరోపించారు. జరుగుతున్న విషయాలన్నింటినీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, నాయకుడు రాహుల్‌ గాంధీకి వివరిస్తానన్నారు.

*తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులది కీలకపాత్ర : మంత్రి గంగుల
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులది కీలకపాత్ర అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా కోర్టులో న్యాయవాదులకు జాతీయ పథకాల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడే పార్టీలు..రాజకీయాలు అని…ఇప్పుడు అభివృద్దే ధ్యాసగా పనిచేస్తున్నానన్నారు. కరీంనగర్‌ అభివృద్ది చెందాలని కోరుకునే వారిలో తాను ముందువరుసలో ఉంటానన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత స్వయం పాలనలో కరీంనగర్ ను గొప్పనగరంగా తీర్చిదిద్దుతున్నానన్నారు.
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు సైతం కీలక పాత్ర పోషించారని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి పై జాతీయ పతాకాలను ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటాలన్నారు. నంతరం బార్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలను మంజూరు చేశారు.రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రాలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నానని హామీ నిచ్చారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, చల్ల హరిశంకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, పలువురు న్యాయ వాదులు పాల్గొన్నారు.

*గోరంట్ల వ్యవహారంపై జగన్ స్పందించాల్సిందే: రఘురామకృష్ణరాజు
ఎంపీ గోరంట్ల మాధవ్న్యూ డ్ వీడియోపై ప్రతిపక్షాల దాడి ప్రభుత్వంపై కొనసాగుతూనే ఉంది. ఆ వీడియో ఒరిజినలేనని, అందులో ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని తెలుగుదేశం నాయకులు బలంగా వాదిస్తున్నారు. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఎంపీ గోరంట్ల విషయంపై స్పందించారు. పార్టీని కాపాడుకోవాలనుకుంటే గోరంట్లపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. గోరంట్ల వ్యవహారంపై సీఎం జగన్ స్పందించకపోతే కుదరదని, మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, ఫలితంగా అది పార్టీకి నష్టమని పేర్కొన్నారు. ఇప్పటికైనా గోరంట్ల వ్యవహారంపై జగన్‌ చర్యలు తీసుకోకపోతే..వైసీపీకి ఒక్క మహిళ కూడా ఓటు వేయరని పేర్కొన్నారు.

*మాధవ్‌ను మహిళా మంత్రులు వెనకేసుకు రావడం సిగ్గుచేటు: అనిత
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారాన్ని మహిళా మంత్రులు కూడా వెనకేసుకు రావడం సిగ్గుచేటని టీడీపీ నేత వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… గోరంట్ల విషయంలో ఎస్పీ ఫకీరప్ప క్లీన్‌చిట్ ఇవ్వలేదన్నారు. ఒరిజినల్ వీడియో లేదని మాత్రమే అన్నారని తెలిపారు. ఒరిజినల్ వీడియో దొరికితే విచారణ జరిపి చర్య తీసుకుంటామన్నారని అన్నారు. అమెరికా ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకునే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఈ రిపోర్ట్‌పై కూడా ఏమైనా తప్పుడు ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. సిగ్గులేకుండా మాధవ్‌ హోర్డింగ్‌లు పెట్టించుకున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

*పాలకులకు పేదల బాధలు పట్టడం లేదు: ప్రవీణ్‌
ప్రజల సొమ్ము దోచుకోని బుర్జ్‌ఖలీఫాలో దాచుకునే పాలకులకు దుబాయ్‌లో తెలంగాణ బిడ్డల బాధలు ఎలా కనిపిస్తాయని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. ఎడారి దేశాలకు వలసల పరంపర ఇంకా కొనసాగుతుండడం బాధాకరమని అన్నారు. సంపన్నులతో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించే పాలకవర్గాలు.. సబ్బండవర్గాల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. దుబాయ్‌లోని శుక్రవారం తెలంగాణ ప్రవాసీ కార్మికుల నివాసాలను ఆయన పరిశీలించారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ఉపాధి లేనందునే, ఎడారి దేశాల్లో వసతులు లేని చోట తెలంగాణ కార్మికులు కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి వద్ద పాస్‌పోర్టులు లేక, మరికొందరి వద్ద పాస్‌ పోర్టుల గడువు ముగిసి.. దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. దుబాయ్‌లో ఆదివారం నిర్వహించనున్న గ్లోబల్‌ బహుజన కన్వన్షన్‌లో సమగ్ర ప్రవాసీ విధానాన్ని ప్రకటిస్తామని ప్రవీణ్‌ తెలిపారు.

*2024 నాటికి శాశ్వత భూ పత్రాలు: కల్లాం
రైతులకు 2024 నాటికి భూ శాశ్వత హక్కు పత్రాలు అందజేయడమే లక్ష్యంగా సమగ్ర సర్వే చేస్తున్నట్టు ప్రభుత్వ సలహాదారు అజయ్‌ కల్లాం అన్నారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తేగాడ గ్రామంలో జరుగుతున్న భూ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల్లో సర్వే 90 శాతం పూర్తయిందన్నారు. ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి, ఆర్డీవో చిన్నికృష్ణ, తహసీల్దార్‌ సుధాకర్‌, తదితరులు ఉన్నారు.

*యువతను దగా చేసిన జగన్‌: లోకేశ్‌
ఏటా ఉద్యోగాల కేలండర్‌ విడుదల చేస్తామని చెప్పి యువతను దగాచేసిన సీఎం జగన్‌ ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల హామీ మేరకు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు భరోసా కల్పించాలన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ట్విటర్‌లో యువతకు శుభాకాంక్షలు తెలిపారు.

*‘ఇంపాక్ట్‌’తో అదనపు భారం మోపొద్దు: సీపీఎం
రాష్ట్రంలోని అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీల పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో 60 అడుగులపైన ఉన్న రహదారుల పక్కన కొత్తగా నిర్మించే భవనాల అనుమతికి అదనంగా ఇంపాక్ట్‌ ఫీజు పేరుతో భారం వేసే ప్రభుత్వ ఆదేశాలను ఉపసంహరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటన చేశారు. ‘‘ఇప్పటికే భవన నిర్మాణ రంగం సంక్షోభంలో ఉంది. మరోవైపు భవన నిర్మాణానికి అనుమతుల కోసం లైసెన్స్‌ ఫీజులు, డెవల్‌పమెంట్‌ చార్జీలు, మంచినీరు, డ్రైనేజీ కనెక్షన్లకు అడ్వాన్సులు.. ఇలా పలు రకాల ఫీజులు వసూలు చేస్తున్నారు.

*గోరంట్ల రాసలీలలపై సిట్‌ను వేయాలి: రాఘవులు
స్టీల్‌ ప్లాంటును త్వరితంగా ప్రైవేటుకు అప్పగించేందుకు ఉద్దేశపూర్వకంగా దానిని కేంద్ర ప్రభుత్వం నష్టాలలోకి నెడుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది రూ.913 కోట్లు లాభం సాధించిన స్టీల్‌ప్లాంటును ఈ ఏడాది అత్యంత దారుణమైన స్థితికి తీసుకువచ్చారన్నారు. రోజుకు 24 వేల టన్నులు ఉత్పత్తి చేసే ప్లాంటులో ఇప్పుడు 10 వేల టన్నులకు మించి ఉత్పత్తి జరగడం లేదన్నారు. స్టీల్‌ప్లాంటు పరిరక్షణ విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ బాధ్యతగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ‘‘స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ మహానాడు, వైసీపీ ప్లీనరీలో తీర్మానం చేయకపోవడం దుర్మార్గం. ప్రైవేటీకరణ జరగడమే మంచిదనే ధోరణితో ఆ రెండు పార్టీలు ఉన్నాయనే భావం కలుగుతోంది. స్టీల్‌ప్లాంటుపై బీజేపీ రిఫరెండం పెట్టాలి. విశాఖపట్నంలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేసినప్పుడే ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేరినట్టు అవుతుంది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ రాసలీలలపై పూర్తి అధికారాలతో కూడిన సిట్‌ను వేసి విచారణ జరిపించాలి. లేకపోతే అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా వున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. బీజేపీ నిర్వహించాల్సింది… ఆజాదీ కా అమృతోత్సవ్‌ కాదు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం కాపాడడానికి సంకల్పోత్సవ్‌’’ అని రాఘవులు అన్నారు.

*ఆ వీడియో ఒరిజినల్‌ అది సీఎంకూ తెలుసు: నాగుల్‌మీరా
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో కాల్‌ నిజమని, న్యూడ్‌ వీడియో ఒరిజినల్‌ అని సీఎం జగన్‌రెడ్డి మనస్సాక్షికి తెలుసని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా వ్యాఖ్యానించారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సమర్థిస్తున్నందునే వైసీపీ నేతలు పదేపదే తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. మాధవ్‌ న్యూడ్‌ వీడియోపై దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, మహిళా కమిషన్‌, రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నా.. ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు.

*కనీసం రోడ్డు కూడా వేయలేని దుస్థితి వైసీపీది: సోము వీర్రాజు
బీజేపీ (BJP) రూ. 3లక్షల కోట్లతో రాయలసీమ‌లో హై‌వే నిర్మిస్తే.. వైసీపీ సర్కారు కనీసం రోడ్లు కూడా వేయలేకపోతుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌లో యువ సంఘర్షణ యాత్ర రోడ్ షో ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు ప్రజలను దొచ్చుకుంటున్నాయని, కుటుంబ రాజకీయాలు చేయకుండా అభివృద్ధి రాజకీయాలు చేస్తున్న పార్టీ బీజేపీయేనని చెప్పారు. బీజేపీ నేత సత్యకుమార్ మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలు విస్మరించారని పేర్కొన్నారు. 2.5 లక్షల ఖాళీలు భర్తీ చేసి ఏటా ఉద్యోగాలు ఇస్తానన్న జగన్ ..వలంటీర్ ఉద్యోగాలు చూపించారని తెలిపారు. ప్రధాని మోడీ 25 లక్షల గృహాలు ఇస్తే ఏపీలో గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం 7 లక్షల ఇల్లు మాత్రమే నిర్మించాయని చెప్పారు. మాజీమంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో మహిళల గౌరవాన్ని భంగపరిచేలా ఉందన్నారు. ఎంపీ మాధవ్ విషయంలో సీఎం జగన్ మౌనం వీడాలన్నారు. సమావేశంలో రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి తదితరులు పాల్గొన్నారు.

*ఎంపీ గోరంట్లను తక్షణమే పదవి నుంచి తొలగించాలి: టీడీపీ మహిళా నేతలు
ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో విషయంలో వైసీపీ(YSRCP) నేతల తీరును టీడీపీ మహిళా నాయకురాళ్లు ఆషా, తుపాకుల రమణమ్మ తూర్పారబట్టారు. మహిళల గౌరవానికి భంగం కలిగేంచేలా వ్యవహరించిన ఎంపీ గోరంట్లను వైసీపీ మంత్రులు వేనకేసుకురావడం దురదృష్టకరమన్నారు. చివరకు హోం మంత్రి కూడా ఎంపీ ఘటనను అన్ని కోణాల్లో చూడాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన ఎంపీ మాధవ్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పై కూడా వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆయన వీడియోలు కూడా బయటకు వస్తాయని పేర్కొన్నారు.

*జగన్‌ సర్కార్‌పై పట్టాభి విమర్శలు
జగన్‌ సర్కార్‌పై టీడీపీ నేత పట్టాభి విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం జనం నుంచి బాదుడు మొదలుపెట్టిందని, ఇప్పటికే విద్యుత్‌ ఛార్జీల పేరుతో రూ.20 వేల కోట్లు బాదేశారని ఆరోపించారు. సంక్షేమం పేరుతో ఓ వైపు జగన్‌ బటన్‌ నొక్కుతూ..మరోవైపు ఛార్జీల పేరుతో తిరిగి డబ్బునురాబట్టుకుంటున్నాడని విమర్శించారు. జగన్‌ పాలన లో విద్యుత్‌ డిస్కంలు నాశనమయ్యాయని, ఏపీలో డిస్కంలన్నీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీ డిస్కంలకు మొత్తం రూ.38,836 కోట్ల అప్పులున్నాయని, దీనిపై హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసిందని పట్టాభి చెప్పారు.

*పాలకులకు పేదల బాధలు పట్టడం లేదు: ప్రవీణ్‌
ప్రజల సొమ్ము దోచుకోని బుర్జ్‌ఖలీఫాలో దాచుకునే పాలకులకు దుబాయ్‌లో తెలంగాణ బిడ్డల బాధలు ఎలా కనిపిస్తాయని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. ఎడారి దేశాలకు వలసల పరంపర ఇంకా కొనసాగుతుండడం బాధాకరమని అన్నారు. సంపన్నులతో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించే పాలకవర్గాలు.. సబ్బండవర్గాల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. దుబాయ్‌లోని శుక్రవారం తెలంగాణ ప్రవాసీ కార్మికుల నివాసాలను ఆయన పరిశీలించారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ఉపాధి లేనందునే, ఎడారి దేశాల్లో వసతులు లేని చోట తెలంగాణ కార్మికులు కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి వద్ద పాస్‌పోర్టులు లేక, మరికొందరి వద్ద పాస్‌ పోర్టుల గడువు ముగిసి.. దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. దుబాయ్‌లో ఆదివారం నిర్వహించనున్న గ్లోబల్‌ బహుజన కన్వన్షన్‌లో సమగ్ర ప్రవాసీ విధానాన్ని ప్రకటిస్తామని ప్రవీణ్‌ తెలిపారు.

*బేవకూఫ్‌ మంత్రి కేటీఆర్‌: రాజాసింగ్‌
బేవకూఫ్‌ మంత్రి కేటీఆర్‌ అని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధ్వజమెత్తారు. మునావర్‌ షోకు రక్షణ కల్పిస్తామని చెప్పడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. గతంలో కర్ణాటకలో నిర్వహించిన మునావర్‌ షోలో హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడారని, హైదరాబాద్‌లో ఆ షో నిర్వహిస్తే సహించేది లేదన్నారు. శాంతిభద్రతలు అదుపు తప్పితే.. కేటీఆరే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.

*ప్రజాస్వామ్యాన్ని కాపాడతారనే నమ్మకం ఉంది: కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి సీఎం కేసీఆర్‌ (CM KCR)పై విరుచుకుపడ్డారు. వ్యాపారం కోసం పార్టీ మారినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇంకా ఏమన్నారంటే..‘‘మునుగోడు ప్రజా సమస్యల కోసం మూడున్నరేళ్లుగా పోరాడుతున్నా. నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరగబోతోంది.రాజకీయాల్లోకి రాకముందే నేను వ్యాపారవేత్తను. వ్యాపారం కోసం రాజకీయం చేసే గుణం నాది కాదు. ఈ నెల 20వ తేదీ సీఎం కేసీఆర్ హాజరయ్యే సభలో మూడున్నరేళ్లుగా మునుగోడుకు ఎన్ని నిధులు ఇచ్చారో ప్రజలకు చెప్పాలి. మునుగోడు ప్రజలు ధర్మం వైపే ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతారనే నమ్మకం ఉంది. మూడేన్నరేళ్ళలో పట్టించుకోని వీరంతా రేపటి నుంచి డబ్బు సంచులతో తిరుగుతారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని ప్రజాస్వామ్యాన్నికేసీఆర్ ఖూనీ చేశారు. మునుగోడు ప్రజలకు, కేసీఆర్‌కు మధ్య జరుగుతున్న యుద్ధమే ఈ ఉప ఎన్నిక.’’ అని రాజ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు