Devotional

శ్రీకాళహస్తి గుడి దర్శించుకున్నాకా మరే గుడికీ వెళ్లకూడదు … ఏందుకు…?!! – TNI ఆధ్యాత్మిక వార్తలు

శ్రీకాళహస్తి గుడి దర్శించుకున్నాకా మరే గుడికీ వెళ్లకూడదు … ఏందుకు…?!! – TNI ఆధ్యాత్మిక వార్తలు

తిరుమల తిరుపతి దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు శ్రీవారి దర్శనం ముగియగానే చుట్టూ ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకుంటారు.పాపనాశనం .. కానిపాకం .. శ్రీకాళహస్తి ఇలా వరుసగా ఒక్కో ఆలయాన్ని దర్శించుకుంటారు.యితే తిరుమల చుట్టూ ఉన్న ఆలయాల్ని సందర్శించేప్పుడు అన్ని గుళ్లను దర్శించుకున్నాక చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకోవాలి.అదే చేస్తుంటారు కూడా.. కాని శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరే ఇతర ఆలయాన్ని దర్శించ కూడదని, నేరుగా ఇంటికే వెళ్లాలని అంటుంటారు.
శ్రీకాళహస్తి దర్శనం తరువాత మరో గుడికి ఎందుకు వెళ్లకూడదు ? వెళితే ఏమవుతుంది ? నేరుగా ఇంటికే ఎందుకే వెళ్లాలి.గాలి , నింగి , నేల , నీరు , నిప్పు ఇవే పంచభూతాలకు ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిసాయి.అందులో ఒకటే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం. అయితే ఇక్కడి గాలి స్పరించిన తరువాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్లకూడనదే ఆచారం.
అందులో నిజం లేకపోలేదు.సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది.
శ్రీకాళహస్తి లోని సుబ్రమణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలుగుతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే చేరాలని చెపుతారు ఇక్కడి పూజారులు.కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లిన దోష నివారణ ఉండదనేది అక్కడి పూజరులు చెపుతున్నారు.
**గ్రహణాలు .. శని బాధలు ..
పరమశివుడుకి ఉండవని. మిగితా అందరి దేవుళ్లకి శని ప్రభావం. గ్రహణ ప్రభావం ఉంటుందని చెపుతున్నారు.
దీనికి మరోక ఆధారం .. చంద్రగ్రహణం. ఈ రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు.గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు . కానీ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది.అంతే కాదు రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక దైవం దర్శనం అవసరం లేదు అంటున్నది శాస్త్రం.

1. నారసింహుడి భక్తులకు మరిన్ని ప్రసాదాలు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి భక్తులకు మరిన్ని ప్రసాదాలు అందుబాటులోకి రానున్నాయి. స్వామివారి లడ్డూ, పులిహోర, వడతో పాటు మరో 8 రకాల ప్రసాదాలు త్వరలో ప్రవేశపెట్టనున్నారు.లక్ష్మీనరసింహస్వామివారికి ప్రీతికరమైన రవ్వ లడ్డూ, కదంబం, పొంగళి, చక్కెర పొంగళి, కేసరి, శిరా, కట్టె, చిల్లి గారె ప్రసాదాలను తయారు చేయనున్నట్టు ఈవో గీత తెలిపారు. వీటి తయారీ కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించామని చెప్పారు. త్వరలో పనులు చేపట్టి మరో నెల రోజుల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. యాదగిరిగుట్టతోపాటు భద్రాచలం, వేములవాడ, బాసర, కొమురవెల్లి, ధర్మపురి క్షేత్రాల్లోనూ భక్తులకు 11 రకాల ప్రసాదాలను అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

2. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల కష్టాలు అన్ని ఇన్నీ కావు. రోజులు, గంటల తరబడి వేచియుంటేనే స్వామివారి దర్శనం కలుగుతుంది. ప్రసుత్తం స్వామివారి దర్శనం లభించాలంటే 30 గంటల (రెండున్నర రోజుల) సమయం తీసుకుంటుండగా ఓ కానిస్టేబుల్‌ నిర్వాకం చేతివాటం కారణంగా భక్తులను దొడ్డిదారిన పంపించడం పట్ల టీటీడీ తీవ్రంగా పరిగణించింది.

3. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలోని 30 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరికి 30 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 71, 461 మంది భక్తులు దర్శించుకోగా 26,631 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.77 కోట్లు వచ్చిందని అధికారులు వివరించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ దంపతులు బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి వారికి ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అర్చకులు మంత్రి దంపతులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు.