Business

ఏపీ తీరు వల్లే రైల్వే ప్రాజెక్ట్ ఆగింది.

ఏపీ తీరు వల్లే రైల్వే ప్రాజెక్ట్ ఆగింది.

ఏపీలో రైల్వే ప్రాజెక్టులకూ సీఎం జగన్(cm jagan) మొండి చెయ్యి చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్ట్‌లపై కేంద్ర రైల్వే శాఖ(Railways) క్లారిటీ ఇచ్చింది.ఏపీ తీరు వల్లే కోటిపల్లి-నర్సాపూర్ న్యూలైన్(57.21 కిలోమీటర్లు)( Kotipalli-Narsapur new line) ప్రాజెక్టు ఆగిపోయిందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాజెక్ట్‌లో తన వాటాగా చెల్లించాల్సిన వాటాను ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టు ఖర్చులో 25 శాతం భాగస్వామ్యం చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని పేర్కొంది. రూ.2120 కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 1091 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం కేవలం తన వాటాగా కేవలం రూ.2.69 కోట్లు మాత్రమే చెల్లించిందని చెప్పింది. ఏపీ ప్రభుత్వం(AP Govt). తన వాటాగా 354 కోట్లు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాను ఇవ్వకపోవడం వల్లే ప్రాజెక్టుఆగిపోయిందని స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు..

తెలంగాణాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేం

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ(Railway Coach Factory in Telangana) ఏర్పాటు చేయలేమని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. రైల్వేల భవిష్యత్తు అవసరాలకు కూడా సరిపోయే కోచ్‌ల తయారీ సామర్థ్యం ప్రస్తుతం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు సరిపడా కోచ్‌ల తయారీ స్థాపిత సామర్థ్యం ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీలకు ఉందని వెల్లడించింది. రాజ్యసభలో టీఆర్‌ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి(TRS MP Suresh Reddy) అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.