Devotional

శ్రీకాళహస్తీలో చిన్న కొట్టాయి_ఉత్సవం

శ్రీకాళహస్తీలో చిన్న కొట్టాయి_ఉత్సవం

చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తీశ్వర ఆలయం లో చిన్నకొట్టాయి ఉత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మే నెల 5వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు, పూజలు చేశారు. తొలుత ఆలయ అలంకార మండపం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ఆవరణలోని పగడ చెట్టుకింద ఏర్పాటు చేసిన పందిరిలో కొలువుతీర్చారు. ఇక్కడ ఉత్సవ మూర్తులకు పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, విభూది వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పరవశించిపోయారు.