Politics

మాయావతి ప్రధాని కావడానికి మద్దతు

pawan wants mayawati to be pm

????????????☘?????????☘???????????????☘????????????
బహుజన సమాజ్‌ పార్టీ అధ్యక్షురాలు మాయావతి భారతదేశ ప్రధాని కావాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మాయావతి ప్రధాని కావడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచి తాము మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన ఒకే ఒక్క నినాదంతో జరిగిందని, అది తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామనే నినాదమని పవన్‌ చెప్పారు. దళితుడని ముఖ్యమంత్రిని చేస్తామని కెసిఆర్‌ చెప్పారని అయితే ఏ పరిస్థితుల్లో దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదో వారికే తెలియాలని ఆయన అన్నారు. ఆరోజు తెలంగాణలో చేయలేకపోయినది తాము చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. మాయావతిని దేశ ప్రధానిని కావాలని తాము కోరుకుంటున్నామని ఆయన అన్నారు. మాయావతి అనుభవం తమకు మార్గదర్శనం కావాలని కోరుతున్నట్లు పవన్‌ చెప్పారు.