Food

జంక్ ఫుడ్‌తో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం

Junk Food Yields To Breast Cancer-Telugu Food And Diet News

టీనేజీ పిల్లలు జంక్‌ఫుడ్‌ అదేపనిగా తింటుంటారు. వారి ఈ అలవాటుతో భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. పిల్లలు తీసుకునే జంక్‌ఫుడ్స్, కేక్స్, బిస్కెట్ల వంటి పదార్థాల్లోని కొవ్వులు, నూనెల వల్ల వారు పెద్దయ్యాక కొన్ని అనర్థాలు కనిపించే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌కు చెందిన అధ్యయనవేత్తలు వెల్లడించారు. అనేక మంది టీనేజీ పిల్లలపై అధ్యయనం చేస్తూ దాదాపు పదేళ్ల పాటు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించగా ఈ విషయం తేటతెల్లమైంది. ఆ వయసులో ఉండే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు తోడుగా ఇక పెద్దయ్యాక ఆల్కహాల్‌ కూడా జత అయితే రొమ్ముక్యాన్సర్‌ ముప్పు మరింత పెరుగుతుందని తేలింది. ఈ వివరాలన్నింటినీ అమెరికా అసోసియేషన్‌ ఫర్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌ జర్నల్‌ అయిన ‘క్యాన్సర్‌ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్‌ అండ్‌ ప్రివెన్షన్‌’లో పేర్కొన్నారు.