Movies

అనుభవం తెచ్చిన మార్పు

Tamannah Completes 15 Years In Industry

కథానాయికగా పదిహేనేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది తమన్నా. అటు అందం ఇటు అభినయంతోనూ తెలుగు తెరపై తనదైన ముద్రవేసింది. ఇక ఆమె నృత్యాలకే చాలామంది అభిమానులున్నారు. అందుకే ఆమె ఇప్పటికీ వరుస అవకాశాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తొలినాళ్లలో మీలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? ఇప్పుడు మీ ప్రయాణంలో మీకు నచ్చే అంశం ఏంటని అడిగితే… ‘‘తొలి సినిమా చేసేటప్పుడు నాలో ఉత్సాహం నాకు బాగా నచ్చేది. అప్పుడు టీనేజ్‌ అమ్మాయిని కదా. అవకాశం ఇస్తే ఏదైనా చేసేయగలననే ఆత్మవిశ్వాసం ఉండేది. ఆ రోజులు గుర్తుకొస్తే నిజంగా నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక ఇప్పుడంటారా? నా ఆలోచనల్లో కనిపించే పరిణతి అంటే ఎంతో ఇష్టం. బహుశా నా అనుభవం తెచ్చిన మార్పేమో అది. చేస్తున్న పాత్రల విషయంలోనైనా, వ్యక్తిగత విషయాల్లోనైనా ఏ మాత్రం తడబాటు ఉండదు. చాలా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంటా. అది నా నటనపై కూడా ప్రభావం చూపిస్తుంటుంద’’ని చెప్పింది తమన్నా. ప్రస్తుతం ఆమె తెలుగులో గోపీచంద్‌తో కలిసి ‘సీటీమార్‌’ చిత్రంలో నటిస్తోంది.