WorldWonders

అయిదు వేలు ఎత్తుకుపోయిన కోతి

Monkey Snatches 5000 INR From A ToolBooth In India

కారులో నుంచి టోల్‌ గేట్‌ వద్ద ఉండే సిబ్బంది క్యాబిన్‌లోకి చొరబడ్డ ఓ కోతి రూ.5 వేలు ఎత్తుకెళ్లిన ఘటన కాన్పూర్‌ సమీపంలో జరిగింది. దీనికి సంబంధించిన మొత్తం దృశ్యం సీసీ కెమెరాలో రికార్డవడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాన్పూర్‌ సమీపంలోని డెహత్‌ ప్రాంతంలో బారా టోల్‌ ప్లాజాలో ఓ కారు వచ్చి ఆగింది. ఆగిన వెంటనే కారు కిటికీలో నుంచి కోతి సిబ్బంది టోల్‌ వసూలు చేసుకొనే క్యాబిన్‌ కిటికీ గుండా లోనికి ప్రవేశించింది. డబ్బు ఉంచే సొరుగు తెరిచే ఉండడంతో అందులో నుంచి చేతికందిన డబ్బు పట్టుకొని ఉడాయించింది. ఉన్నట్టుండి కోతి ప్రవేశించడంతో టోల్‌ వసూలు చేసే వ్యక్తి భయానికి గురయ్యాడు. కోతిని తరిమేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.