Kids

పిల్లల కోసం దూరదర్శన్ పాఠాలు

Doordarshan Video Lessons To Telugu Kids - Schedule Here

టెన్త్ విద్యార్థులకు దూరదర్శన్ పాఠాలు

ప్రస్తుత విద్యాసంవత్సరం తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతికి వెళ్లిన విద్యార్థులకు ఈనెల 30వ తేదీ వరకు దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా వీడియో తరగతులను ప్రసారం చేస్తున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులకు నేరుగా తరగతి గదుల్లో బోధించేందుకు అవకాశం లేనందున వీడియో పాఠాలను రోజూ రెండు గంటల పాటు ప్రసారం చేస్తారన్నారు.

ఉదయం 10 నుంచి 11గంటల వరకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గణితం, జనరల్ సైన్సు, సోషల్ స్టడీస్ సబ్జెక్టులను బోధిస్తారు.

పాఠశాలలు పునఃప్రారంభమయ్యేంతవరకు వీడియో పాఠాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

25న హిందీ, ఫిజికల్ సైన్సు,

26న ఇంగ్లీషు, నేచురల్ సైన్సు,

27న తెలుగు, సోషల్ స్టడీస్,

28న హిందీ, గణితం,

29న ఇంగ్లీషు, ఫిజికల్ సైన్సు,

30న తెలుగు, నేచురల్ సైన్సు

పాఠాలు బోధిస్తారని, ఈ అవకాశాన్ని పదోతరగతి విద్యార్థులు వినియోగించు కోవాలని కమిషనర్ కోరారు.