Health

వానాకాలం రోగనివారణ జాగ్రత్తలు

వానాకాలం రోగనివారణ జాగ్రత్తలు

వానాకాలం.. వ్యాధులతో జాగ్రత్త!
మన మీద తెచ్చిన ఒత్తిడి అంతా ఇంతా కాదు. దాదాపు మూడు నెలలు కాలు బయటపెట్ట నివ్వలేదు. ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలించినా- రోజులు భయం భయంగానే గడుస్తున్నాయి. ఇది మరింత జాగ్రత్తగా గడపాల్సిన సమయం. సాధారణ జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం వస్తే ఒకప్పుడు తేలి కగా తీసుకునేవాళ్లం. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. సాధారణంగా ఈ కాలంలో పిల్లలకు వచ్చే వ్యాధులు, వాటి నివారణల గురించి తెలుసుకుందాం.
*మలేరియా
మురుగు, నిలువ నీటిలో పెరిగే దోమల వల్ల మలేరియా వస్తుంది. ఒళ్లునొప్పులు, తీవ్రంగా వణకడం, కండరాల బలహీనత వంటివి లక్షణాలు.
**నివారణ
దోమలు లేకుండా చూడడమే నివా రణ. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమకాటు నుంచి రక్షణ కోసం ఒంటి నిండా ఉండే బట్టలు తొడగాలి. దోమ తెరలు వాడాలి.
*కలరా
ప్రాణాంతకమైన ఈ వ్యాధి అపరిశుభ్ర పరిస రాలు, నీరు, కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. వాంతులు, విరేచనాలు అదేపనిగా అవుతుంటాయి. శిశువులకు ఇది అత్యంత ప్రమాదమైనది.
**నివారణ
వ్యాక్సినేషన్‌ మొట్టమొదటి నివారణ మార్గం. ఒక డోసు ఆరు నెలల వరకు పని చేస్తుంది. కాచిన నీటినే తాగాలి. సాధ్యమైనంత వరకు రోడ్ల మీద దొరికే ఆహార పదార్థాలు తీసుకో కూడదు. పచ్చి కూరగాయలు, పండ్లు తీసుకొనే టప్పుడు జాగ్రత్త వహించాలి. పిల్లలకు మాంస పదా ర్థాలు పెట్టేటప్పుడు బాగా ఉడికించిన తరువాతే పెట్టాలి.
*టైఫాయిడ్‌
ఇది కూడా దోమల కారణంగానే వస్తుంది. ఇతర వ్యాధులతో పోల్చినప్పుడు ప్రమాదకరమైనది. రోగక్రిమి చికిత్స తీసుకున్న తరువాత కూడా శరీరంలోని గాల్‌బ్లేడర్‌ (పిత్తాశయం)లో నివాసం ఏర్పరచుకుని ఉంటుంది. జ్వరం, విపరీతమైన తలనొప్పి, కడుపునొప్పి వంటివి లక్షణాలు.
**నివారణ
ఈగలను, దోమలను నివారించాలి. పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే భుజించటం మంచిది. టైఫాయిడ్‌ రోగికి ద్రవపదార్ధాలు ఎక్కువగా ఇవ్వాలి. పరిశుభ్రత పాటించాలి.
*వైరల్‌ ఫీవర్‌
ఏడాది పొడవునా ఈ జ్వరాలు వచ్చినప్పటికీ వానాకాలంలో ప్రబలే అవకాశాలు ఎక్కువ. వాతావరణంలో హెచ్చుతగ్గులు సంభవించి నప్పుడు, గాలి ద్వారా వ్యాపించే వైరస్‌ వల్ల ఈ జ్వరం వస్తుంది. జలుబు, తీవ్రమైన జ్వరం, బలహీనత, గొంతునొప్పి లక్షణాలు.
**నివారణ
వానలో తడవకుండా ఉండడం చాలా మంచిది. ప్రతి రోజూ పసుపు కలిపిన పాలు తీసుకోవడం వల్ల వైరస్‌బారిన పడకుండా ఉండవచ్చు. ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో పుక్కిలించడం వల్ల గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
*గ్యాస్ట్రో సమస్యలు
ఆహారం, నీరు, పరిసరాల్లో ఉండే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి గ్యాస్ట్రో సమస్యలు వస్తాయి. గతంలో ఈ వ్యాధితో బాధపడేవారు వానా కాలంలో ఎక్కువగా ఇబ్బంది పడతారు. కడుపునొప్పి తీవ్రంగా ఉంటుంది. చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహారాన్ని తినడం వల్ల చేతిలోఉన్న బ్యాక్టీరియా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. వాంతులు అవుతాయి. మంట, ప్రేగుల నొప్పి, చికాకు వంటివి కలుగుతాయి.
**నివారణ
చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకో కూడదు. పరిశుభ్రమైన కాచిన నీటిని తరచూ తీసు కోవాలి. మసాలాలు, తీపి పదార్థాలు తీసుకోక పోవడమే మంచిది.
*డెంగ్యూ
దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల్లో ఇది అత్యంత ప్రమాదకరమైంది. కీళ్లు, కండరాల్లో విపరీతమైన నొప్పి, తలనొప్పి, బలహీనత, జ్వరం, శోషరస కణాల వాపు వంటివి రోగ లక్షణాలు.
**నివారణ
దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరం నిండా కప్పి ఉంచే వస్త్రాలు ధరించాలి.
*ఇన్‌ప్లూయింజా
ఉష్ణోగ్రతల్లో తేడాల వల్ల వచ్చే వ్యాధుల్లో ఇదొకటి. గాలిలో ఉండే వైరస్‌ ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. శ్వాస సంబంధిత వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దగ్గు, జలుబు సాధారణంగా కనిపిస్తాయి. ముక్కు కారడం, ఒళ్లునొప్పులు, గొంతు నొప్పి, జ్వరం రోగ లక్షణాలు.
**నివారణ
శక్తివంతమైన రోగనిరోధక శక్తిని కలిగివుండడమే దీనినుంచి రక్షణ. పోషకాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
*హెపటైటిస్‌-ఎ
తీవ్రమైన, ప్రమాదకర వ్యాధి. నీటి ద్వారా వేగంగా వ్యాపించి లివర్‌పై ప్రభావం చూపుతుంది. అపరిశుభ్రమైన నీరు, ఆహారం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. మానవ విసర్జకాలపై వాలిన ఈగల ద్వారా తినే ఆహారపదార్ధాలపైకి ఈ వైరస్‌ చేరుకుంటుంది. ఆ ఆహారాన్ని తీసుకోవడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. చర్మం, కళ్లు పసుపుపచ్చగా మారడం, కడుపునొప్పి, వాంతులు, డయేరియా, ఆకలి లేకపోవడం వంటివి రోగ లక్షణాలు.
**నివారణ
రోగనిరోధక శక్తిని పెంచే టీకాలు వేసుకోవాలి. పరిశుభ్రమైన ఆహారాన్నే తీసుకోవాలి. కాచిన నీటిని తాగాలి. బయట దొరికే ఆహార పదార్ధాలను తినకపోవడమే మంచిది.
*గజ్జి
ఇదొక చర్మ వ్యాధి. చర్మం మీద తీవ్ర బాధ కలిగించే దద్దుర్లు వస్తాయి. పరిమాణంలో ఎంతో చిన్నవైన పరాన్నజీవులు వెచ్చని, తేమ కలిగిన ప్రాంతాలైన చంకలు, చర్మం మడతలు, మోచేతులు, జననేంద్రియాలు, తల మీది చర్మంపై కూడా వృద్ధి చెందుతాయి. ఒకరి నుంచి మరొకరికి ఇవి వ్యాపిస్తాయి.
**నివారణ
చర్మవ్యాధి ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. బెడ్‌షీట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోని ఇతర పరిసరాలను కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. చర్మం కనపడకుండా పొడి బట్టలు ధరించాలి.
*****జాగ్రత్తలు తీసుకోవాలి
సీజన్‌ మార్పు వల్ల వాతావరణంలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా పెరుగుతాయి. దోమలు, ఈగలు ఎక్కువ. వీటివల్లే రోగాలు ఎక్కు వగా వ్యాప్తి చెందుతాయి. పిల్లలు ఈ కాలం ఎక్కు వగా వ్యాధుల బారిన పడతారు. జలుబు, దగ్గు, జ్వరం అనేవి సాధారణంగా వానాకాలం వచ్చే వ్యాధులు. అయితే వీటితో పాటు పరిసరాలు పరి శుభ్రంగా లేకపోవడం వల్ల టైఫాయిడ్‌, మలేరియా, జాండిస్‌ వంటి వ్యాధులు కూడా ప్రబలుతాయి.
* పిల్లలను వర్షంలో తడవకుండా చూడాలి.
* తాగే నీరు, కాచి చల్లార్చిన నీటినే వాడాలి.
* ఏ పూట వండుకొని ఆ పూటే తినాలి.
* చేతులు, కాళ్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం అలవర్చుకోవాలి.
* పట్టణాల్లో ఇళ్లు దగ్గరగా ఉండి వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది కనుక తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి.
* వాంతులు, విరేచనాలు అదేపనిగా అవుతున్న ప్పుడు మందులతో పాటు ఓఆర్‌ఎస్‌ తాగిం చాలి. అది లేనప్పుడు పంచదార, ఉప్పు కలిపిన కాచి చల్లార్చిన నీటిని వాడవచ్చు. అప్పటికీ తగ్గకపోతే వైద్యుణ్ణి సంప్రదించాలి.
* వ్యాధుల నుంచి రక్షణ కోసం పిల్లలకు టీకాలు వేయడం తప్పనిసరి.
* ఇప్పుడు వ్యాక్సినేషన్‌ యూనివర్సిల్‌గా వేస్తు న్నారు. ప్రభుత్వ జాబితాలో లేని టైఫాయిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రైవేటుగా తీసుకో వచ్చు. ఏదేమైనా వ్యాధులు రాకుండా ఉండాలంటే పర్యావరణ పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.
* పాలు, గుడ్డు, పప్పు ధాన్యాలు, ఆకు కూరలు, కార్బోహ్రైడేట్లు ఇవ్వడం ద్వారా పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడం ముఖ్యం.