Movies

జయప్రకాశ్‌రెడ్డి ఇక లేరు

జయప్రకాశ్‌రెడ్డి ఇక లేరు

సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినీమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో ఆయన గుంటూలో ఉంటున్నారు.జయప్రకాశ్‌రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెళ్ల. 1946 మే 8న జన్మించిన నటుడు జయప్రకాశ్‌రెడ్డి. బ్రహ్మపుత్రుడు చిత్రం ద్వారా తెలుగు సినీపరిశ్రమకు పరిచయమైన జయప్రకాశ్‌రెడ్డి. రాయలసీమ యాసలో సినీపరిశ్రమలో తనదైన ముద్ర వేసిన జయప్రకాశ్‌రెడ్డి…పలు చిత్రాల్లో ప్రతినాయకుడు, హాస్యనటుడిగా నటించిన జయప్రకాశ్‌రెడ్డి.