Health

కంటిచూపుకు తోడ్పడే కరివేపాకు

కంటిచూపుకు తోడ్పడే కరివేపాకు

“ ఆంటి-డయాబెటిక్ + హెయిర్ గ్రోత్ + ఫాట్ తగ్గుదల + అజీర్ణం + లివర్ + కంటి చూపు = కరివేపాకు “
*కరివేపాకు :– ( Murraya Koenigii ) మనం ఇంకా తమాషాగా చెప్పాలంటే ‘ తీసిపారేసే ఆకు ‘ అని కూడా అనచ్చు….. ఎందుకంటున్నాను అంటే … చాలా చాలా రేర్ గా కొద్ది మంది మాత్రమే ఈ ఆకు ను తింటుంటారు… ఈవెన్ పెద్దలు కూడా చాలా వరకు తీసేస్తూన్తారు… కానీ ఒక్కసారి మీరు ఈ క్రింది ఆర్టికల్ చదవండి .. మీకే తెలుస్తుంది … కరివేప గురుంచి మనకు తెల్సింది చాలా చాలా తక్కువని, నామ మాత్రంగా వాడడం వరకే మనకు తెల్సిందని. ఊహించనన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా .. ఒక్క సారి చదవండి….
*శాస్రీయ నామం – ముర్రయ కోయేనిగి ( Murraya Koenigii ) వాడుక నామం – కర్రీ లీఫ్, కరివేపాకు
మనం ఆకు మాత్రమే వాడుకుంటాము, కానీ ‘ ఆకు, రూటు, కాండం ‘ కూడా మెడిసినల్ గా బాగా ఉపయోగపడుతాయి అంటున్నాయి రీసెర్చ్ స్టడీస్.
*కరివేపాకు యొక్క మెడిసినల్ యుసెస్ మనకు తెలిసన ఒక్క సువాసనే కాకుండా, anti-microbacterial, anti inflammatory, antioxidant, anti Diabetic కూడా నండి……
*వేర్లు – బాడీ పెయిన్స్ కి ఉపయోగపడతాయి.
*కాండం – పాము కాటుకు నివారణగా వాడేవారు.
*Nutrients — కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్.
*విటమిన్స్—విటమిన్స్ A,B,C,E, నికోటినిక్ ఆసిడ్.
*మెడికల్ కాంపొనేన్ట్స్ – కార్బజోల్ ఆల్కలయిడ్స్ లైక్ మహానిమ్బిన్, ముర్రయనాల్ ( Mahanimbin, Murrayanol ),స్టీరాల్స్, ఫ్లేవోనాయిడ్స్– ఇవి మామూలు అంటి మైక్రో బియల్ ఆక్టివిటీ తో పాటు “ మస్కిటో రెపెల్లెంట్ “ గా కూడా పని చేస్తాయి అని నిరూపించబడింది.
*కరిపేపాకు పేస్టు లేదా జ్యూస్ = డయోరియా ( బేదులు ); కరిపేపాకు పేస్టు డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు. కరివేపాకు లోని కార్బజోల్ Extracts బాగా పనిచేస్తాయి.
*కరివేపాకులు + నిమ్మ రసం = Constipetion
*కరివేపాకులు లేదా పేస్టు + బట్టర్ మిల్క్ = అజీర్ణం (పరగడుపున తీసుకోవాలి )
*ఆంటి డయాబెటిక్ : కరివేపాకుల పౌడర్ డైరెక్ట్ గా ఆంటి డయాబెటిక్ గా పనిచేస్తుందని మద్రాస్ యునివర్సిటి, డిపార్టమెంట్ అఫ్ మాలిక్యులర్ బయాలజీ వారు నిరూపించారు.
*ఆంటి-ఒబెసిటి – కరివేపాకుల పౌడర్ భోజనం లో మొదటి రెండు,మూడు ముద్దలుగా తినండి… మనం తినే ఆహారం లోని Fat ( LDL )ని కంట్రోల్ చేస్తుంది. అందులోను విషతుల్యాలైన LDL లెవెల్స్ ని చాలా చాలా కంట్రోల్ చేస్తుంది. కేరళ లో ఒకప్పుడు ప్రధాన ఆహార పదార్థంగా సజెస్ట్ చేసేవారు ఫాట్ తగ్గడానికి.
*ఫర్ హెయిర్ : కరివేపాకుల పౌడర్ + నూనె ( జెనెరల్ గా వాడే నూనె ) = వెంట్రుకల రూట్స్ ని బలపరిచి హెయిర్ ఫాల్ ని, తెల్లబడటాన్ని ఆపి హెయిర్ గ్రోత్ ని పెంచుతుంది. ( అయితే మాములుగా అప్ప్లై చేసినట్టు కాకుండా మసాజ్ లాగా అప్లై చెయ్యాలి.)
*ఫర్ ఐ : Eye sight కి కావలసిన విటమిన్ A కరివేపాకులలో హై అమౌన్ట్స్ లో వుంటుంది. అందుచేత Eye sight తో బాధపడేవారికి కరివేపాకు చూర్ణం అత్యంత ఉపయోగకారి.
*ఫర్ లివర్ : వేపాకుల లోని టానిన్స్, కార్బజోల్ ఆల్కలయిడ్స్ లివర్ కి హెపటైటిస్, సిర్రోసిస్ నుండి పూర్తి రక్షణ ఇవ్వగలుగుతాయి. అంతే కాకుండా లివర్ ని ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడ గలిగే శక్తి ఈ టానిన్స్, కార్బజోల్ ఆల్కలయిడ్స్ కి వుంది.
* ఫర్ స్కిన్ : స్కిన్ ఇర్రిటేషన్స్ లో, దద్దుర్లు వంటి వాటిలో కరివేపాకుల ముద్ద ను అప్ప్లై చేస్తే తొందరగా హీల్ అవుతాయి. ఇన్ఫెక్షన్స్ నుండి కరివేపాకు కాపాడుతుంది.
కరివేపాకును నెయ్యితో కలిపి, బట్టర్ మిల్క్ తో కలిపి, కారం తో కలిపి, బొరుగులతో కలిపి, వొట్టి కరివేపాకు చూర్ణం ఇలా ఎన్ని రకాలుగైనా తీసుకోవచ్చు….. ఫ్రెష్ ఆకులతో అన్ని రకాలైన ఉపయోగాలు విధిగా అందుతాయి.