DailyDose

మైక్రోమాక్స్ నుండి సరికొత్త ఫోను-తాజావార్తలు–05/18

Micromax releases new phone india - may 18 2019 daily breaking news - tnilive

* హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో రైల్వేస్టేషన్‌ ప్రారంభమైంది. అమీర్ పేట్ హైటెక్ సిటీ రూట్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రోస్టేషన్ సేవలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణాలతో రైల్వేస్టేషన్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ స్టేషన్ ప్రారంభంతో నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో అన్ని స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫిల్‌్గనగర్‌, జర్నలిస్టుకాలనీ, నందగిరిహిల్స్‌, తారకరామనగర్‌, దీన్‌దయాల్‌నగర్‌, గాయత్రీహిల్స్‌, కేబీఆర్‌పార్క్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో మెట్రో రైలు సేవలు కొనసాగనున్నాయి.
* నెల్లూరు జిల్లాకావలిఆముదాలదిన్నే గ్రామంలో పోసిన మేఘన 17 సం” పదవ తరగతి పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపానికి గురై ఫ్యాన్ కు ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్యకావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందిందని ధృవీకరించిన వైద్యులు.
* సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రముఖ మాజీ క్రికెటర్‌‌ , స్టార్‍ ఫీల్డర్‍ జాంటీ రోడ్స్ ..బాగ్లిం్గంపల్లిలోని సరోజిని క్రికెట్‌‌ టెన్నిస్ అండ్‍ ఫిట్నెపస్‍ అకాడమీలో శుక్రవారం సందడి చేశాడు. మూడు రోజుల పాటు అకాడమీలో సాగే ఈ శిక్షణ తరగతులను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్బంగా క్రికెట్‌‌ ఆటలోని నైపుణ్యాలను, మెలకువలను విద్యార్థులకు వివరించాడు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 40 మంది విద్యార్థులు శిక్షణ శిబిరాల్లో పాల్గొంటున్నారు.
* నేచర్స్‌‌ బాస్కెట్‌‌లో నూరు శాతం వాటాలను గోద్రెజ్‌‌ ఇండస్ట్రీస్‌‌ నుంచి రూ. 300 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు రిటైల్‌‌ రంగంలోని స్పెన్సర్స్‌‌ రిటైల్‌‌ లిమిటెడ్‌‌ వెల్లడించింది. రూ. 300 కోట్లను నగదు రూపంలోనే చెల్లించనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో గ్రోసరీ చెయిన్‌‌ను నేచర్స్‌‌ బాస్కెట్‌‌ నిర్వహిస్తోంది. గోద్రెజ్‌‌ ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌‌కు నేచర్స్‌‌ బాస్కెట్‌‌ నూరు శాతం సబ్సిడియరీ. ఆర్‌‌పీ సంజీవ్‌‌ గోయెంకా గ్రూప్‌‌లోని స్పెన్సర్స్‌‌ రిటైల్‌‌ లిమిటెడ్‌‌కు ఇండియాలోని 39 సిటీలలో 156 స్టోర్స్‌‌ ఉన్నాయి.
* విజయవాడ..జాయింట్ కలెక్టర్ కృతికశుక్లా శనివారం దనేకుల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఓట్ల లెక్కింపు పై చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు..కళాశాలలో ఏడు ఆస్మెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలుసూచనలను చేశారు…
* సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రముఖ మాజీ క్రికెటర్‌‌ , స్టార్‍ ఫీల్డర్‍ జాంటీ రోడ్స్ ..బాగ్లింెగంపల్లిలోని సరోజిని క్రికెట్‌‌ టెన్నిస్ అండ్‍ ఫిట్నెపస్‍ అకాడమీలో శుక్రవారం సందడి చేశాడు. మూడు రోజుల పాటు అకాడమీలో సాగే ఈ శిక్షణ తరగతులను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్బంగా క్రికెట్‌‌ ఆటలోని నైపుణ్యాలను, మెలకువలను విద్యార్థులకు వివరించాడు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 40 మంది విద్యార్థులు శిక్షణ శిబిరాల్లో పాల్గొంటున్నారు. ఫస్ట్ డే కోచ్‍ రియాన్‍ మోర్గన్తొవ కలిసి జాంటీ రోడ్స్ విద్యార్థులకు బేసిక్స్ చెప్పడంతోపాటు ఆటలో చురుకుదనం, ఫీల్డింగ్‍ డ్రిల్స్ వంటి అంశాలను వివరించాడు. కోచ్ రియాన్‍ మోర్గన్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఆట మధ్యలో మంచి నీళ్లు తాగుతూ ఉండాలని, సన్‍ క్రీమ్ను తప్పక వాడాలని, ఇతరత్రా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ శిక్షణ శిబిరంలో సరోజిని అకాడమీ కార్యదర్శి, జాతీయ మాజీ వాలీబాల్ క్రీడాకారుడు, టీఎస్ఆయర్టీసీ సీనియర్‍ పీఆర్ఓమ మేనేజర్‍ జి.కిరణ్‍ రెడ్డి సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‍ క్రికేట్ అసోసియేషన్‍ సభ్యులు విజయ్‍ కుమార్‍ పాల్గొన్నారు. శిక్షణా తరగతుల వివరాల కోసం విజయ్‍ కుమార్‍(9860977222), మిహీర్‍ (84840224400)లను సంప్రదించవచ్చు.
* నేచర్స్‌‌ బాస్కెట్‌‌లో నూరు శాతం వాటాలను గోద్రెజ్‌‌ ఇండస్ట్రీస్‌‌ నుంచి రూ. 300 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు రిటైల్‌‌ రంగంలోని స్పెన్సర్స్‌‌ రిటైల్‌‌ లిమిటెడ్‌‌ వెల్లడించింది. రూ. 300 కోట్లను నగదు రూపంలోనే చెల్లించనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో గ్రోసరీ చెయిన్‌‌ను నేచర్స్‌‌ బాస్కెట్‌‌ నిర్వహిస్తోంది. గోద్రెజ్‌‌ ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌‌కు నేచర్స్‌‌ బాస్కెట్‌‌ నూరు శాతం సబ్సిడియరీ. ఆర్‌‌పీ సంజీవ్‌‌ గోయెంకా గ్రూప్‌‌లోని స్పెన్సర్స్‌‌ రిటైల్‌‌ లిమిటెడ్‌‌కు ఇండియాలోని 39 సిటీలలో 156 స్టోర్స్‌‌ ఉన్నాయి.
*చితురు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మరో రెండు ఎన్నికల కేంద్రాల్లో రీపోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుద్న తెలిపారు. ఈ రెండు పోలింగ్ బూత్ లకు కూడా ఆదివారం పోలింగ్ బూత్ లకు కూడా ఆదివారం పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు.
* దేశీయ మొబైల్స్ త‌యారీదారు మైక్రోమ్యాక్స్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ ఐవ‌న్‌ను తాజాగా విడుద‌ల చేసింది. రూ.4,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.
*ఉత్తరాఖండ్, నికోబార్ దీవుల్లో శనివారం తెల్లవారుజామున భూమి కంపించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 3.9 గా నమోదైంది. శనివారం తెల్లవారుజామున నికోబార్ దీవుల్లోనూ భూమి కంపించింది.నికోబార్ దీవుల్లో భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది.న్యూ ఐర్లాండ్ ప్రావిన్స్ లోని పాపు న్యూ జెనీవాలో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. 27.4 కిలోమీటర్ల లోతులో వచ్చిన భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. భూప్రకంపనలతో ప్రజలు ఆందోళన చెందారు.
*శనివారం లేదా ఆదివారం అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఇప్పటికే అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఉత్తర గాలులు రాయలసీమ, కోస్తాపైకి వీస్తుండటంతో.. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వడగాలులు, ఎండ తీవ్రత పెరుగుతాయని హెచ్చరించింది.
*ప్రపంచ కప్ అధికారిక గీతం స్టాండ్ బై ని ఐసీసీ శుక్రవారం విడుదల చేసింది. గాయకుల లోరెన్ .రుడియంతల్ కలిసి ఈ పాటను రూపొందించారు. ఈనెల 30న ప్రారంభం కాబోతున్న ఈమెగా ఈవెంట్ ను గుర్తు చేస్తూ ఈ పాప్ సాంగ్ ను తయారు చేశారు. ప్రతి అభిమాని ఈ టోర్నీలో పాల్గొనే తమ జట్ల పట్ల అభిమానాన్ని తెలిపేలా ఈ పాట సాగుతుంది. 48 మ్యాచ్ ల పాటు సుదీర్ఘంగా ఈ భారీ టోర్నీని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వీక్షించనున్నారు.
*వివాదాల వీరుడు నిక్ కిర్గియోస్ మరోసారి టెన్నీస్ కోర్టులో అనుచిత ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. ఇటాలియన్ ఓపెన్ సందర్భంగా అతను మైదానంలో భీభత్సం సృష్టించాడు. కాస్పర్ రూడ్ తో మ్యాచ్ సందర్భంగా రెండో సెట్ నడుస్తుండగా కిర్గియోస్ ప్రేక్షకుల పై అసహనం ప్రదర్శించారు. తానూ సర్వీస్ చేస్తున్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఏకాగ్రతతో దెబ్బ తీస్తున్నరంటూ స్టాండ్స్ వైపు చూస్తూ తిట్ల పురాణం అందుకున్నాడు. దీంతో చైర్ అంపైర్ అతడికి ఓక్ గేమ్ పెనల్టీ ఇచ్చాడు. దీంతో నిక్ ఆగ్రహం కట్టలు తెచుకుంది. రాకెట్ విసిరికొట్టాడు. నీళ్ళ సీసాను తన్నాడు. కుర్చీని తీసి విసిరి కొట్టాడు. గట్టిగా అరుస్తూ బూతులు తిడుతూ ఊగిపోయాడు. వెంటనే బ్యాగ్ సర్దుకుని మ్యాచ్ ముగించకుండానే మైదానం నుంచి వెళ్ళిపోయాడు.
*ప్రపంచ కప్ కు ఐసీసీ భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. లీగ్ దశలో మ్యాచ్ లు గెలిచే జట్ల నుంచి విజేత వరకు సుమారు రూ. 70 కోట్లు నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపింది. విజేతకు రూ.28 కోట్ల భారీ ప్రైజ్ మనీ అందించనుంది. ప్రపంచ కప్ చరిత్రలో ఇదే అత్యధిక నజరానా.
*జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా పంజ్ గమ్ అవంతిపురా ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఉన్నారని భద్రత సిబ్బంది చెప్పారు. ఆర్మీ జవాన్లు కాల్పులు కొనసాగిస్తున్నారు. గురువారం నుంచి భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం పుల్వామాలో గాలింపు చేపట్టారు. గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. పుల్వామా జిల్లాలో దాక్కున్న ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.
* ట్రంప్‌ వాణిజ్య యుద్ధంలో శాంతి జెండా ఎగిరింది. కెనడా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే స్టీల్‌ , అల్యూమినియం ఉత్పత్తులపై టారీఫ్‌లను ఎత్తివేశారు. సరికొత్త పశ్చిమ అమెరికా వాణిజ్య ఒప్పందానికి ఆమోద ముద్ర పడేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయాన్ని అమెరికా, కెనడా సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. స్టీల్‌ ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం టారీఫ్‌లను 48 గంటల్లోపు ఎత్తివేయనున్నారు. ఇటువంటి ఒప్పందాన్నే అమెరికా-మెక్సికోలు కూడా చేసుకోనున్నట్లు సమాచారం.
*టెలికాం నెట్‌వర్క్‌, సాఫ్ట్‌వేర్‌ అంశాల్లో భద్రత సాధించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చర్యలు విస్తరించాలని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. సమాచారం చౌర్యానికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రపంచ టెలికాం దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆ మంత్రిత్వ శాఖ సీనియర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ కె.రామచంద్‌ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు.
*నైరుతి రుతుపవనాలు రావడానికి అండమాన్‌, నికోబార్‌ సమీపంలో అనుకూల వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు శుక్రవారం తెలిపారు. రెండురోజుల్లో ఇవి అండమాన్‌ వద్ద ప్రవేశిస్తాయని అంచనా. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్‌ ప్రాంతం వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. తెలంగాణలో శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో పెనుగాలులు, వడగండ్లతో కూడిన కుంభవృష్టి కురిసింది.
*ముఖ్యమంత్రి కేసీఆర్‌ శని, ఆదివారాల్లో జిల్లాల్లో పర్యటించనున్నారు. రామగుండంలో నిర్మాణంలో ఉన్న ఎన్టీపీసీ విద్యుత్‌ప్లాంటును శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించి ఎన్టీపీసీ, జెన్‌కో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి కరీంనగర్‌లో బస చేస్తారు. ఆదివారం ఉదయం కాళేశ్వరం వెళ్లి అక్కడి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తారు.
*పదమూడేళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడిని ఆధార్‌ సాంకేతికతతో 19 ఏళ్ల వయసులో గుర్తించి అతని ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు హైదరాబాద్‌ సీఐడీ పోలీసులు. దీనికి సంబంధించిన వివరాలు.. ఉమ్మడి మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ శ్రీరాంనగర్‌ కాలనీకి చెందిన కల్లెం ఎల్లమ్మ, మనయ్య దంపతుల కుమారుడు కల్లెం విజయ్‌ అలియాస్‌ జాన్‌సన్‌ 2013లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
*చైనా పర్యటన సందర్భంగా తీసుకున్న ప్లాన్‌ను భారత్‌కు వచ్చిన తరువాత కూడా కొనసాగించి వసూలు చేసిన రూ.33,050 సొమ్మును వడ్డీతో సహా వినియోగదారునికి తిరిగివ్వాలంటూ హైదరాబాద్‌లోని భారతీ ఎయిర్‌టెల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఆదేశించింది. చైనా పర్యటన నిమిత్తం తీసుకున్న ప్లాన్‌ను భారత్‌కు తిరిగి వచ్చాక కూడా కొనసాగించి వసూలు చేసిన సొమ్మును వాపసు ఇప్పించాలంటూ ఆర్‌.ఆర్‌.స్టోన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ ఎస్‌.సందీప్‌రెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.
*బడిఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, విద్యార్థుల సంఖ్యను పెంచడం ప్రధాన లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ ‘ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇది జూన్‌ 4న ప్రారంభమై 12 వరకు కొనసాగనుంది. రోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు కార్యక్రమం చేపట్టాలని విద్యాశాఖ ఆదేశించింది. బడిబాటలో రోజువారీగా చేపట్టాల్సిన వాటితోపాటు ‘ప్రారంభానికి ముందు సంసిద్ధత’కు సంబంధించిన మార్గదర్శకాలను శాఖ కమిషనర్‌ వెలువరించారు.
*వేసవి రద్దీ కారణంగా సికింద్రాబాద్‌-కాకినాడ మధ్య మూడు ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటుచేశామని, వాటిని విజయవాడకు బదులు రాయనపాడు మీదుగా నడుపుతామని దక్షిణమధ్యరైల్వే శుక్రవారం ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 23 రాత్రి 8.45కి సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే రైలు (నంబరు: 07461) మరుసటి రోజు ఉదయం 7.30కి కాకినాడకు చేరుకుంటుంది. 24న రాత్రి 11.30కి సికింద్రాబాద్‌ నుంచి మరో రైలు కాకినాడకు బయల్దేరుతుంది. కాకినాడ నుంచి 26 సాయంత్రం 6.15కి బయల్దేరే బండి (నం.07462) మరుసటిరోజు తెల్లవారుజామున 5.55కి సికింద్రాబాద్‌ చేరుకుంటుందని సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు.
*పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైందని పాలిసెట్‌ కన్వీనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తొలిరోజు 12,511 మంది విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించారని, వీరిలో 12,303 మంది ధ్రువీకరణ పరిశీలనకు స్లాట్‌ ఎంచుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మొత్తం 34,901 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
*తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎస్పీఎంవీవీ పీజీసెట్‌-19 ఈ నెల 19న జరగనుంది. 2019-20 విద్యాసంవత్సరానికి మొత్తం 29 కోర్సుల్లో ప్రవేశాలకు అధికారులు మార్చి 21న నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. దరఖాస్తు గడువు ఈ నెల 10తో ముగిసింది.
*పరిసరాల్లో కాలుష్య సమస్యలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌ పీసీబీ) పేర్కొంది. పారిశ్రామిక కాలుష్య సమస్య అయితే టోల్‌ ఫ్రీ నంబరు 10741కు ఫోన్‌ చేయాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా చెత్తను కాల్చితే సంబంధిత సర్కిల్‌ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్‌కు లేదా వైద్య అధికారికి; వాహన కాలుష్య సమస్యలైతే రవాణాశాఖ, ట్రాఫిక్‌ పోలీసులకు పౌరులు ఫిర్యాదు చేయాలని మండలి తెలిపింది.
*ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్‌ పరిశోధన కేంద్రంతో పాటు ఆయన విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఓయూ గ్రంథాలయానికి భారతరత్న డా.బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూజీసీ మాజీ ఛైర్మన్‌ సుఖ్‌దేవ్‌ థోరట్‌ హాజరయ్యారు.
*బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ)లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఎడ్‌సెట్‌లో 98.02 శాతం మంది అర్హత సాధించారు. ఈ పరీక్షకు మొత్తం 11,650 మంది అభ్యర్థులు హాజరు కాగా.. వీరిలో 11,419 మంది ఉత్తీర్ణులయ్యారు.
* నైరుతి రుతుపవనాలు ముందస్తుగా అండమాన్‌ సముద్రం, నికోబార్‌దీవుల్ని తాకేందుకు అనువైన వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం వెల్లడించారు. శని, ఆదివారాల్లో ఇవి అక్కడి దక్షిణాది ప్రాంతాలను తాకే అవకాశం ఉందని వివరించారు. దీనిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామన్నారు. మరోవైపు దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాయలసీమ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం గరిష్ఠంగా కర్నూలులో 42.9 డిగ్రీలు, తిరుపతిలో 42.8, అనంతపురంలో 42.8, కడపలో 42.0, నెల్లూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాలులు వీచే సమయంలో ఎవరూ బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.
* చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అయిదు పోలింగ్‌ కేంద్రాల్లో ఈనెల 19న రీపోలింగ్‌ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఆ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, చిత్తూరు పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎన్‌.శివప్రసాద్‌ శుక్రవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.
*గురుదాస్‌పూర్‌ లోక్‌సభకు పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి, ప్రముఖ నటుడు సన్నీ దేవోల్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు గానూ ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సన్నీ దేవోల్‌ శుక్రవారం పఠాన్‌కోట్‌లో ఓ బహిరంగ సభను ఏర్పాటుచేశారు. అయితే ప్రచార సమయం ముగిసిన తర్వాత ఈ సభను నిర్వహించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
*మహాత్మాగాంధీ పాకిస్థాన్ జాతిపిత అంటూ మధ్యప్రదేశ్ భాజపా మీడియా విభాగం బాద్యుడైన సౌమిత్ర ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు వివాదాస్పదమైంది గాంధీజీ జాతిపిత కానీ పాకిస్థాన్ జాతిపిత భారతదేశంలో చాలామంది గాంధీలాగా జన్మించారు. కొందరు దేశానికి ఉపయోగపడితే మరికొందరి వాళ్ళ ప్రయోజనం లేకపోయింది అని పోస్టులో పేర్కొన్నారు. దీంతో సౌమిత్రను పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు భాజపా ప్రకటించింది. పాకిస్తాన్ అనే ప్రతిపాదనను బ్రిటిష్ వారు తాయారు చేశారు. ప్రధాని అవుదమనే ఆత్రుతలో నెహ్రూ జిన్నా దీన్ని సమర్దించారు. ఈ తతంగమంతా గాంధీ అసీస్సులతోనే నడిచింది. అందుకే ఆయన పాకిస్తాన్ జాతిపిత అవుతారు అని సౌమిత్ర తన వ్యాఖ్యలను సమర్దించుకున్నారు.
*శారదా కుంభకోణం కోల్ కతా మాజీ పోలీసు కమీషనర్ రాజీవ్ కుమార్ ను అరెస్టు చేయకుండా ఫిబ్రవరి 5న ఇచ్చిన రక్షణ ఉత్తర్వ్యును సుప్రీం కోర్టు శుక్రవారం రద్దు చేసింది. ఈ నిర్నాయం పై తగిన న్యాయస్థానాన్ని ఆశ్రయించి సహాయం పొందడం కోసం ఏడు రోజుల గడువు ఇచ్చింది.
*నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద హరియానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాకు చెందిన మరో రూ. .94 కోట్ల ఆస్తులను ఈడీ శుక్రవారం స్వాధీనం చేసుకుంది. ఇందులో కొంత భూమి, వ్యవసాయ క్షెతరం ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలతో సీబీఐ చౌతాలా అభయ్ చౌతాలా పై కేసు పెట్టింది గతనెల చౌతాలా కు చెందిన రూ. 3.68 కోట్ల ఆస్తులను ఈడీ స్వాదీనం చేసుకుంది.
* గుంటూరుసత్తెనపల్లి లో ముదిరిన అమరావతి స్కూల్ వివాదం.నేమ్ బోర్డు ఫెక్సి లను ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు.మొన్న అమరావతి స్కూల్ బోర్డు లను తోలగించి..ప్రగతి బోర్డును ఏర్పాటు
* మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌బాలానగర్ జోన్ పరిధిలోని, పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ మరియు ఇంటి తలుపులు పగలగొట్టి. దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను అదుపులోకి తీసుకొని. వారి వద్ద నుండి 73 తులాల బంగారం ఆభరణాలు, 66 తులాల వెండి వస్తువులు, Rs.86,500/- నగదు తో పాటు చోరి చేసిన 3 బైకులు స్వాధీనం చేసుకుని, రిమాండుకు తరలించినట్లు బాలానగర్ డిసిపి పద్మజ విలేఖరుల ప్రెస్ మీట్ లో తెలిపారు.
* హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో మంచు కురుస్తోంది. కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఎముకలు కొరికే చలిలో 2 వేల మంది పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహతంగ్ రహదారిపై కొండచరియలు విరిగి పడడంతో చోదహ్ – మోర్ హైవేను మూసివేశారు. 1,115 వాహనాలు నిలిచిపోయాయి. 4000 మంది టూరిస్టులు మర్హీ నుంచి మనాలికి తిరిగి వచ్చారు. రహదారిపై ఉన్న మంచును, విరిగిపడ్డ కొండచరియలను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాహనాలు తొలగిస్తున్నాయి
* గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో నివాసం ఉంటుంన్న ఇస్కెపల్లి కోటేశ్వరరావు (జంగమ కోటి ) ఇంటిపై కొంతమంది యువకులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో పెట్రోలు పోసి నిప్పు అంటించారు. ఆ సమయంలో కోటేశ్వరరావు అతని భార్య మరియు కొడుకు సుబ్రహ్మణ్యం ఉన్నారు. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా సత్వరమే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడం జరిగింది.
* దేశంలో ‘ఎన్నికల విధానం – జవాబుదారీతనం’ అంశంపై దిల్లీలోని ఐఐసీలో సదస్సు జరిగింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మదన్ లోకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పలువురు ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ్యారు.ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన 500, 2000 నోట్లు కారణంగా అవినీతి మరింత పెరిగిందని అన్నారు. పెద్ద నోట్ల కారణంగా రాజకీయ నాయకులు డబ్బు పంచేందుకు సులభమైందని విమర్శించారు. డిజిటల్ కరెన్సీ ద్వారా మాత్రమే ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయొచ్చని చంద్రబాబు అన్నారు. అందరూ వ్యక్తిగత జీవితాల గురించే ఆలోచిస్తున్నారని.. అందువల్లే రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య తగ్గుతోందనీ అన్నారు. సమాజం బాగుండాలంటే ప్రజలు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. ఎన్నికల్లో గెలుపోటముల కన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ముఖ్యమైన అంశమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
* గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం. వివరాలు తెలియాల్సి ఉంది
* అర్ధరాత్రి ఆర్టీఏ అధికారులు తనిఖీల్లో మద్యం తాగుతూ పట్టుబడ్డ విజయ దత్త సాయి ట్రావెల్స్ బస్40 మంది ప్రయాణికులతో ఏలూరు వెళ్తుండగా పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద తనిఖీల్లో గుర్తింపుబస్ సీజ్, డ్రైవర్ పై కేసు నమోదుబెజవాడ నుంచి అస్సాం వెళ్తున్న లారీ, మరో గూడ్స్ వాహనం డ్రైవర్లు కూడా మద్యం మత్తులో డ్రైవింగ్కేసులు నమోదు చేసిన ఆర్టీఏ
* కంచికచర్ల చెరువు కట్ట వద్ద జాతీయ రహదారిపై కారు వెనుక నుండి ఆటో ను ఢీకొన్న ఘటన ఈ ఘటన లో ఆటో లో ప్రయాణం చేస్తున్న 8 మంది కి స్వల్ప గాయాలు108 ద్వారా నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపుఅతి వేగంగా కారు వచ్చి నెమ్మదిగా వెళ్ళుతున్న ఆటో ను ఢీకొన్నట్టు ఆటో లో వున్న ప్రయాణికులు చెప్పుతున్న పరిస్థితి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కంచికచర్ల పోలీస్.
* విఆర్ఓ, విఆర్ఏ లు పంచాయతీ రాజ్ శాఖలో విలీనం.ఆర్ఐ,డిప్యూటీ ఎమ్మార్వో, ఎమ్మార్వోలు వ్యవసాయ శాఖలో విలీనం. మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ లాంటి పనులు స్వయం ప్రతిపత్తి గల కమిటీకి అప్పగింత.జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన మానిటరింగ్ కమిటీ.రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రెటరీ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలను మానిటరింగ్ చేసే కమిటీ.దేశ మొత్తం ఆశ్చర్యపోయేలా నూతన రెవిన్యూ చట్టం రాబోతుంది.రెవిన్యూ అధికారులు సమ్మెకు కూడా వెళ్లబోతున్నారని సమాచారం.అన్నిటికీ సిద్ధం అయ్యే సీఎం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సన్నద్ధం అయినట్లు తెలుస్తుంది.
* హిందూపురంచాకర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య మలుగూరు కు చెందిన శ్రీనివాసులు అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య * వేలూరు జిల్లా ఆర్కాడు కు చెందిన రాజా(25) ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుని జీవించే వాడు,అదే ప్రాంతానికి చెందిన దీపిక ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు,వీరికి ఏడాది వయసున్న ప్రినీష్ అనే బాబు వున్నాడు,గత కొన్ని రోజులనుండి దీపిక రాజా స్నేహితునీతో అక్రమ సంబంధం పెట్టుకుంది.నిన్న ఆర్కాడు పోలీస్ స్టేషన్ కి వెళ్లిన దీపిక తన భర్త,కుమారుడు ఈనెల 13 వ తేదీ నుండి కనిపించడం లేదనీ పిర్యాదు చేసింది,పోలీస్ వారు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానం చెప్పడంతో దీపికను అదుపులోకి లోతుగా విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి,భర్త,బిడ్డను తనే చంపి చెరువులో పూడ్చి పెట్టాననీ ఒప్పుకుంది,ఎంత మంది ఈ నేరానికి సహకరించారు అనే విషయం మీద పూర్తి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.