Sports

కోహ్లీ మీ కోరిక తీరుస్తాడు

Dont under estimate kohli. He knows how to balance says dravid - tnilive - telugu news international sports news in telugu

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీపై సీనియర్‌ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్‌ మ్యాచ్‌కూ విరాట్ తన ఆటతీరును మెరుగుపరుకుంటూ ఉన్నాడని తెలిపారు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. వరుసగా ఆరు పరాజయాలను చవిచూసి పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. ఐపీఎల్‌లో విఫలం కావడంతో రానున్న ప్రపంచ కప్‌లో కోహ్లీ సారథ్యంపై కొందరు విమర్శలు చేస్తున్నారు.దీనిపై రాహుల్‌ స్పందించారు. ‘విరాట్‌ను కొన్ని రోజులుగా గమనిస్తున్నాను. అతడు తనను తాను మెరుగుపరుచుకుంటున్నాడు. మరింత బాగా ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. వన్డే క్రికెట్‌లో సచిన్‌ తెందుల్కర్‌ 49-50 శతకాలు చేశారు. ఇన్ని శతకాలు చేయాలంటే చాల సమయం పడుతుందని అనుకునే వాళ్లు కూడా ఉన్నారు. కానీ విరాట్‌ కోహ్లీ మాత్రం సచిన్‌ రికార్డును అందుకోవడానికి మరో 10 శతకాల దూరంలో ఉన్నాడు. ఏదైనా ఒక పర్యటనలో కోహ్లీ విఫలమయితే..మరో పర్యటనలో దాని వెలితి తీర్చేస్తాడు. 2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో అతడు నిరాశపరిచాడు. తొలిసారి ఆస్ట్రేలియాలోనూ విరాట్ అంతగా రాణించలేదు. కానీ తర్వాత అతడి విధ్వంసం ఎలా కొనసాగిందో అందరికీ తెలిసిందే. తాను విఫలమయిన మ్యాచుల్లో వైఫల్యాలను గుర్తించి వాటిని అధిగమించడం వల్లే కోహ్లీ బెస్ట్‌ ఆటగాడిగా కొనసాగుతున్నాడు’ అని తెలిపారు. మహేంద్ర సింగ్‌ ధోనీ గురించి మాట్లాడుతూ..‘ పెద్ద టోర్నమెంట్లు ఆడేటప్పుడు ధోనీ ఆడే విధానం ఎంతో బాగుంటుంది. క్రికెట్‌ బృంద క్రీడ. సారథిగా ఉన్న వ్యక్తి ఆడాలి..ఆడించాలి. ఈ రెండింటిలోనూ ధోనీ పర్‌ఫెక్ట్‌. అండర్‌-19లో ఆటగాళ్లకు నేనిదే విషయం చెప్తాను. ధోనిని స్ఫూర్తిగా తీసుకోండని సూచిస్తుంటాను’ అని కితాబిచ్చాడు.