NRI-NRT

కోమటి-నాదెళ్ల వర్గానికి భారీ షాక్-TNI ప్రత్యేకం

Niranjan Wins Pulls Komati Jayaram And Nadella Gangadhar Out Of TANA

గత అయిదారు నెలలుగా సాధారణ ఎన్నికలను మరిపించే విధంగా తానా ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఇప్పుడే వెలువడ్డాయి. దీనిలో నిరంజన్ శృంగవరపు అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పాటు ఆయన ప్యానెల్ సభ్యులు అన్ని కార్యవర్గ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆయన ప్రత్యర్థి డా.కొడాలి నరేన్ ఓడిపోయారు. కొడాలి నరేన్‌ను బహిరంగంగా సమర్థించిన మాజీ అధ్యక్షులు కోమటి జయరాం, నాదెళ్ల గంగాధర్‌, వేమన సతీష్‌లకు ఇది ఊహించని షాక్. గత కొన్ని దశాబ్దాలుగా తానాలో వీరి ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ ఎన్నికతో వారి ఆధిపత్యానికి భారీగా గండి పడింది. నిరంజన్ శృంగవరపుకు తానా ప్రస్తుత అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి బాహాటంగా మద్దతు ఇచ్చి తమ అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఇక నుండి తానాలో జయశేఖర్, అంజయ్యల హవా కొనసాగనుంది. సమగ్ర ఫలితాలకు సమయం పట్టనుంది. నిరంజన్ శ్రేణుల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. ––కిలారు ముద్దుకృష్ణ