DailyDose

ESIలో మరో భారీ కుంభకోణం-నేరవార్తలు

ESIలో మరో భారీ కుంభకోణం-నేరవార్తలు

* వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను పల్లా అండ్ కో ఆక్రమించుకున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు.

* అరకు నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామ కాపరస్తుడు కొయ్యల అప్పలనాయుడు అనే వ్యక్తి రైల్వే ట్రాక్ పై పడి మృతిచెందాడు

* ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అనంతరం తదుపరి విచారణను జులై 1వ తేదీకి వాయిదా పడింది.

* ఈఏస్ ఐలో మరో కోట్లాది రూపాయల కుంభకోణం.ఈఎస్ఐలో చేతివాటం ప్రదర్శించిన అధికారులపై అధికారుల విచారణకు ఆదేశించిన డైరెక్టర్…రంగంలోకి దిగి విచారణ చేపట్టిన అధికారులు.మాజీ డైరెక్టర్, జేడీ, సీనియర్ అసిస్టెంట్ లు అక్రమాలపై విచారణ జరిపి ఆధారాలు సేకరిస్తున్న అధికారుల బృందం.కోట్ల రూపాయల మేర అక్రమాల కొనుగోలు జరిగినట్లు నిర్దారణ వచ్చిన బృందం.కొనుగోళ్ల అక్రమాలపై మంత్రి గుమ్మనురూ జయరాం సీరియస్.అనుమతి లేని సంస్థల మందులు కొనుగోలు చేసినట్లు నిర్దారణ.

* గుంటూరులో భారీగా గుట్కా నిల్వలు పట్టివేత.గుంటూరు పోలీసులు భారీ గుట్కా రాకెట్​ను ఛేదించారు.గుంటూరు జిల్లా పరిధిలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు రూ.97లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.కర్ణాటక, రాజస్థాన్ కేంద్రంగా గుట్కా తయారీ జరుగుతోందని, బెంగళూరుకు చెందిన సిద్ధప్ప అనే వ్యక్తిని కీలక పాత్రధారిగా గుర్తించినట్లుగా గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.రెండు రాష్ట్రాల నుంచి వస్తున్న గుట్కా నిల్వలు రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాలకు సరఫరా అవుతున్నాయని వివరించారు.