Movies

చిరంజీవి సరసన శృతి హాసన్ ..

చిరంజీవి సరసన శృతి హాసన్ ..

శ్రుతీహాసన్‌ లిస్ట్‌లో మరో భారీ ఆఫర్‌ చేరనుందా? అంటే ఫిల్మ్‌నగర్‌ అవుననే అంటోంది. చిరంజీవి సరసన ఈ బ్యూటీ జోడీ కట్టనున్నారని టాక్‌. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రుతీహాసన్‌ని కథానాయికగా ఎంపిక చేశారట. ఈ చిత్రంలో చిరంజీవి మత్స్యకారుడిగా కనిపించనున్నారని, టైటిల్‌ ‘వాల్తేరు వీరయ్య’ అనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక రవితేజతో చేసిన ‘క్రాక్‌’ హిట్‌తో శ్రుతి మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ‘సలార్‌’లో నటిస్తున్నారామె. ఇటీవలే బాలకృష్ణ సరసన సినిమా చేయడానికి అంగీకరించారు. ఇప్పుడు వార్తల్లో ఉన్నట్లు మరో పెద్ద ఆఫర్‌ ఉందా? చిరంజీవి–శ్రుతీ కాంబో కుదురుతుందా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.