DailyDose

కాంగ్రెస్ నిరసనలు ప్రారంభం-తాజావార్తలు–06/07

June 08 2019 - Daily Breaking News - Congress Protests Against TRS

* ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట కాంగ్రెస్‌ శాసన సభాపక్ష నేత భట్టి విక్రమార్క మల్లు నిరాహార దీక్షకు దిగారు. ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన దీక్షలో భాగంగా 36 గంటల పాటు ఆయన దీక్ష చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏఐసీసీ ఇంచార్జి ఆర్సీ కుంతియా దీక్షను ప్రారంభించగా.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, వీహెచ్‌, శ్రీధర్‌ బాబు, జీవన్‌రెడ్డి, సీతక్క, బలమూరి వెంకట్‌ తదితర పార్టీ నేతలు దీక్షలో కూర్చున్నారు.
* వీడియోకాన్‌ రుణాల మంజూరు వ్యవహారంలో మనీలాండరింగ్‌ క్రిమినల్‌ కేసును ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 10న దిల్లీలో ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. తొలుత ఈ నెల 6నే హాజరుకావాలని ఈడీ సూచించింది.
* నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురా గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఒక చిరుతపులి పడింది. బావిలోని నీటిలో అటు-ఇటు తిరుగుతూ.. దిక్కుతోచనిస్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉన్న చిరుతను గ్రామస్తులు గుర్తించారు. బావి నీటిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న చిరుత గురించి పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
* తెలంగాణలో ఎంసెట్‌ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.
* బ్రిటన్‌ ప్రభుత్వ పరిధిలోని విదేశీ, కామన్‌వెల్త్‌ కార్యాలయంలో ప్రధాన ఆర్థికవేత్తగా భారత సంతతికి చెందిన కుమార్‌ అయ్యర్‌ నియమితులయ్యారు. ఈ పదవిలో నియమితులైన తొలి భారత సంతతి వ్యక్తి ఈయనే కావడం గమనార్హం. ఇంతకుముందు ముంబయిలో బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్‌గా పనిచేశారు. విదేశీ విధానాల రూపకల్పనలో ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఆయన సూచనలు ఇస్తారు. ఆయన బాల్యం భారత్‌లోనే గడిచింది. తమిళం, హిందీ భాషల్లో ఆయనకు ప్రావీణ్యం ఉంది.
* ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ అమ్మకాలు సాగిస్తున్న ఈ–కామర్స్ సంస్థ అమెజాన్. పిడకలతో మొదలుకొని కొన్ని వేల రకాల ప్రొడక్ట్స్ను సేల్ చేస్తోంది. ఇప్పుడు తమ ప్రొడక్టుల డోర్ డెలివరీ విషయంలో ఇకపై అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఫాలో కానున్నట్లు చెప్పింది.
* చైనాలో దుకాణం క్లోజ్‌‌ చేస్తోన్న జెఫ్‌‌ బెజోస్ ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. ఇండియాలో పెట్టుబడులు కొనసాగిస్తోంది. తన ఇండియన్ యూనిట్ అమెజాన్ సెల్లర్ సర్వీసెస్‌‌లో తాజాగా రూ.2,800 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు ప్రకటించింది.
* ఈ నెల 14నుంచి ఈసెట్‌ కౌన్సెలింగ్‌ జరగనుంది. ఈసెట్‌ అడ్మిషన్ల కమిటీ సమావేశం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఎస్‌ విజయరాజు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ నెల 14,15,16 తేదిల్లో సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌, 14 నుంచి 17 వరకు ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. ఈ నెల 19న సీట్ల కేటాయిస్తారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్ధులు ర్యాంకు కార్డు, హాల్‌ టిక్కెట్‌, ఆధార్‌ కార్డు, టెన్త్‌ మార్కుల మెమో, డిప్లొమో డిగ్రీ మెమో, సర్టిఫికేట్‌, 7తరగతి నుంచి స్టడీ సర్టిఫికేట్లు, ఇన్‌కం సర్టిఫికేట్‌, క్యాస్ట్‌ సర్టిఫికేట్‌, స్థానికత సర్టిఫికేట్లను వెంట తెచ్చుకోవాలి.
* ప్రభుత్వ విప్‌ల నియామకానికి ముఖ్యమంత్రి జగన్‌ ఆమోద ముద్రవేశారు. ఏపీ ప్రభుత్వ చీఫ్‌విప్‌గా శ్రీకాంత్‌రెడ్డిని నియమించారు. ప్రభుత్వ విప్‌లుగా కొలుసు పార్థసారధి, కొరుముట్ల శ్రీనివాసులు, దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాడుగుల ముత్యాలనాయుడు నియమితులయ్యారు.
* దేశంలో పెట్రో ధరలు తగ్గాయి. తగ్గిన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాలలో పెట్రో ధలు ఈ విధంగా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రలో ధర లీటరుకు రూ.22 పైసలు తగ్గింది. దీంతో పెట్రోలు లీటర్ ధర 70.72 రూపాయలుగా ఉంది. అలాగే డీజిల్ ధర పాతిక పైసలు తగ్గింది.దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.64.65లుగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో అయితే పెట్రోలు ధర 22 పైలసు తగ్గి రూ.76.41లుగానూ, డీజిత్ ధర 27 పైసలు తగ్గి రూ.67.79లుగా ఉంది.
* శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు లోయలో పడిపోయిన ఘటన కలకలం రేపుతోంది. తమిళనాడు నుంచి శ్రీశైలానికి ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఒకటి బయలు దేరింది. ఆ బస్సు శ్రీశైలం ఘాట్ రోడ్డులో అదుపు తప్పడంతో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
* నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు కేరళకు వారం రోజుల పాటు ఆలస్యంగా చేరుకున్నాయి. మొత్తానికి రుతుపవనాల రాకతో కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెలఖారు నాటికి నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తాయి. నాలుగు నెలల పాటు నైరుతి రుతుపవనాలు కొనసాగనున్నాయి.
* పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో హౌరా బ్రిడ్జి సమీపంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జగన్నాథ్ ఘాట్ వద్ద ఉన్న ఓ కెమికల్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తోంది.
*నైరుతి రుతుపవనాలు శనివారం కేరళ తీరాన్ని తాకనున్నాయి. రానున్న 24 గంటల వ్యవధిలో అవి భారత భూభాగంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖ పేర్కొంటోంది. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించి నెమ్మదిగా దక్షిణం భారతదేశం నుంచి ఉత్తరానికి ఎగబాకనున్నాయి.
*తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన యాదవరెడ్డి కాంగ్రెస్‌లో చేరారంటూ చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలను చూపాలని శాసనమండలిని హైకోర్టు ఆదేశించింది.
*వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఆయేషా మస్రత్‌ ఖానం భర్త కైసర్‌ హమ్మద్‌ జగిత్యాల జిల్లా ధర్మపురి మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
*సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలాధ్యక్షుడి ఎన్నికలో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొంది. తెరాస తరఫున గెలిచిన ఎంపీటీసీ సభ్యులు చండూరు వెంకటేశ్వరరావు, గింజుపల్లి రమేశ్‌లు ఎన్నిక హాలులో పీవో సాక్షిగా వాగ్వాదానికి దిగారు.
*మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ అధ్యక్ష స్థానాల ఎన్నికలకు సంబంధించి రిజర్వుడ్‌ కేటగిరీలో ఒకరే అభ్యర్థి ఉంటే నేరుగా ఆయన/ఆమెనే ఎన్నుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
*రాష్ట్రంలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు భారీగా ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 12 నుంచి 22 వరకు ‘మీ ప్రగతికి ఎస్సీ హాస్టల్స్‌’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ పి.కరుణాకర్‌ తెలిపారు.
*పంటలను ప్రభుత్వం కొనడం కన్నా మార్కెట్‌లోనే మంచి ధర వచ్చేలా చూడాలని జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌ (సీఏసీపీ) ఛైర్మన్‌ విజయ్‌పాల్‌శర్మ సూచించారు.
*ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ (ఇన్వెస్టిగేషన్‌)గా ఆర్‌.కె.పలివాల్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1986 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన ఆయన ఇంతకుముందు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సంయుక్త ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ (ఇన్వెస్టిగేషన్‌)గా పనిచేశారు.
* రాష్ట్రంలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు భారీగా ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 12 నుంచి 22 వరకు ‘మీ ప్రగతికి ఎస్సీ హాస్టల్స్‌’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ పి.కరుణాకర్‌ తెలిపారు.
*రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి 24 వరకు పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వల పరీక్షల డైరెక్టర్‌ బి.సుధాకర్‌ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షలకు 61,431 మంది హాజరు కానున్నారని, 260 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.
*పాఠశాలల్లో విద్యార్థుల పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం ఆధార్‌ కార్డును ప్రామాణికంగా తీసుకోకూడదని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రాంతీయ, జిల్లా విద్యాధికారులకు పాఠశాల విద్య కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.
*సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 16న పరీక్ష నిర్వహించనున్నట్లు గురుకుల సొసైటీల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.
*ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు రాయితీపై విక్రయించేందుకు 7.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేసినట్లు తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీఎస్‌ సీడ్స్‌) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. పప్పుధాన్యాల విత్తనాల ధరలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. గతేడాదికన్నా రాయితీని 15 శాతం అదనంగా పెంచినట్లు వివరించింది. రాష్ట్రంలో మొత్తం 1116 విక్రయకేంద్రాల ద్వారా వీటిని విక్రయిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
*పాలనలో జగన్‌ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయి. మంత్రివర్గంలో సామాజిక సమతుల్యత ఉండాలన్న ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగన్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వచ్చే ఎన్నికలకు సంసిద్ధమవుతూనే పాలన అందిస్తాం.’
*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీకి సంబంధించి జూన్‌ నెలకుగానూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.208.25 కోట్లను గ్రాంటు రూపంలో మంజూరుచేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏపీతో పాటు మరో ఆరు రాష్ట్రాలకు జూన్‌ నెలకుగానూ లోటు భర్తీకి రూ.2850.57 కోట్లను మంజూరుచేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది.
*ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ సంస్థ ఛైర్మన్‌ పదవికి కె.వి.వి.సత్యనారాయణరాజు(చైెతన్యరాజు) రాజీనామా చేశారు. శుక్రవారం తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.