NRI-NRT

ట్రంప్‌కు కళ్లెం వేసిన అమెరికా కోర్టు

court blocks trump administration rule to ban overstaying immigrants

వీసా విధానాన్ని కఠినతరం చేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుకు అక్కడి అత్యున్నత న్యాయస్థానం కళ్లెం వేసింది.

ఆ ప్రక్రియను నిలుపుదల చేస్తూ, అమెరికా డిస్ర్టిక్ట్‌ కోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీచేసింది.

ఈ నిర్ణయం అమెరికాలో ప్రస్తుతం చదువుతున్న రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులకు గొప్ప ఊరటని ఇచ్చింది.

‘గడువు’ ముగిసిన 180 రోజుల తరువాత కూడా అమెరికాలో ఉంటే.. వరుసగా మూడేళ్లపాటు, ఏడాదికి పైగా ‘అక్రమం’గా ఉంటే.. 10 ఏళ్లపాటు అమెరికాలో వారి పునః ప్రవేశాలపై నిషేధం విధించేలా అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం కొత్త విధానం రూపొందించింది.

ఈ విధానంలో వారి సంరక్షకులు, సహభాగస్వాములు, పిల్లలను కూడా భాగంగా చేసి, వారిపైనా నిషేధం విధించాలని నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది