Devotional

చందన అలంకారుడైన నెమలి వేణుగోపాలుడు

Nemali Venugpala Swamy Decorated With Sandalwood Paste-tnilive devotional

1. చందన శోభితుడు నెమలి వేణుగోపాలుడు
కృష్ణాజిల్లాలో ప్రసిద్ద పుణ్య క్షెత్రమైన గంపలగూడెం మండలంలోని వేణుగోపాల స్వామీ ఆలయంలో స్వామివారి మూలవిరాట్ ను సోమవారం చందనంతో శోభాయమానంగా అలంకరించారు. వైశాఖ మాసం సందర్భంగా స్వామివారు ఉష్ణతాపం నుంచి సేద తీరేందుకు మూలవిరాట్ కు ఉదయం పంచామృత అభిషేకాలు నిర్వహించి, చందనంతో అలంకరించారు. చందన సోభితుడైన కృష్ణుడుని కృష్ణా, ఖమ్మం జిలాలకి చెందిన భక్తులు దర్శించుకున్నారు.
2. శ్రీవారి దర్శన సిఫార్సులకు మంగళం
సిఫారసు లేఖల స్వీకరణకు మంగళం పలకడంతో అదనంగా నిత్యం పది వేల మందికిపైగా సామాన్యులకు తిరుమల శ్రీవారి దర్శనం లభిస్తోంది. వారాంతంలో దాదాపు లక్ష మందికిపైగా శ్రీవారిని దర్శించుకోవడం రికార్డుకెక్కింది. తితిదే పంపిన లేఖ మేరకు.. రాజకీయాలతో ముడిపడి ఉన్న ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను స్వీకరించవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. తితిదే ధర్మకర్తల మండలిలోని రాజకీయాలతో సంబంధం లేని నలుగురికి తప్ప ఇతరుల సిఫారసు లేఖలకు టిక్కెట్లు జారీ చేయవద్దనే ఆదేశాలు అందాయి. రద్దీ ఎక్కువగా ఉండే వేసవి సెలవుల్లో వెలువడిన ఈ నిర్ణయం సామాన్యులకు వరంగా మారింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రాకముందు వీఐపీ బ్రేక్‌ దర్శనానికి నిత్యం మూడు వేలకుపైగా టికెట్లను ఇచ్చేవారు. వారి దర్శనానికి మూడు గంటలకుపైగా సమయం పట్టేది. ప్రస్తుతం 300 నుంచి 400 వరకే టిక్కెట్లు కేటాయిస్తుండటంతో వారికి గంటలోపే దర్శనం పూర్తవుతోంది. రెండు గంటలకుపైగా సమయం సామాన్య భక్తులకు అదనంగా కలసివస్తోంది. నిత్యం ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులు పదుల సంఖ్యలోనే వస్తున్నప్పటికీ వందలాది టిక్కెట్లు జారీ అవుతున్నాయి. టిక్కెట్లను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ సంఖ్య కూడా గణనీయంగా తగ్గనుంది. మిగిలే సమయంలో మరో రెండు వేల నుంచి మూడు వేల మంది అదనంగా శ్రీవారిని దర్శించుకోవచ్చు.
3. హజ్‌ యాత్ర ఖర్చులపై స్పష్టత
ఈ ఏడాది హజ్‌యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్న వారు చెల్లించాల్సిన నగదుపై హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా స్పష్టత ఇచ్చింది. నాన్‌ కుకింగ్‌-నాన్‌ ట్రాన్స్‌పోర్టు జోన్‌లో వసతికి దరఖాస్తు చేసుకొని హైదరాబాదు నుంచి బయలుదేరి వెళితే రూ.2,77,750, బెంగళూరు నుంచైతే రూ.2,90,150… అజీజియాలో వసతికి దరఖాస్తు చేసుకున్న వారు హైదరాబాదు నుంచి రూ.2,40,700, బెంగళూరు నుంచి రూ.2,53,100లను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఖుర్బానీ కోసం అదనంగా మరో రూ.9,150 చెల్లించాలి. ఇప్పటికే రెండు విడతలుగా కొంత మొత్తాన్ని హజ్‌ యాత్రికులు జమ చేశారు. మిగతాది జులై 4వ తేదీలోగా చెల్లించాలని గడువు విధించింది. ఈ మేరకు ఏపీ స్టేట్‌ హజ్‌ కమిటీ కార్యనిర్వాహక అధికారి తాజుద్దీన్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మెహరం కోటా కింద దేశవ్యాప్తంగా 500 మందిని ఎంపిక చేయగా.. రాష్ట్రానికి చెందిన 11 మంది ఎంపికైనట్లు పేర్కొన్నారు.
4. ఘనంగా తిమ్మరాయస్వామి మహోత్సవం
ములకనూరు మండలంలోని కంబదూరు గ్రామంలో తిమ్మరాయస్వామి మహోత్సవాన్ని గ్రామస్థులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలో శాంతి ఉండటంతోపాటు సకాంలో వర్షాలు కురిసి గ్రామం సుభిక్షంగా ఉండాలంటూ ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే శ్రీ తిమ్మరాయస్వామి మహోత్సవం గ్రామస్థులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం మధ్యలో ఉన్న బొడ్రాయిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తిమ్మరాయస్వామి వారిని గ్రామ వీధుల్లో సాంప్రదాయబద్ధంగా ఊరేగించారు. ఈ ఉత్సవాలకు నియోజకవర్గం నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
5. శ్రీవారిని దర్శించుకున్నఈస్రో ఛైర్మన్‌
కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వరస్వామిని ఈస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి తోమాల సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పీఎస్‌ఎల్వీ-సీ 46 ప్రయోగం నేపథ్యంలో తిరుమలేశుని ఆశీస్సులు పొందారు.భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ సీ46 ప్రయోగానికి ఈ రోజు ఉదయం 4.30 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ 25 గంటలపాటు నిర్విరామంగా కొనసాగిన అనంతరం బుధవారం ఉదయం 5.27 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ46 నింగిలోకి దూసుకెళ్లనుంది.
6. తిరుమల సమాచారంఓం నమో వేంకటేశాయ
ఈరోజుమంగళవారం 21-05-2019 ఉదయం 5 గంటల సమయానికి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ……శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్ లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు… శ్రీ వారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం” పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 06 గంటల సమయం పడుతోంది.. నిన్న మే 20 న 93,806 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.70 కోట్లు.
7. చరిత్రలో ఈ రోజు/మే 21
ఉత్తర ధృవంపై డ్రిప్టింగ్ ఐస్ స్టేషన్ వద్ద ఇవాన్ పాపనిన్
502 : సెయింట్ హెలెనా దీవిని పోర్చుగీస్ కి చెందిన నౌకాదళాధికారి అడ్మిరల్ జో డ నోవా కనుగొన్నాడు.
1829 : సికింద్రాబాదు కు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ జా అసఫ్ జాహి మరణం (జ.1768 ).
188 : ప్రాణవాయువు ను కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే మరణం (జ.1742).
1937 : ఆర్కిటిక్ మహాసముద్రం మంచు ఖండాల మీద సోవియట్ రష్యా తన మొట్టమొదటి వైజ్ఞానిక పరిశోధక కేంద్రం మొదలు పెట్టింది.
1991 : భారత 6 వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణం (జ.1944).
1994 : భారత దేశానికి చెందిన సుష్మితా సేన్ ,18 సంవత్సరాల వయసులో, 43వ విశ్వ సుందరి గా ఎన్నికైంది.
2018: తెలుగు రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మరణం (జ. 1940).
8. శుభమస్తు తేది : 21, మే 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
పక్షం :కృష్ణ (బహుళ) పక్షం
తిథి : తదియ
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 25 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 43 ని॥ వరకు)
నక్షత్రం : మూల
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 32 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 33 ని॥ వరకు)
యోగము : సిద్ధము
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 10 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 32 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 8 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 32 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 57 ని॥ వరకు)
రాహు : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 4 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 49 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 8 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 42 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : ధనుస్సు