DailyDose

30న సీఎంగా జగన్‌ ప్రమాణం-ఎన్నికల విశేషాలు-రాజకీయ-05/23

May 23 2019 - Daily Polittical News - Jagan oath taking ceremony on 30th

* ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైకాపా దూసుకెళ్తోంది. 150కి పైగా స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా వైకాపా సీనియర్‌నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 30న జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. ఎల్లుండి వైకాపా శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో ప్రభుత్వ సొమ్మును పంచిపెట్టి ఓట్లు పొందాలని చూశారని, అయినా ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదని ఉమ్మారెడ్డి విమర్శించారు.
*ఖమ్మంలో లక్ష ఓట్ల ఆధిక్యంలో నామా గెలుపు
ఖమ్మంలో కారు దూసుకుపోతోంది. తెరాస అభ్యర్థి నామ నాగేశ్వర రావు 18 రౌండ్లు ముగిసేసరికి 1,05,237 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ ఫిరాయింపులే తనను గెలిపిస్తాయనుకుని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి నిరాశే ఎదురైంది.అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తెరాస ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలిచింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన పాలేరు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, వైరా నుంచి స్వతంత్రంగా గెలిచిన రాములు నాయక్, సత్తుపల్లి తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు గులాబీ తీర్థం పుచ్చుకుంటామని ప్రకటించడం కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు.
*గుడివాడలో మరోసారి నాని హవా
గుడివాడలో మరోసారి కొడాలి నాని సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం 6 రౌండ్ ముగిసేసరికి 4000 పైచిలుకు మెజార్టీతో దూసుకుపోతున్నాడు. టీడీపీ నుంచి దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్ బరిలోకి దిగడంతో ఇక్కడ పోటీ దిగడంతో ఇక్కడ పోటీ ఉత్కంఠగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా జనాలు ఎక్కువ ప్రాధాన్యత చూపిన నియోజకవర్గాల్లో గుడివాడ కూడా ఒకటి. కొడాలి నాని రెబల్ క్యాండిడేట్ అవ్వడంతో అతన్ని ఓడించడానికి టీడీపీ సామ, ధాన, భేద, దండోపాయలను వాడింది. నాని కూడా ఈ సారి తన గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మరి నాని మరోసారి సత్తా చాటుతాడా? లేక దేవినేని కాలుమోపుతాడా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
*భువనగిరిలో కోమటిరెడ్డి గెలుపు
భువనగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి భారీ ఓటమిని చవిచూశారు. అయినప్పటికి కాంగ్రెస్‌ అధిష్టానం కోమటిరెడ్డిపై నమ్మకంతో ఆయనకు భువనగిరి లోక్‌సభ టికెట్‌ ఇచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిజం చేస్తూ కోమటిరెడ్డి విజయం సాధించారు. కోమటిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా భువనగిరి ప్రజలు ఈ విజయాన్ని ఆయనకు కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి మాట్లాడుతూ.. తన గెలుపుకు సహకరించిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. ఓటమి పాలైన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు.
*మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్ – మోహన్ బాబు
ప్రజల తీర్పు ఎప్పుడూ గోప్పదేనని సీనియర్ నటుడు వైకాపా నేత మంచు మోహన్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైకాపా ప్రభంజనం సృష్టించడంతో ఆయానఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి రానా బిడ్డ జగన్ మోహన్ రెడ్డికి ధైర్య సాహసాలతో పాటు అసీసులు ఇచ్చారన్నారు. వై.ఎస్.జగన్ 3648కిమీ పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని దీంతో ప్రజలు అసీసులు అందజేసి ముఖ్యమంత్రిని చేశారని అన్నారు. కచ్చితంగా ప్రజలకు జగన్ మేలు చేస్తారని, మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్ అని అభివర్ణించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైకాపా 150 సీట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
*భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపు
ఉమ్మడి నల్గొండా జిల్లాలోని భువనగిరి పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. ఆయన సమీప తెరాస ప్రత్యర్ధి బూర నరసయ్య గౌడ్ పై ఆయన ఘన విజయం సాధించారు.
*25న వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం భేటీ
వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ శానససభా పక్ష సమావేశం ఎల్లుండి(శనివారం) జరగనుంది. తాజా ఎన్నికల ఫలితాలను సమీక్షించిన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యం సాధించే దిశగా దూసుకుపోతోంది. 150 పైగా స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయ దుందుభి మోగించనుంది.
*నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రాములు గెలుపు
నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పోతుగంటి రాములు ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవిపై రాములు గెలుపొందారు. రాములుకు 476123 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి 293529 ఓట్లు పోలయ్యాయి. 182594 ఓట్ల మెజార్టీతో రాములు విజయం సాధించారు.
*విజయనగరం, పార్వతీపురం, చింతలపూడిలో వైసీపీ గెలుపు
ఏపీలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. విజయనగరం వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి విజయం సాధించారు. అలాగే పార్వతీపురం వైసీపీ అభ్యర్థి జోగారావు ఘనవిజయం సాధించారు. 22,391 ఓట్లతో విక్టరీ సాధించారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఎలీజా గెలుపొందారు.
*అసెంబ్లీలో బీజేడీ, లోక్‌సభలో బీజేపీ ప్రభంజనం!
ఒడిశాలో ఓటర్లు అనూహ్యమైన తీర్పును ఇచ్చారు. రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న బిజూ జనతా దళ్ పార్టీకే ఒడిశా ఓటర్లు బ్రహ్మరథం పట్టారనే విషయం తాగాజా విడుదలవుతున్న ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే అసెంబ్లీలో బీజేడీవైపు మొగ్గు చూపిన ఒడిశా ఓటర్లు, లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపినట్లుగా ప్రస్తుతం విడుదలవుతున్న ఫలితాల్ని చూస్తే అర్థమవుతోంది.మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఒడిశాలో 99 స్థానాల్లో బీజేడీలో ముందంజంలో ఉంది. గురువారం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపులో బీజేడీ మరోసారి తన సత్తాను చాటుతోంది. నవీన్ పట్నాయక్‌నే మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే నాలుగు సార్లు పూర్తికాలం పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన నవీన్.. ఐదోసారి ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమేనని తెలుస్తోంది.
*బెంగాల్‌లో దీదీకి షాక్
పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. మొత్తం 42 లోక్‌‌సభ నియోజకవర్గాలు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 18 స్థానాల్లో ముందంజలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ బాగా నష్టపోయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం సీట్లలో 36 స్థానాలతో అఖండ మెజారిటీ సాధించిన టీఎంసీ, ఈసారి 22 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఇక 2014 ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ, ఏకంగా 16 స్థానాల్లో తన ప్రాబల్యాన్ని మెరుగుపరుచుకుంది. ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజం చేసే విధంగా అత్యధిక స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది.
*ఓటమి భయంతోనే విపక్షాల విమర్శలు’
ప్రతిపక్షాలు ఈవీఎంలపై లేనిపోని అనుమానాలు లేవనెత్తడం ద్వారా ప్రజాతీర్పునే అగౌరవ పరుస్తున్నాయంటూ భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా బుధవారం ఆరోపించారు. ఓటమి భయంతోనే విపక్షాలు ఈవీఎంలపై విమర్శలకు దిగుతున్నాయంటూ అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. పోలింగ్‌ ఆరోదశ తర్వాతి నుంచే ప్రతిపక్షాలు ఈవీఎంలపై అనుమానాలు లేవనెత్తడం మొదలైందనీ…ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత విమర్శలు మరింత ఉధృతమైనాయన్నారు. అసలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఆధారంగా ఈవీఎంల విశ్వసనీయతను ఎలా ప్రశ్నిస్తారంటూ అమిత్‌ షా సూటిగా అడిగారు.
*మంచి ఫలితాలు సాధిస్తాం
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. బుధవారం నల్గొండలో పార్లమెంటు ఓట్ల లెక్కింపు ఏజెంట్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నందున, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు అందరూ సంబంధిత కేంద్రంలోనే ఉండాలని సూచించారు. వీవీప్యాట్‌ స్లిప్పులు, ఈవీఎం ఓట్లకు వ్యత్యాసం ఉంటే వెంటనే రిటర్నింగ్‌ అధికారులను సంప్రదించాలన్నారు. లెక్కింపులో అక్రమాలు బయటపడితే, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.
*22 పార్టీలు చెప్పినా చెవికెక్కదా?
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఐదు వీవీప్యాట్ల లెక్కింపును తొలుత నిర్వహించాలన్న విపక్షాల విన్నపాన్ని తోసిపుచ్చిన ఈసీపై ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మండిపడింది. బుధవారం ఈ విషయంపై ఆ పార్టీ కోశాధికారి, సీనియర్‌ నేత దురైమురుగన్‌ మాట్లాడుతూ… వీవీప్యాట్లను ఓట్ల లెక్కింపు అనంతరం చివరిలోనే లెక్కిస్తామని చెప్పడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? అని ప్రశ్నించారు.
*ఐదు లోక్‌సభ స్థానాల్లో విజయావకాశాలు
తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో భాజపా ఓటింగ్‌ శాతం గణనీయంగా పెరుగుతుందని.. సికింద్రాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా ఎవరు ఉండాలన్న దానిపై ఓటర్లు స్పందించడంతో తెలంగాణలో భాజపాకు లాభించిందని.. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు కలిసి జరిగి ఉంటే తెరాస గెలిచే స్థానాలు 50కి పరిమితమై ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు.
*ఆరేడు ఎంపీ స్థానాలు గెలుస్తాం: భట్టి
తెలంగాణలో 6 నుంచి 7 ఎంపీ సీట్లు కచ్చితంగా కాంగ్రెస్‌కే లభిస్తాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తంచేశారు. మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డిలతో కలిసి బుధవారం ఆయన మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ గురువారం ఫలితాల అనంతరం తప్పకుండా యూపీయేనే అధికారంలోకి వస్తుందన్నారు.
*భాజపాకు 200 స్థానాలకు మించి రావు’
లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తోసిపుచ్చారు. భాజపా 200కు మించి స్థానాలను గెలుచుకోలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో బీఎస్పీ అధినేత మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేశ్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ కీలకపాత్ర పోషిస్తారన్నారు.
*ఫలితాలన్నీ తెరాసకే అనుకూలం
రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను తెరాస కైవసం చేసుకుంటుందని, దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. యాదాద్రి క్షేత్ర సందర్శనకు బుధవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలకు ముందస్తుగా యాదగిరీశుడిని దర్శించి ఆశీస్సులు పొందడం తన అలవాటన్నారు. లోక్‌సభ ఫలితాలు వెలువడ్డాక, ప్రధాని ఎంపికలో కేసీఆర్‌ కీలకపాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
*ఫలితాలన్నీ తెరాసకే అనుకూలం
రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను తెరాస కైవసం చేసుకుంటుందని, దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. యాదాద్రి క్షేత్ర సందర్శనకు బుధవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలకు ముందస్తుగా యాదగిరీశుడిని దర్శించి ఆశీస్సులు పొందడం తన అలవాటన్నారు. లోక్‌సభ ఫలితాలు వెలువడ్డాక, ప్రధాని ఎంపికలో కేసీఆర్‌ కీలకపాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
*పరిషత్‌ ఛైర్మన్‌ ఎన్నికలను 28నే నిర్వహించాలి
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడే 27వ తేదీ మరుసటిరోజు అంటే 28నే..మండల, జిల్లా పరిషత్‌ల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇవ్వాలని భాజపా కోరింది. ఆలస్యమైతే శిబిరాలు, డబ్బు రాజకీయాలతో బేరసారాలు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ నేతృత్వంలోని బృందం బుధవారం ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డికి వినతిపత్రం అందించింది.
*అల్లర్లకు వైకాపా కుట్ర: ఆనంద్‌సూర్య
ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వేమూరి ఆనంద్‌సూర్య ఆరోపించారు. బుధవారం ఉండవల్లిలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లాలో తెదేపా నేత శేఖర్‌రెడ్డి దారుణ హత్య ఇందులో భాగమేనని మండిపడ్డారు.
*ఓటమి భయంలో వైకాపా: దివ్యవాణి
ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైకాపా కుట్రలు పన్నిందని, వాటిని ప్రణాళిక ప్రకారం తెదేపాపై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని తెదేపా అధికారి ప్రతినిధి దివ్యవాణి పేర్కొన్నారు. మరోసారి ఓడిపోతామన్న భయంతోనే వైకాపా మైండ్‌ గేమ్‌ ఆడుతోందని విమర్శించారు. బుధవారం ఉండవల్లిలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
*జనసేనది సైలెంట్‌ ఓటింగు: మాదాసు గంగాధరం
రాష్ట్రంలో జనసేన పార్టీకి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని, ప్రస్తుత ఎన్నికల్లో తమకు నిశ్శబ్ద ఓటింగ్‌ జరిగిందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ మాదాసు గంగాధరం వెల్లడించారు. విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు.
*శ్రమ వృథాకాదు.. నిరాశవద్దు : రాహుల్‌
నకిలీ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు చూసి నిరాశ చెందవద్దంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీ కార్యకర్తలను బుధవారం కోరారు. కార్యకర్తలు తమపై తాము నమ్మకాన్ని కోల్పోకుండా అప్రమత్తంగా, చురుగ్గా వ్యవహరించాలన్నారు. రాగల 24 గంటలు అత్యంత కీలకమైనవనీ భయాందోళనలు అనవసరమనీ ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తల శ్రమ వ్యర్థం కాదంటూ ట్వీట్‌ చేశారు. చివరగా ‘జైహింద్‌’ అంటూ ట్వీట్‌ ముగించారు. t