Movies

ఐక్యతే సఖ్యత

Shruthi Hassan Speaks Of Unity

‘‘నాకు తెలిసినంత వరకూ చాలామంది ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం ఒక స్త్రీ మరో స్త్రీతో కలసి ఐకమత్యంగా ఉండకపోవడమే అనిపిస్తోంది. దీన్ని అధిగమించడానికి నా టీమ్‌లో అందరూ కలిసుండే వాతావరణాన్ని సృష్టిస్తున్నాం’’ అని శ్రుతీహాసన్‌ అన్నారు. ఇటీవల ఓ సందర్భంలో ఫెమినిజమ్, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ గురించి శ్రుతీహాసన్‌ మాట్లాడుతూ – ‘‘నా చిన్నప్పటి నుంచే మా అమ్మానాన్న నన్ను స్వాతంత్య్రంగా, స్ట్రాంగ్‌ ఉమెన్‌గా పెంచారు. నన్ను పెంచింది ఓ స్ట్రాంగ్‌ మ్యాన్‌ (తండ్రి కమల్‌హాసన్‌). అందుకే నేను మగాళ్లను ద్వేషించే కేటగిరీలో లేను. నాతో పాటు మా ఇంట్లో మరో ఇద్దరు శక్తిమంతమైన మహిళలు ఉన్నారు (తల్లి సారిక, చెల్లెలు అక్షరని ఉద్దేశించి). ప్రస్తుత కాలంలో స్త్రీవాదం అనేది వివిధ రూపాల్లో రూపాంతరం చెందింది. లండన్‌లో నా మ్యూజిక్‌ బ్యాండ్‌లో టీమ్‌లో అందరూ ఉమెనే ఉన్నారు. ఉమెన్‌ అని వాళ్లకు జాబ్‌ ఇవ్వలేదు. వాళ్ల ప్రతిభను చూసే ఇచ్చాను. ఒకరిని ఒకరు సపోర్ట్‌ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం’’ అని శ్రుతీహాసన్‌.