DailyDose

జగన్ క్యాబినెట్ ఇదే-తాజావార్తలు–06/07

June 07 2019 - Daily Breaking News - YS Jagan Cabinet 2019 List

* ఉప ముఖ్యమంత్రులు వీరే…
1) రాజన్న దొర- ST (సాలూరు)
2) సుచరిత-SC(పత్తిపాడు)
3) అంజాద్ భాషా-మైనార్టీ (కడప)
4) పార్థసారధి- BC (పెనమలూరు)
5) ఆళ్ల నాని – కాపు (ఏలూరు)

*** మంత్రులు.

ధర్మాన కృష్ణదాస్‌ (శ్రీకాకుళం)
బొత్స సత్యనారాయణ (విజయనగరం)
పాముల పుష్ప శ్రీవాణి (విజయనగరం)
అవంతి శ్రీనివాస్‌ (విశాఖ)
కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి)
పినిపె విశ్వరూప్‌ (తూర్పుగోదావరి)
పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (తూర్పుగోదావరి)
కొడాలి నాని (కృష్ణా)
వెల్లంపల్లి శ్రీనివాస్‌ (కృష్ణా)
పేర్ని నాని (కృష్ణా జిల్లా)
బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (ప్రకాశం)
మేకపాటి గౌతమ్‌ రెడ్డి (నెల్లూరు)
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూలు)
ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి)
చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (పశ్చిమ గోదావరి)
తానేటి వనిత (పశ్చిమ గోదావరి)
మేకతోటి సుచరిత (గుంటూరు)
మోపిదేవి వెంకటరమణ (గుంటూరు)
బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (కర్నూలు)
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు)
గుమ్మనూరు జయరాములు (కర్నూలు)
నారాయణస్వామి (చిత్తూరు)
అంజాద్‌ బాషా (కడప)
శంకర్‌నారాయణ (అనంతపురం)

రేపు ఉదయం 8 39 కి. తన ఛాంబర్ లోకి సీఎం జగన్ ప్రవేశం…సచివాలయం లోకి సీఎం జగన్ వచ్చిన వెంటనే బ్లాక్ 1 ముందు స్వాగతం పలక నున్న శృంగేరిపీఠ వేద పండితులు.
* జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరసగా రెండోరోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. క్షేత్ర స్థాయి కార్యకర్తలకు అండగా నిలవాలని పవన్ నేతలకు సూచించారు.
* రేపు అన్నిశాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముందు జగన్‌ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఐదేళ్లలో చేపట్టబోయే కార్యక్రమాలతో పాటు నవరత్నాలు, అవినీతి రహిత పాలనపై చర్చ జరపనున్నారు. అలాగే వివిధశాఖల పరిస్థితి, మార్పులపై జగన్‌ నివేదిక కోరనున్నారు.
* అమరావతి సచివాలయ ప్రాంగణంలో శనివారం జరగనున్న ఆంధ్ర్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాటు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 11.49 గంటలకు మంత్రులు పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయం వెలుపల మంత్రి వర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అక్కడ జరుగుతున్న పనులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పరిశీలించారు. సభా వేదిక, గ్యాలరీలు, బారి కేడ్లు, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజా ప్రతినిధులు, అతిథులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
* మరికొద్ది రోజుల్లో లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ శుక్రవారం కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు.
* భారత వాతావరణశాఖ 8 రాష్ట్రాలకు శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, మేఘాలయ, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి వచ్చే ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాల ఆగమనంతో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందు వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశా
*ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారామ్‌, డిప్యూటీ స్పీకర్‌గా పీడిక రాజన్న దొరను నియమించనున్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం తమ్మినేని సీతారామ్‌, రాజన్నదొర ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గం నుంచి తమ్మినేని ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ప్రొటెం స్పీకర్‌గా శంబంగి వెంకట చిన అప్పలనాయుడును నియామకం కూడా దాదాపు ఖరారైంది. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం నుంచి అప్పలనాయుడు గెలుపొందారు.
* టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ శుక్రవారం ఉదయం బంజారాహిల్స్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు. టీవీ 9 ట్రేడ్‌మార్క్‌, కాపీరైట్లను అక్రమంగా విక్రయించారనే ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌తో పాటు మరో ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణకు హాజరు కావాలని బంజారాహిల్స్‌ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఆయన పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. ఏసీపీ కేఎస్‌ రావు.. రవిప్రకాశ్‌ను ప్రశ్నిస్తున్నారు. మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు టీవీ 9 ట్రేడ్‌ మార్క్‌, కాపీ రైట్లు ఎందుకు విక్రయించారనే దానికి సంబంధించి రవిప్రకాశ్‌ను ప్రశ్నిస్తున్నారు.
*జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో నలుగురు ముష్కరులను మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లాలోని లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలతో కలిసి నిర్భంద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ముష్కరులు భద్రతా సిబ్బందిపై కాల్పులు ప్రారంభించగా.. భద్రతా బలగాలు దీటుగా తిప్పికొట్టాయి.
*ఉదయం నష్టాలతో మొదలైన స్టాక్‌మార్కెట్లు ప్రస్తుతం స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 21, నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.69.37గా ఉంది.
*నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలో విస్తరించేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఈ నెల 8వ తేదీకి మహారాష్ట్ర నుంచి కేరళ తీరం వరకు ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
*ఎమ్మెల్సీ సభ్యత్వంపై అనర్హతకు సంబంధించిన రికార్డులతోపాటు వీడియోలను ఉపశీర్షికలతో (సబ్‌టైటిల్స్‌) ఇవ్వాలన్న గత ఆదేశాల మేరకు అన్ని రికార్డులను సీల్డ్‌కవర్‌లో మండలి తరఫు న్యాయవాది హైకోర్టుకు అందజేశారు.
*మృగశిరకార్తెను పురస్కరించుకొని ఈ నెల 8న నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగే చేప ప్రసాదం పంపిణీ కోసం ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నాలుగు రోజుల నుంచి చేపట్టిన ఏర్పాట్లు గురువారం రాత్రికి కొలిక్కి వచ్చాయి.
* భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశించారు. గురువారం అమరావతిలోని తన కార్యాలయం నుంచి చిత్తూరు జిల్లా కలెక్టర్‌ నారాయణ్‌ భరత్‌గుప్తా, తితిదే ఈవో సింఘాల్‌, అధికారులతో వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు.
*రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మా-డి కోర్సులు నిర్వహించేందుకు యూనివర్సిటీ, అనుబంధ కళాశాలలు, జాతీయ సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి పొందిన ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ కళాశాలల వివరాల్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
* భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశించారు. గురువారం అమరావతిలోని తన కార్యాలయం నుంచి చిత్తూరు జిల్లా కలెక్టర్‌ నారాయణ్‌ భరత్‌గుప్తా, తితిదే ఈవో సింఘాల్‌, అధికారులతో వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు.
*దేశంలోని పలు ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో నడుస్తున్న సాంకేతిక విద్యాసంస్థల్లోని బీటెక్‌ కోర్సుల్లో (2019-20) ప్రవేశం కోసం జోసా ఛాయిస్‌ ఫిల్లింగ్‌ ప్రక్రియ జూన్‌ 16 నుంచి ప్రారంభమవుతుందని వరంగల్‌ ఎన్‌ఐటీ ప్రవేశాల ఛైర్మన్‌ ఆచార్య కేఎన్‌ఎస్‌.విశ్వనాథం ఒక ప్రకటనలో తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్‌) పరిధిలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల(ఏఈఈ) పోస్టులకు ఈ నెల 9వ తేదీన రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు డిస్కం సీజీఎం సంగీతరావు ఒక ప్రకటనలో తెలిపారు.
* దేశంలోని పలు ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో నడుస్తున్న సాంకేతిక విద్యాసంస్థల్లోని బీటెక్‌ కోర్సుల్లో (2019-20) ప్రవేశం కోసం జోసా ఛాయిస్‌ ఫిల్లింగ్‌ ప్రక్రియ జూన్‌ 16 నుంచి ప్రారంభమవుతుందని వరంగల్‌ ఎన్‌ఐటీ ప్రవేశాల ఛైర్మన్‌ ఆచార్య కేఎన్‌ఎస్‌.విశ్వనాథం ఒక ప్రకటనలో తెలిపారు.
*ఇరవై సూత్రాల పథకం ఛైర్మన్‌ వై.శ్రీనివాస శేషసాయిబాబు రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. గత నెల 24వ తేదీన ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సంబంధిత రాజీనామా అదే తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
*గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల మంత్రుల కార్యాలయాల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసిన పీఆర్వో, ఎమ్మెల్వోలను తొలగిస్తూ సమాచార ప్రచార శాఖ కమిషనర్‌ వెంకటేశ్వర్‌ మెమో జారీ చేశారు. మొత్తం 28 మందిని తొలగించారు.
*రాష్ట్ర అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) కార్పొరేషన్‌ ఛైౖర్మన్‌ పదవికి కాకి గోవిందరెడ్డి గురువారం రాజీనామా చేశారు. సంబంధిత కార్పొరేషన్‌ ఎండీకి రాజీనామా పత్రాన్ని అందించినట్లు ఆయన చెప్పారు.
* అధికారులు మాట వినకపోతే చెప్పుతో కొట్టాలంటూ బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని లలిత్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్న రామ్ రతన్ కుష్వాహ ఈ మేరకు తన కార్యకర్తలతో మాట్లాడుతున్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
* ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం 8.39నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు. సెక్రటేరియట్‌ మొదటి బ్లాక్‌లో సీఎం జగన్‌ కార్యాలయం ఉంది.
శనివారం ఉదయమే కొత్త మంత్రులు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.49 నిమిషాలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. సచివాలయం సమీపంలోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత తొలి కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ ఏర్పాట్లను పోలీస్‌ ఉన్నతాధికారులు పరిశీలించారు.
* రాష్ట్రానికి కొత్త మంత్రుల పేర్లు ఖరారుమంత్రులుగా ఖరారైన వారికి ఫోన్లు చేస్తున్న వైకాపా అధిష్ఠానంమంత్రులుగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స పేర్లు దాదాపు ఖరారుమంత్రులుగా పెద్దిరెడ్డి, సుచరిత పేర్లు దాదాపు ఖరారుమంత్రులుగా గౌతంరెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌ పేర్లు దాదాపు ఖరారు.