Devotional

విజయవాడ కాషాయమయం

Vijayawada becomes colored in Saffron-Sarada Peetha Event

శ్రీ శార‌దా పీఠ ఉత్త‌రాధికారి స‌న్యాస స్వీకార మ‌హోత్స‌వం అంగ‌రంగ వైభవంగా సాగింది. శార‌దా స్వ‌రూపంగా స్వామి స్వ‌రూపానందేంద్ర దివ్య ఆశీస్సులు అందించ‌గా, బాల స్వామి కాషాయం ధ‌రించారు. కృష్ణా న‌దీ తీరంలో ఉండ‌వ‌ల్లి క‌ర‌క‌ట్ట‌పై గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద ఆశ్ర‌మంలో, శార‌దా పీఠ ఉత్త‌రాధికారి స‌న్యాస స్వీకార మ‌హోత్స‌వంతో మూడో రోజు ఆధ్యాత్మిక అల‌లు వీచాయి. బాల స్వామి ద‌గ్గ‌రుండి స్వామి స్వ‌రూపానందేంద్ర హోమాలు నిర్వ‌హింప‌జేశారు.విశాఖ శారదాపీఠానికి ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్ శర్మ కాషాయ వ‌స్త్ర‌ధార‌ణ‌తో ద‌ర్శ‌నిమిచ్చారు. వైశ్వానర స్థాలీపాకం, విరజాహోమాలు, సావిత్రీ ప్రవిలాపనం, శిఖా, కటిసూత్ర, యజ్ఞోపవీత పరిత్యాగం, ప్రేషోచ్చారణం, కాషాయ, దండ, కమండలలు ధారణ, మహావాక్యోపదేశం ఇచ్చారు.రాష్ట్ర మంత్రులుపెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, వెల్లంప‌ల్లి శ్రీనివాస్, అంబికా కృష్ణ‌, గోక‌రాజు గంగ‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు. కృష్ణా న‌దీ తీరంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని స్వ‌రూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు.
1. నేడు పూరిలో దేవస్నాన వేడుక
ఒడిశాలోని పూరి శ్రీక్షేత్రంలో సోమవారం జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల దేవస్నాన వేడుక జరగనుంది. రథయాత్రకు ముందుగా ఏర్పాటయ్యే ఈ స్నానవేడుక కీలకమైంది. చతుర్ధామూర్తులను 108 కలశాల పవిత్ర జలంతో అభిషేకిస్తారు. అనంతరం గజానన రూపంలో భక్తులకు దర్శనమిచ్చే దేవుడు అనారోగ్యానికి గురైనట్లు భావిస్తారు. దేవతా మూర్తులను ఒనొసొనొ(చీకటి) మందిరానికి తరలించి పక్షం రోజులపాటు గోప్య చికిత్స నిర్వహిస్తారు. దీంతో ఈ పక్షం రోజులు భక్తులకు స్వామి దర్శనభాగ్యం ఉండదు. మళ్లీ ఆషాఢ శుక్ల పాడ్యమి(జులై 2)నాడు రత్నసింహాసనంపై మూర్తుల నవయవ్వన దర్శనభాగ్యం కలుగుతుంది. జులై 4వ తేదీన విశ్వప్రసిద్ధ రథయాత్ర వేడుక నిర్వహించనున్నారు.
2. జనసంద్రంగా మారిన యాదాద్రి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్త జనసంద్రంగా మారింది. ఆదివారం వారాంతపు సెలవు కావడంతో వివిధ జిల్లాలు, ప్రాంతాల నుంచి యాత్రికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ వీధులు కిక్కిరిసి పోయాయి. ఒకవైపు దైవ దర్శనం.. మరోవైపు మొక్కుపూజలు.. పుణ్యస్నానాలు.. ప్రసాదాల కొనుగోలు.. తలనీలాల సమర్పణ కోసం భక్తులు బారులు తీరారు.
3. శాస్త్రోక్తంగా సన్యాస దీక్ష
విశాఖ శ్రీశారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులు కానున్న కిరణ్కుమార్ శర్మ సన్యాస దీక్షా స్వీకార కార్యక్రమాన్ని విజయవాడ కృష్ణా నదీ తీరంలోని గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం నాటి కార్యక్రమంలో అష్టశ్రాద్ధకర్మలు నిర్వహించారు. అంతకుముందు గాయత్రీ మంత్రోపాసన చేసి మహాగణపతి, రాజశ్యామలాదేవికి విశేష అర్చనలు చేశారు. కర్ణాటకలోని మత్తూరు గ్రామం నుంచి వచ్చిన ప్రముఖ వేదపండితులు కిరణ్కుమార్ చేత సన్యాస దీక్షా సంబంధిత హోమాలు చేయించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి పీఠార్చనలు చేసి శారదా చంద్రమౌళీశ్వరులకు పుణ్య జలాలతో అభిషేకార్చనలు నిర్వహించారు. ఆదివారం ఉదయం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం దర్శించుకుని ఆశీర్వాదం అందుకున్నారు. సోమవారంతో సన్యాసదీక్షా కార్యక్రమం ముగుస్తుందని ధర్మాధికారి కామేశ్వరశర్మ తెలిపారు.
4. కనులపండువగా జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఆదివారం వైభవంగా పరిసమాప్తం అయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు దేవతామూర్తులు స్వర్ణ కవచధారులై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఉదయం శ్రీవారి ఆలయంలో మహాశాంతి హోమాన్ని అర్చకులు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి స్నపన తిరుమంజనం జరిగింది.
5.. చూడముచ్చటగా కనకాభిషేకం
తిరుపతిలోని శ్రీవాసవీ ఆర్యవైశ్య సేవా సమాజం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా తిరుపతి-తిరుచానూరు రోడ్డులోని తితిదే శ్రీపద్మావతి కల్యాణ మండపం వేదికగా ఆదివారం కనకాభిషేక ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. 60 వసంతాలు పూర్తి చేసుకున్న 108 మంది వృద్ధ ఆర్యవైశ్య దంపతులకు సామూహిక కనకాభిషేక మహోత్సవాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి తరలి వచ్చిన దంపతులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
6. ఆది దంపతుల సేవ పూర్వజన్మ సుకృతం
ఆది దంపతుల సేవ పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై ఆది దంపతుల నగరోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఉత్సవాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి ఆధ్యాత్మిక భావాన్ని పెంచడం అభినందనీయమన్నారు. మల్లికార్జున మహా మండపం నుంచి ప్రారంభమైన ఆది దంపతుల ఊరేగింపు కనకదుర్గానగర్, రథం సెంటరు, వినాయకుడి గుడి, దుర్గగుడి ఘాట్ రోడ్డు మీదుగా ఇంద్రకీలాద్రి పైకి చేరింది. దారి పొడవునా భక్తులు హారతులు ఇచ్చి ఉత్సవమూర్తులకు స్వాగతం పలికారు. మంత్రి స్వామి పల్లకీని మోశారు. దేవస్థానం ఈవో కోటేశ్వరమ్మ, వన్టౌన్ సీఐ కాశీవిశ్వనాథ్, దేవస్థానం ఉద్యోగులు బలరామ్, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
7. మస్తు – నేటి పంచాంగం
తేది : 17, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పౌర్ణమి
(ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 21 ని॥ వరకు)
నక్షత్రం : జ్యేష్ట
(ఈరోజు ఉదయం 10 గం॥ 40 ని॥ వరకు)
యోగము : శుభము
కరణం : బవవర్జ్యం : (ఈరోజు రాత్రి 7 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు రాత్రి 8 గం॥ 49 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 22 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 12 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 2 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 32 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 37 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 15 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 51 ని॥ లకు
8.చరిత్రలో ఈ రోజు** జూన్, 17*
* సంఘటనలు*
1775: ఆమెరికన్ రివల్యూషన్ వార్. బోస్టన్ బయట వున్న బంకర్ హిల్ ని, బ్రిటిష్ సైన్యం స్వాధీనం చేసుకుంది.
1789: ఫ్రెంచి రివల్యూషన్. ఫ్రాన్స్ లోని మూడవ ఎస్టేట్ (సామాన్య జనం) తమంతట తామే, నేషనల్ అసెంబ్లీ గా ప్రకటించుకున్నారు.
1885: స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గా పిలువబడే ప్రఖ్యాత శిల్పము ఈ రోజు న్యూయార్క్ ఓడరేవు ను చేరింది (ప్రెంచి దేశ ప్రజలు బహూకరించారు అమెరికన్లకు).
1940: సోవియట్ యూనియన్ 3 బాల్టిక్ దేశాలను ( ఎస్తోనియా, లాట్వియా, లిథూనియా) ఆక్రమించింది.
1944: ఐస్ లాండ్ దేశము డెన్మార్క్ నుండి విడివడి స్వతంత్ర దేశముగా అవతరించింది.
1948: డగ్లస్ డి.సి-6 (యునైటెడ్ ఏర్ లైన్స్ ఫ్లైట్ 624), పెన్సిల్వేనియా లోని మౌంట్ కేమెల్ దగ్గర కూలి, అందులోని 43మంది మణించారు.
1963: దక్షిణ వియత్నాంలో బౌద్ధుల సమస్య.
1972: రిఛర్డ్ నిక్సన్ పతనానికి దారితీసిన వాటర్ గేట్ కుంభకోణం బయట పడటానిక్ కారకులైన 5గురు మనుషులను అరెస్ట్ చేసారు.
1978: విశాఖపట్నం గరాభివృద్ధి సంస్థ (వుడా) ఏర్పడింది.
1987: డస్కీ సీసైడ్ స్పారో జాతికి చెందిన ఆఖరి పక్షి మరణించటంతో, ఆ జాతి పూర్తిగా ఈ భూమి మీద నుంచి అంతరించింది.
1991: సర్దార్ వల్లభ భాయ్ పటేల్, రాజీవ్ గాంధీ లకు భారతరత్న ను వారి మరణానంతరం భారత ప్రభుత్వం ఇచ్చింది.
ఎల్ సాల్వడార్, గ్వాటెమాల దేశాలలో, ఈ రోజు, ఫాదర్స్ డే జరుపుకుంటారు.
విస్తీర్ణంతో, విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంీట్ అథారిటీ (వుడా) గా 1978 జూన్ 17 నాడు ఏర్పాటు చేసింది. *
1994: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు అమెరికా లో ప్రారంభమయ్యాయి.
2012: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.
* జననాలు*
1239: మొదటి ఎడ్వర్డ్, ఇంగ్లాండు రాజు (మ.1307).
1682: చార్లెస్-12, స్వీడన్ రాజు (మ.1718).
1913: తిరుమల రామచంద్ర, సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృత, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త (మ.1997).
1973: లియాండర్ పేస్, భారత టెన్నిస్ క్రీడాకారుడు .
* మరణాలు*
1631: ముంతాజ్ మహల్, ప్రసవ సమయంలో మరణించింది. ఆమె జ్ఞాపకార్ధం, ఆవిడ భర్త, మొగల్ చక్రవర్తి షాజహాన్ 1, ముంతాజ్ మహల్ సమాధిగా తాజ్ మహల్ ని 20 సంవత్సరాలు కష్టపడి నిర్మింపచేసాడు.
1858: ఝాన్సీ లక్ష్మీబాయి, భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు. (జ.1828)
1946: చిలకమర్తి లక్ష్మీనరసింహం, ప్రసిద్ధ తెలుగు రచయిత. (జ.1867)
*పండుగలు మరియు జాతీయ దినాలు*
పంచ ఎడారి, రవు వ్యతిరేక దినం
జెమ్లా ఇంతిఫద డే (సహ్రావి ఆరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్)
బంకర్ హిల్ డే (సఫోల్క్ కంట్రీ, మసాచుసెట్స్, అమెరికా).
9. కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌
బెజవాడ కనక దుర్గమ్మను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం దర్శించుకున్నారు. సీఎం ఆలయానికి చేరుకోగానే అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్‌ వెంట కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. అమ్మవారి సన్నిధిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఆహ్వాన పత్రికకు ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం తాడేపల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ నివాసానికి కేసీఆర్ బయల్దేరారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్‌ను ఆహ్వానించనున్నారు. అలాగే విభజన సమస్యలపై తెలుగు ముఖ్యమంత్రులు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
10. మోహినీ అవతారంలో సర్వలోక రక్షకుడు
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన సోమ‌వారం ఉదయం గోవిందుడు మోహినీ అవతారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పల్లకీ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం సకల లోక కల్యాణకారకుడు అయిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు దివ్యమోహినీ రూపంలో ఉత్సవమూర్తియై భక్తులను తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచుకోలేకపోయింది. కనుక శ్రీవారు జగన్మోహినియై పల్లకీలో కూర్చొని ఉంటారు. ఈనాటి శ్రీవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది. అనంత‌రం ఉద‌యం 10.00 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం వైభ‌వంగా నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చంద‌నంతో అబిషేకం చేశారు. కాగా సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.30 నుండి 10.00 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి. ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణా, కంకణభట్టార్‌ శ్రీసూర్యకుమార్‌ ఆచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ప్ప‌లాయ‌గుంట శ్రీ‌చంద్ర‌మౌళిశ్వ‌ర‌స్వామివారికి ప‌ట్టు వ‌స్త్ర‌లు బ‌హూక‌ర‌ణ‌ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో సోమ‌వారం రాత్రి గ‌రుడ వాహ‌నాన్ని పుర‌ష్క‌రించుకుని ఉద‌యం ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి అప్ప‌లాయ‌గుంటలోని శ్రీ‌చంద్ర‌మౌళిశ్వ‌ర‌స్వామివారికి ప‌ట్టు వ‌స్త్ర‌లు బ‌హూక‌రించారు.
11.శ్రీ ప్ర‌స‌న్న‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ
శ్రీ ప్ర‌స‌న్న‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ఆల‌యంలో నిర్వ‌హిస్తున్న ధార్మిక‌, సంగీత‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర సంగీత‌, నృత్య క‌ళాశాల ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా సోమ‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల వివ‌రాలిలా ఉన్నాయి.అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మండ‌పంలో ఎస్‌.వి.సంగీత కళాశాల ఆధ్వ‌ర్యంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు డి.పి.పి. ఆధ్వ‌ర్యంలో శ్రీ విష్ణుస‌హ‌స్ర‌నామ పారాయణం నిర్వహించారు. ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ ఇ.హేమంత్‌కుమార్ ధార్మికోప‌న్యాసం చేశారు. సాయంత్రం 4.00 నుండి 6.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి టి.కౌస‌ల్య‌ బృందం హ‌రిక‌థ పారాయ‌ణం చేయ‌నున్నారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంట‌ల వ‌ర‌కు ఊంజల్‌ సేవలో క‌రీంన‌గ‌ర్‌ చెందిన శ్రీ పి.రేవ‌తి బృందం అన్న‌మ‌య్య సంకీర్తన‌ల‌ను ఆల‌పిస్తారు.
12. వైభవంగా లక్ష్మీహారం ఊరేగింపు
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆలయం నుండి తీసుకొచ్చిన లక్ష్మీహారం ఊరేగింపు సోమ‌వారం సాయంత్రం వైభవంగా జరిగింది. అప్పలాయగుంట పురవీధుల గుండా ఊరేగింపుగా లక్ష్మీహారాన్ని ఆలయానికి తీసుకు వెళ్లి పూజ‌లు నిర్వ‌హించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, మంగళవాయిద్యాల నడుమ శోభాయమానంగా ఊరేగింపు సాగింది. ఇందులో భాగంగా సోమ‌వారం రాత్రి గరుడ సేవలో ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. అనంతరం రాత్రి 8.30 నుండి 10.00 గంటల వరకు స్వామివారు తనకు ప్రీతిపాత్రమైన గరుడుడిని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీగోపాలకృష్ణా, కంకణభట్టార్‌ శ్రీసూర్యకుమార్‌ ఆచార్యులు, ఎవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
13. జూన్ 29న రాగి గోవిందమాలలు టెండర్‌ కమ్‌ వేలం
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన రాగి లోహంతో చేసిన 1,000 కిలోల గోవిందమాలలను జూన్ 29వ తేదీన టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు.ఆసక్తి గలవారు జూన్ 29వ తేదీ సాయంత్రం 3.00 గంటలలోపు ”కార్యనిర్వహణాధికారి, టిటిడి” పేరిట రూ.5000/- డిడి తీసి సీల్డ్‌ టెండర్‌తోపాటు తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు సాయంత్రం 3.30 గంటలకు టెండర్లను తెరవడం జరుగుతుంది.ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org, లేదా ఎమ్‌.ఎస్‌.టి.సి. లిమిటెడ్‌ వెబ్‌సైట్‌ www.mstcecommerce.com/www.mstcindia.co.in ను గానీ సంప్రదించగలరు.