Fashion

చీరలపై చిత్రం గీస్తే…ఆదే విచిత్రం

Hand painted sarees are the new trend in women fashion

చీరకు ప్రాణం వస్తే అది రవివర్మ చిత్రం!చీరపై చిత్రాన్ని గీస్తే అది రవివర్మకే విచిత్రం! స్త్రీని, ప్రకృతిని కలిపి అలా గీసిన ఈ హ్యాడ్‌ పెయింట్‌..ప్లెయిన్‌ పట్టు చీరలు పెళ్లిళ్లలో.. ఫంక్షన్‌లలో..రిసెప్షన్‌.. సంగీత్‌..ఇంకా కాక్‌టైల్‌ పార్టీలలో మీకు తెలియకుండానేమీ చేత క్యాట్‌వాక్‌ చేయిస్తాయి.మిమ్మల్ని స్పెషల్‌ గెస్ట్‌గానిలబెడతాయి.స్పెషల్‌గా కనిపించాలంటే అందరూ ఎంచుకునేవి, ట్రెండ్‌లో ఉన్నవి, రెగ్యులర్‌ మార్కెట్‌లో ఉన్నవి పక్కన పెట్టేయాలి. ‘కళ’కు ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒకే ఒక పీస్‌ ఉంటుంది. ఇప్పటి వరకు మనం కాటన్, ఆర్గంజా చీరల మీద ఫ్యాబ్రిక్‌ పెయింట్‌ చూశాం. అలాంటి చీరలు కట్టుకున్నాం. అదే తరహాలో పూర్తి ప్లెయిన్‌ పట్టు చీరను ఎంచుకొని దాని మీద చేత్తో పెయింట్‌ వేయడంతో ఇలా సరికొత్తగా ఆకట్టుకునేలా రెడీ అయ్యాయి. పక్షులు, లతలు, పువ్వులు.. ఇలా అభిరుచిని బట్టి వేసుకున్న లేదా వేయించిన పెయింటింగ్‌ శారీని కట్టుకుంటే వందమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. ప్యూర్‌ ప్లెయిన్‌ పట్టు చీరలు నాలుగైదు వేల రూపాయల్లో లభిస్తాయి. వీటిపై చేసిన హ్యాండ్‌ పెయింటింగ్‌ని బట్టి ధర వేలల్లో ఉంటుంది.

►ప్రింట్‌ హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్‌ ప్లెయిన్‌గా ఉండాలి. కొంత డిజైన్‌ కావాలనుకుంటే లేస్‌ ఫ్యాబ్రిక్‌ని ఎంచుకోవచ్చు
►చీర ప్రత్యేకత తగ్గకూడదు కాబట్టి ఇలాంటి స్పెషల్‌ వేర్‌కి బంగారు ఆభరణాలు పూసల హారాలను ఎంచుకోవాలి. వాటిలో ముత్యాలు, కెంపులు, పచ్చలు.. వంటి బీడ్స్‌ హారాలు తీసుకోవాలి
►చేతులకు గాజులు కాకుండా ఒక చేతికి బ్రేస్‌లెట్, మరో చేతికి మంచి వాచీ ధరించాలి. మోడ్రన్‌ క్లచ్‌ చేత్తో పట్టుకోవాలి
►కేశాలంకరణకు వస్తే జుట్టును ముడివేయకుండా వదిలేయాలి. లేదంటే, ప్రెంచ్‌ ప్లాట్‌ వంటి పాశ్చాత్య హెయిర్‌స్టైల్స్‌ను మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు
►ఫ్రింట్‌ని హైలైట్‌ చేయాలనుకుంటే మిగతా మన అలంకరణ అంతా సింపుల్‌గా ఉండాలి మేకప్‌తో సహా!
Hand painted sarees are the new trend in women fashion
Hand painted sarees are the new trend in women fashion
Hand painted sarees are the new trend in women fashion
Hand painted sarees are the new trend in women fashion
Hand painted sarees are the new trend in women fashion