DailyDose

మోడీ హయాంలో సూపర్ ఎమర్జెన్సీ-రాజకీయ-06/25

Mamata Banerjee Says Modi Will Impose Super Emergency-June252019-Daily Political News

*కేంద్రంలో నరేంద్ర మోడీ సారధ్యంలో ఎన్డీయే ప్రభుత్వ హయాంను 44ఏళ్ల కిందట ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పోల్చారు. ఎమర్జెన్సీ పాటాల నుంచి దేహం గుణ పాటలు నేచుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవాలని ఆమె ట్విట్ చేశారు. కాగా గత కొన్నేళ్లుగా పలు అంశాల పై మోడీ ప్రభుత్వ నిర్ణయాలు విధానాలను మమతా ఎత్తి చూపుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బెంగాల్లో ఎన్నికలు అనంతరం హింసాకాండలో భాజపా, తృణముల్ కార్యకర్తల మరణించడంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణలు తారా స్థాయికి చేరాయి.
* నేడు మళ్లీ పవన్ కల్యాణ్‌ను క‌లిసిన వంగవీటి రాధా!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ ఈ ఉదయం మరోసారి సమావేశమయ్యారు. నిన్న విజయవాడ పటమటలోని పవన్ నివాసానికి వచ్చి, దాదాపు గంట పాటు మంతనాలు సాగించిన రాధా, ఈ ఉదయం మరోసారి వచ్చారు. ఆయన జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నారని, ఈ ఉదయం భేటీలో ప్రధానంగా ఇదే విషయం చర్చకు వచ్చిందని, వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా రాధా, జనసేనలో చేరుతారని తెలుస్తోంది.వచ్చే నెల 4 లేదా 5వ తేదీల్లో పార్టీలో చేరికకు ముహూర్తం నిర్ణయించడం కూడా జరిగిపోయిందని జనసేన వర్గాలు అంటున్నాయి. కాగా, వీరిద్దరి భేటీపై అటు జనసేన పార్టీ తరఫున గానీ, ఇటు వంగవీటి రాధా నుంచి గానీ, అధికారికంగా ఎటువంటి స్పందనా లేదు.
* ప్ర‌జావేదికను కూల్చితే.. లోట‌స్‌పాండ్‌ను కూడా కూల్చాలి : బుద్ధా
‘అక్రమ కట్టడాలను కూల్చివేయాలని చూస్తే అంత ఉలుకెందుకు.. ఇన్నాళ్లూ చట్టం కళ్లుగప్పారు.. ఇకపై సాధ్యం కాదు’ అంటూ ఢిల్లీలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. ప్రజావేదిక అక్రమ నిర్మాణమైతే చెరువును పూడ్చి కట్టిన లోటస్‌పాండ్‌ సక్రమ కట్టడమా అని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాల సక్రమం కోసమేనా ఎపి భవనాలు తెలంగాణకిచ్చేశారు అని మండిపడ్డారు. కిన్లే వాటర్‌ బాటిల్‌లో రూ.40లు మిగిలించానంటున్న సిఎం జగన్‌ రూ.8కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను ఎలా ల్చేయమంటున్నారు? అని ప్రశ్నించారు. ప్రజావేదిక చంద్రబాబుకు ఇవ్వడం ఇష్టంలేకపోతే ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉపయోగించాలన్నారు. కట్టేవారికి తెలుస్తుంది నిర్మాణాల విలువ.. విధ్వంసకులకు తెలిసేది కూల్చడమేనని విమర్శించారు. అక్రమాస్తులతో కట్టిన లోటస్‌ పాండ్‌ ముందుగా కూల్చాలని.. అప్పుడే మీరు చెప్పే నీతి, నిజాయతీ, నిబద్ధత నిలబడుతుందంటూ వ్యాఖ్యానించారు.
* మోదీ ప్ర‌భుత్వంలొనే మ‌హిళ‌ల సాధికార‌త : హేమమాలిని
ఇవాళ లోక్‌స‌భలో ఎంపీ హేమామాలిని మాట్లాడారు. స్పీక‌ర్ ఓం బిర్లాకు ఆమె కంగ్రాట్స్ చెప్పారు. మాజీ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌ను ఆమె గుర్తు చేసుకున్నారు. మోదీ నాయ‌క‌త్వంలో నూత‌న భార‌త మార్పును చూడ‌గలిగామ‌న్నారు. బీజేపీని గెలిపించిన ప్ర‌జ‌ల‌కు హేమామాలిని థ్యాంక్స్ చెప్పారు. మ‌హిళ‌ల సాధికార‌త కోసం మోదీ ప్ర‌భుత్వం విశేషంగా కృషి చేసింద‌న్నారు. ప్ర‌తి ప‌రిశ్ర‌మ‌లోనూ మ‌హిళ‌లు ఉన్నార‌ని, బ్యాంకులను కూడా మ‌హిళ‌లు న‌డుపుతున్నార‌న్నారు. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో, ఫైట‌ర్ జెట్స్ న‌డ‌ప‌డంలోనూ మ‌హిళ‌లు కీల‌కంగా మారిన‌ట్లు ఆమె చెప్పారు. మోదీ చేప‌ట్టిన మ‌హిళ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను హేమామాలిని కొన్ని క‌విత‌ల ద్వారా వినిపించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం మ‌ధుర‌లో తీవ్ర నీటి స‌మ‌స్య ఉన్న‌ట్లు ఆమె చెప్పారు. య‌మునా న‌ది శుద్ధీక‌ర‌ణ అవ‌స‌రం అన్నారు.అన్నాడీఎంకే పై ద‌యానిధి మార‌న్ ఫైర్
* ఎంపీగా ప్ర‌మాణం చేసిన కొత్త పెళ్ళి కూతురు
బెంగాల్ న‌టి, ఇటీవ‌ల ఎన్నికైన నుష్ర‌త్ జ‌హాన్‌.. ఇవాళ లోక్‌స‌భ‌లో ఎంపీగా ప్ర‌మాణం చేశారు. వ్యాపార‌వేత్త నిఖిల్ జైన్‌ను ఆమె ఈమ‌ధ్యే ట‌ర్కీలోని బోడ్ర‌మ్ ప‌ట్ట‌ణంలో పెళ్లి చేసుకున్నారు. టర్కీలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు నుష్రత్‌, నిఖిల్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా నుష్రత్‌ జహాన్‌ తన పెళ్లి ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.. నిఖిల్‌ జైన్‌తో కలిసి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. జులై 4వ తేదీన కోల్‌కతాలో రిసెప్షన్‌ ఉండే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని బషీరత్‌ నియోజకవర్గం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరపున నుష్రత్‌ జహాన్‌ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. నుష్రత్‌ 3.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక నుష్రత్‌ స్నేహితురాలు మిమి చక్రవర్తి కూడా టీఎంసీ తరపున లోక్‌సభకు ఎన్నికైన విషయం విదితమే. ఆమె కూడా ఇవాళ ఎంపీగా ప్ర‌మాణం చేశారు. వీరిద్దరూ ప్రత్యేక దుస్తుల్లో ఇటీవలే పార్లమెంట్‌కు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.
* చంద్రబాబుతో కోడెల భేటీ
విదేశీ పర్యటన ముగించుకున్న తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఏపీ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. అలాగే, తెలంగాణ తెదేపా నేతలు సైతం చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా చంద్రబాబును కలిశారు.తెలంగాణలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
* వైఎస్ విగ్రహాలు అనుమతి లేకుండా ఏర్పాటు చేశారు: చంద్రబాబు
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రజావేదిక కూల్చివేత ఆదేశాలు, రాష్ట్రంలో టీడీపీ శ్రేణులపై జరిగిన దాడుల గురించి ఆయన వద్ద నేతలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రజావేదిక గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా వేదికను కూల్చివేయాలనుకోవడం సరైన ఆలోచన కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ విగ్రహాలు అనుమతి లేకుండా ఏర్పాటు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు.
* కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికపై పునరాలోచనలో పడ్డ బీజేపీ
ఊహించని రీతిలో మెజారిటీ సాధించి రెండోసారి దేశం పగ్గాలు చేపట్టింది బీజేపీ.. అదే సమయంలో ఇప్పటి వరకు పెద్దగా పట్టు లేని రాష్ట్రాల్లోనూ అనూహ్య విజయం సాధించింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో దేశం మొత్తం పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకుంటోంది. ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని టార్గెట్‌ చేస్తుంటే.. తెలంగాణలో కాంగ్రెస్‌ టార్గెట్‌గా ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీసింది.. ఏపీలో టీడీపీ నుంచి ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా అంబికా కృష్ణ కూడా బీజేపీ గూటికి చేరారు. మరికొద్దిరోజుల్లోనే మరింత మంది టీడీపీ ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా పార్టీలో చేర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ చేరికల వ్యవహారాన్ని రామ్‌ మాధవ్‌ స్వయంగా చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది.
* లోక్‌సభలో హోదా స్వరం వినిపించిన గల్లా జయ్‌దేవ్
లోక్‌సభలో హోదా స్వరం వినిపించారు టీడీపీ ఎంపీ గల్లా జయ్‌దేవ్. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు బీజేపీని ఏపీ ప్రజలు శిక్షించారని.. స్టేటస్ సాధించే బాధ్యతను వైసీపీకి అప్పగించారని అన్నారాయన. హోదా ఇవ్వబోమని సోమవారం మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయాన్ని జయ్‌దేవ్‌ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ యాక్షన్‌ ప్లాన్‌ కోసం అన్ని వర్గాలు ఆత్రుతగా చూస్తున్నాయని అన్నారాయన.
* జగన్‌గారూ..రాష్ట్రం సురక్షితంగా లేదు:లోకేశ్‌
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇటీవల మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచార ఘటనను మాజీ మంత్రి నారా లోకేశ్‌ ట్విటర్‌లో ఖండించారు. ‘‘దేశంలోనే సంచలనం కలిగించిన ఈ దుశ్చర్యలో నిందితులు వైకాపా కార్యకర్తలు కావడం సిగ్గు చేటు. జగన్‌ గారూ.. మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైంది’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.ఇటీవల ఒంగోలులో మైనర్‌ బాలికపై ఆరుగురు కామాంధులు పదిరోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు మైనర్లు సహా ఆరుగురిని ఒంగోలు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
* వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలి: జగన్
వచ్చే ఏడాది నుంచి 6 లక్షల ఇళ్లు కట్టాలిలక్ష్యాలు నిర్దేశించుకుని ఆమేరకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలిఅర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వాలిపట్టణాల్లో ఇప్పుడున్న ఫ్లాట్లను ఉచితంగా ఇస్తామని చెప్పాంవారికి కచ్చితంగా ఇస్తాంఇళ్లస్థలాల పంపిణికీ అవసరమైన భూములను గుర్తించండిగ్రామాల వారీగా, పట్టణాలవారీగా భూములను ఎక్కడున్నాయో చూడండిదొరకని చోట కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధంచేయండిమనం చేస్తున్న ఆలోచన పేదలకు గూడు కల్పించాలన్న సదాశయంతో ఉన్నదిగత ప్రభుత్వంలో గృహనిర్మాణంలో భారీ అవినీతి జరిగిందిలిఫ్టులేని, మార్బుల్‌ ఫ్లోరింగ్‌ లేని ఇళ్లను రూ.6లక్షలకు అమ్మారురూ.1100–1200 చోట్ల అయిన చోట రూ.2200పైగా ఖర్చుచేశారు భారీ అవినీతికి పాల్పడ్డారుమంచి పని కాబట్టి, దేవుడు కచ్చితంగా ఆశీర్వదిస్తాడు, ఈ కార్యక్రమం కచ్చితంగా అమలు అవుతుంది
* పవన్ తో మరోసారి వంగవీటి భేటీ..జనసేనలోకి ముహూర్తం ఖరారు…….
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ నేత వంగవీటి రాధా మరోసారి భేటీ అయ్యారు. సోమవారం సుమారు గంటపాటు వీరిద్దరూ సమావేశమై చర్చించుకున్న సంగతి తెలిసిందే. కాగా… ఇవాళ విజయవాడ పటమటలోని పవన్ నివాసంలో మరోసారి భేటీ అయ్యి పార్టీలో చేరిక తేదీపై చర్చించినట్లు సమాచారం. ఈ బేటీలో పవన్- రాధాతో పాటు పి.రామ్మోహన్, రియాజ్, హరిప్రసాద్ పాల్గొన్నారు. రాధా తండ్రి, దివంగత నేత వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా జులై 4 లేదా 5 న జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకూ ఈ భేటీపై అటు జనసేన నుంచి గానీ.. ఇటు వంగవీటి కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. అయితే… రాధా జనసేనలో చేరడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. గతంలో వైసీపీ నేతగా ఉన్న రాధా మొన్నటి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంటో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో.. ఆయన జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* పోలవరం సునరావాస సమస్యపై దృష్టిపెట్టాలి:
ప్రజల ఫిర్యాదులు, అభ్యంతరాల పరిష్కారానికి శాశ్వతంగా గ్రీవెన్స్‌ కార్యాలయాన్ని పెట్టాలిఐఏఎస్‌ అధికారి ఈ గ్రెవన్స్‌ సెల్‌కు నేతృత్వం వహించాలిపాదర్శకత, వేగవంతంగా ఈ సమస్యలను పరిష్కరించాలిప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాంపోలవరం పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉన్నాంఅన్ని ప్రాజెక్టులకన్నా.. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం
* వైఎస్ జయంతి ఇక రైతు దినోత్సవం: ప్రకటించిన జగన్……
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి ఏటా వైఎస్ జయంతి అయిన జూలై 8వ తేదీన రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు.అలాగే పంటల భీమా, రైతులకు వడ్డీ లేని రుణం తదితరాలకు సంబంధించిన చెల్లింపుల అంశాలను ఆ రోజుకు సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఆ రోజు పండుగలా నిర్వహించాలని సూచించారు.వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.12,500 పెట్టుబడిని అక్టోబర్ 15వ తేదీన రాష్ట్రమంతా ఒకే రోజు చెల్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆ రోజు ప్రతి రైతు కుటుంబానికి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని జగన్ అధికారులను ఆదేశించారు.
* యూరప్ పర్యటన నుండి హైద్రాబాద్‌కు తిరిగొచ్చిన చంద్రబాబు…..
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు యూరప్ పర్యటన నుండి మంగళవారం నాడు ఉదయం హైద్రాబాద్‌కు తిరిగొచ్చారు.
ఈ నెల 19వ తేదీన చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో కలిసి యూరప్‌ పర్యటనకు వెళ్లారు. ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళ్లాలని భావించినా సాధ్యం కాలేదు. దీంతో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన యూరప్ టూర్‌కు వెళ్లారు.చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలు టీడీపీపీని బీజేపీలో విలీనం చేశారు.కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ప్రజా వేదికను కూల్చివేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.బుధవారం నాడు చంద్రబాబునాయుడు అమరావతికి వెళ్లనున్నారు. పార్టీ సీనియర్లతో ఆయనభేటీ కానున్నారు
* మరో సారి భేటీ కానున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు……
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి భేటీ కానున్నారు. ఈ నెల 28వ తేదీన ప్రగతిత భవన్ లో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరు ఇరువురూ కలవడం ఇది నాలుగోసారి.ఇరిగేషన్, విద్యుత్, పౌరసరఫరాల శాఖల్లో విభజన సమస్యలతో పాటు కీలక అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక లావాదేవీల సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు దృష్టిసారించారు. విద్యుత్, పౌరసరఫరాల శాఖల్లో చిక్కుముడిగా ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఇరువురు సీఎంల చర్చ జరగనుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు పరిష్కార మార్గాలు అన్వేషణ చేయనున్నారు. విద్యుత్ ఉద్యోగుల విభజనపైనా ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరగనుంది. మరోవైపు.. జులై 3న గవర్నర్‌ సమక్షంలో తెలంగాణ, ఏపీ సీఎస్‌ల సమావేశం జరగనుంది. సీఎంల భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై సీఎస్‌ల మధ్య చర్చించనున్నారు. ఇరిగేషన్, విద్యుత్‌, పౌరసరఫరాల శాఖల అధికారులతో సోమవారం నాడు తెలంగాణ సీఎస్‌ ఎస్కే జోషి సమీక్ష నిర్వహించిన విషయం విదితమే.
* అప్పటి వరకూ ప్రజావేదిక కూల్చొద్దు: కేశినేని
ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేయాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విజయవాడ ఎంపీ, తెదేపా నేత కేశినేని నాని ఫేస్‌బుక్‌లో స్పందించారు. ‘‘ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే… అది ప్రజాధనంతో నిర్మించిన వేదిక. ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్నీ తొలగించిన తర్వాతే.. ప్రజావేదికను చివర్లో తొలగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు తొలగిస్తే రాష్ట్ర ఖజానాకు రెండు విధాలుగా నష్టం’’అని అన్నారు
* చంద్రబాబు కష్టానికి ఫలితం పోలవరం- లోకేశ్‌
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రతిపాదించిన రూ.55,548 కోట్ల సవరించిన పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. గతంలో తెదేపా ప్రభుత్వం పంపిన అంచనాలు అన్నింటికీ కేంద్రం ఆమోదం తెలిపితే, అవినీతి ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఎప్పుడో ఆమోదించిన విషయాన్ని తమ గొప్పతనమని వైకాపా నేతలు డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమని మండిపడ్డారు.
*గొప్ప అధికారులు ఉండటం అదృష్టం- జగన్
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అనుభవం కలిగిన ఉన్నతాధికారులు బృందం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దగాలననే నమ్మకం కలిగిందన్నారు. ఐఏఎస్ అధికారుల సంఘం ఆద్వర్యంలో విజయవాడ భవనీపురంలో హరిత బరం పార్కులో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్, భార్య భారతితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన మదిలో ఉన్న ఆలోచనలకూ అందరితో పంచుకున్నారు. ముఖ్యమంత్రికి ఐఏఎస్ అధికారుల సంఘం అద్యక్షుడు మన్మోహన్ సింగ్ జ్ఞాపిక అందజేసి సత్కరించారు.
*ఈవీఎంలపై లోక్ సభలో రభస
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తెర్మానం పై చర్చ కాస్తా.. సోమవారం లోక్ సభలో ఈవీఎం లపైకి మళ్ళింది. వీటి విశ్వాసనీయత పై బీ ఎస్పీ, అన్నాడీఎంకే సభ్యులు సందేసహం వ్యక్తం చేయగా తిరిగి బ్యాలెట్ ను ప్రవేశపెట్టాలని తృణముల్ డిమాండ్ చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వద్దని మళ్ళీ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని తృణముల్ ఎంపీ సౌగత రాయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలకు ముందు మూడు వందల స్థానాలు గెలుచుకుంటామని భాజపా అద్యక్షుడు చెప్పారు. ఆ ప్రకారమే 303 సీట్లు వారికి వచ్చాయి. ముందే ఫలితాలు వారికెలా తెలిసహాయి. ఈవీఎంలను నమ్మలేం. తిరిగి బ్యాలెట్ పాత్రలను ప్రవేశ పెట్టాలి అని ఆయన అన్నారు. ఈవీఎంల విశ్వాసనీయత పై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బీఎస్పీ సభ్యుడు ధనిష్ అలీ ప్రధానిని కోరారు.
*అన్ని ఎన్నికల్లో ఒంటరి పోరే-మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ – సమాజ్ వాడీ పార్టీ మధ్య బంధం ఇక ముగిసినట్లే ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని బీఎస్పీ అధినాయకురాలు మాయావతి సోమవారం ప్రకటించారు. అయితే ఈ పరిణామం సామజిక న్యాయ కోసం జరిగే పోరాటాన్ని బలహీనపరుస్తుందని సమాజ్ వాదీ పార్టీ వ్యాఖ్యానించింది. ఎన్నికల తరువాత ఎస్పీ అనుసరించిన తేరు పొత్తు కొనసాగింపు పై ఆలోచనలో పడింది. ఇలా అయితే భవిష్యత్తులో భాజపాను ఓడించడం సాధ్యం కాదు. అందువల్ల పార్టీ, ఉద్యమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సొంత బలంతో రానున్న అన్ని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అని మాయావతి వివరించారు.
*చంద్రబాబు కుటుంబానికి భద్రత తగ్గింపు
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. మరో వైపు చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం భద్రత తగ్గించింది. జెడ్‌ కేటగిరీ ఉన్న మాజీ మంత్రి నారా లోకేశ్‌కు భద్రత తగ్గించి 2+2 గన్‌మెన్లను కేటాయించారు. మిగిలిన కుటుంబ సభ్యులకు పూర్తిగా భద్రత తొలగించారు. కనీస సమాచారం ఇవ్వకుండా.. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా భద్రత తగ్గించడంపై తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
* ఇంక్యూబేషన్ హబ్ గా వైజాగ్ : మంత్రి మేకపాటి
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఐటీ శాఖా మాత్యుల శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు నేడు వైజాగ్ లోని టెక్ మహేంద్ర భవనంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ ఆధ్వర్యంలో టెక్ స్టార్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్, విజయవాడ అమరావతి వద్ద పెద్ద పారిశ్రామికదారులను ఆహ్వనించి పరిశ్రమలను స్థాపన, సెమీ అర్బన్ ఏరియాలు అయిన మంగళగిరి, రాజమండ్రి, తిరుపతి లలో బీపీఓ కాల్ సెంటర్లు ఏర్పాటు చేయుట గురించి చర్చించారు. పరిశ్రమల ప్రతినిధులు సానుకూలంగా స్పందించి త్వరలో పరిశ్రమలు స్థాపిస్తామని తెలిపారు.
*ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనేదీ లేదు
దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. హోదా కోసం ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, రాజస్థాన్, బిహార్, తెలంగాణ, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ల నుంచి కేంద్రానికి వినతులు వచ్చినట్లు చెప్పారు. బిహార్కు చెందిన జేడీయూ సభ్యుడు కౌశలేంద్రకుమార్ అడిగిన రాతపూర్వక ప్రశ్నకు సోమవారం లోక్సభలో ఆమె సమాధానమిచ్చారు. భౌగోళిక పరిస్థితులు, ఆర్థికంగా నిలబడే శక్తి లేకపోవడం వంటి కొన్ని ప్రత్యేక లక్షణాలున్న రాష్ట్రాలకే గతంలో ‘జాతీయ అభివృద్ధి మండలి’ ప్రత్యేక హోదా ప్రకటించిందని చెప్పారు. అందులో పరిశ్రమల రాయితీల కోసం ఎలాంటి ప్రత్యేక చర్యలూ లేవని వెల్లడించారు.
*రాష్ట్ర ప్రజలకు తెరాస శ్రీరామరక్ష
కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్ల రికార్డు సమయంలో పూర్తి చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. సోమవారం సిరిసిల్లలో తెరాస జిల్లా పార్టీ కార్యాలయ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఏవిధంగా సాధించారో.. అదే ఉద్యమస్ఫూర్తితో రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు.
*పీసీసీ అధ్యక్షుడిని మార్చేది లేదు
గ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా స్పష్టీకరణ
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉత్తమ్కుమార్ రెడ్డే కొనసాగుతారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా ప్రకటించారు. కొద్దిరోజులుగా పీసీసీ అధ్యక్షుని మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయని.. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటామని, జరగబోయే మున్సిపల్ ఎన్నికలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
*చేరికలపై వేగం పెంచిన భాజపా
రాష్ట్రంలో ఇతర పార్టీల నుంచి నేతల చేరికలపై భాజపా వేగం పెంచుతోంది. తమంతతాముగా వచ్చే వారికోసమే ఎదురుచూడకుండా ఎవరెవరిని పార్టీలోకి తెచ్చుకోవాలనే కార్యాచరణకూ కమలదళం శ్రీకారం చుట్టింది. వివిధ పార్టీల్లోని ముఖ్యులతోపాటు జిల్లా స్థాయి నేతల్ని చేర్చుకునేందుకు వ్యూహాలను అమలు చేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ స్థానాలకు దక్కించుకున్న భాజపా.. మిగతాచోట్ల విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. తదుపరి శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా ఆ పార్టీ ముందుకెళ్తున్నా.. త్వరలో జరగనున్న పురపాలక పోరునూ దృష్టిలో ఉంచుకుని నేతలను పార్టీలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
*కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి
ప్రపంచంలో అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో రూ.50 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రప్రభుత్వం నిర్మించిందని తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా లోక్సభలో సోమవారం ఆయన ప్రసంగించారు. ‘‘అయిదేళ్ల వయస్సున్న తెలంగాణలో మాప్రభుత్వం మూడేళ్లలోనే గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. 45 లక్షల ఎకరాలకు సాగునీరు.. 1400 గ్రామాలకు.. హైదరాబాద్ నగరానికి తాగునీరు.. పరిశ్రమలకు అవసరమైన నీటిని ఈ ప్రాజెక్టు నుంచి ఇస్తాం.
*తెరాస కార్యకర్తలు గర్వించదగ్గ రోజు-మాజీ మంత్రి హరీశ్రావు
రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనలు జరగడం ఆనందంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఒకే రోజు ఎక్కువ జిల్లాల్లో ఈ ప్రక్రియ జరగడం ఇదే మొదటిసారని, తెరాస కార్యకర్తలు గర్వించదగ్గ రోజు అని అన్నారు. సిద్దిపేట శివారు పొన్నాల పరిధిలో సోమవారం నిర్వహించిన తెరాస సిద్దిపేట జిల్లా కార్యాలయ భవననిర్మాణ పనుల భూమి పూజకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు.
*పురపాలక ఎన్నికల్లో సత్తా చాటుదాం
రాష్ట్రంలో త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో సత్తా చాటాలని భాజపా నిర్ణయించింది. ఎన్నికల నేపథ్యంలో ప్రతి పురపాలక సంఘానికి బాధ్యుల్ని నియమించి ఇప్పటి నుంచే పార్టీపరంగా కార్యాచరణ అమలు చేయాలని సోమవారం పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన కోర్కమిటీ సమావేశంలో తీర్మానించారు. పురపాలక ఎన్నికలతో పాటు హుజూర్నగర్ శాసనసభ స్థానంపైనా ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికల దిశగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు.
*కరకట్ట లోపల అక్రమ కట్టడాలన్నీ కూల్చాలి- జనసేన అధినేత పవన్కల్యాణ్
పర్యావరణ చట్టాలు లేదా ఇతర చట్టాలు అన్ని భవనాలకు ఒకేలా వర్తింపజేయాలని జనసేనాధిపతి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా కరకట్టలోపల తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదిక అక్రమ కట్టడాన్ని కూల్చి వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఈమేరకు అభిప్రాయపడ్డారు. కరకట్టలపై ఉన్న అన్ని అక్రమ కట్టడాలకు ఆ నిర్ణయం వర్తింపజేయాలన్నారు. ప్రజావేదిక విషయంలో ఒక నిర్ణయం, ఇతర అక్రమ కట్టడాల విషయంలో నిర్ణయం మరోలా ఉండకూడదన్నారు. విజయవాడలోని జనసేన కార్యాలయంలో పార్టీ కొత్త కమిటీల ఏర్పాటుపై పార్టీ నాయకులతో కసరత్తు చేస్తున్న జనసేనాధిపతి సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. వైకాపా పాలనకు సంబంధించి మాట్లాడుతూ..వారికి తగినంత సమయం ఇస్తామని పవన్ స్పష్టం చేశారు.
*‘బీసీ బిల్లుకు తెరాస మద్దతివ్వాలి’
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని వైకాపా రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు తెలపాలని బీసీ సంఘాల నేతలు తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావును కోరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్, బీసీ ఐకాస ఛైర్మన్ భూపేష్సాగర్ సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేకే నివాసంలో ఆయనను కలిశారు. అనంతరం విద్యానగర్లోని బీసీ భవన్లో కృష్ణయ్య విలేకరులతో మాట్లాడారు. బీసీ బిల్లు ఆమోదానికి సహకరిస్తానని కేకే చెప్పినట్లు కృష్ణయ్య తెలిపారు.
*ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం కక్షపూరితమే
ప్రజావేదిక అక్రమ కట్టడమైతే అందులో ప్రభుత్వ సమావేశాన్ని ఎందుకు నిర్వహించారని తెదేపా నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కేటాయించాల్సి వస్తుందనే ప్రజావేదికను కూల్చాలన్న కక్షపూరిత నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. చట్టపరంగా తగిన అనుమతులతోనే గత ప్రభుత్వం దాన్ని నిర్మించిందని పేర్కొన్నారు. సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరి, ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, అశోక్బాబు, మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ తదితరులు సమావేశమయ్యారు.
*గుజరాత్ నుంచి రాజ్యసభకు కేంద్ర మంత్రి జయ్శంకర్ పోటీ
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జయ్శంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభ స్థానానికి పోటీచేయనున్నారు. ఈ మేరకు భాజపా ఆయన అభ్యర్థిత్వాన్ని సోమవారం ప్రకటించింది. అంతకుముందు జయ్శంకర్ భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వం పుచ్చుకున్నారు. దౌత్యవేత్త, విదేశీ వ్యవహారాల మాజీ కార్యదర్శి అయిన జయ్శంకర్ గత నెల 30న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ తేదీ నుంచి ఆరు నెలల్లోగా ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. భాజపా అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ నాయకురాలు స్మృతి ఇరానీ లోక్సభకు ఎన్నికవ్వగా తమ రాజ్యసభ సభ్యత్వాలకు వారు రాజీనామా చేశారు. ఆ రెండు స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. మరో స్థానానికి జుగల్జీ మాథుర్జీ ఠాకూర్ను భాజపా అభ్యర్థిగా ప్రకటించింది.
*అన్ని ఎన్నికల్లో ఒంటరి పోరే: మాయ
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)- సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) మధ్య బంధం ఇక ముగిసినట్లే. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని బీఎస్పీ అధినాయకురాలు మాయావతి సోమవారం ప్రకటించారు. అయితే ఈ పరిణామం సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాన్ని బలహీనపరుస్తుందని సమాజ్వాదీ పార్టీ వ్యాఖ్యానించింది. ‘‘ఎన్నికల తరువాత ఎస్పీ అనుసరించిన తీరు పొత్తు కొనసాగింపుపై ఆలోచనలో పడేసింది. ఇలా అయితే భవిష్యత్తులో భాజపాను ఓడించడం సాధ్యం కాదు. అందువల్ల పార్టీ, ఉద్యమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సొంత బలంతో రానున్న అన్ని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది’’ అని మాయావతి వివరించారు.
*దేశంలో అసమానతలు ఆందోళనకరం -మాజీ ప్రధాని మన్మోహన్సింగ్
సంక్షేమ సమాజంగా చెప్పుకొంటున్న మన దేశంలో ఆర్థిక అంతరాలకు, దారిద్య్రానికి తావుండకూడదు… కానీ అసమానతలు తీవ్రమవుతుండటం ఆందోళనకరమని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. ‘భారత్లో పెరుగుతున్న అంతరాలు-2018’ పేరున సామాజికాభివృద్ధి మండలి రూపొందించిన నివేదికను సోమవారం ఆయనిక్కడ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ- ‘‘ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా కొన్ని ప్రాంతాలు, సామాజికవర్గాలు అత్యంత పేదరికంలో మగ్గుతూనే ఉన్నాయి.