Agriculture

పంట బీమా ఖరీఫ్ నుండి ఇస్తారు

Telangana Farmers To Get Crop Insurance Starting Khareef Season

రూపాయికే పంటల బీమా పథకాన్ని ప్రస్తుత ఖరీఫ్నుంచే అమలు చేయాలని ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. సాగు చేసిన పంట, విస్తీర్ణం నమోదు చేయించుకోవడం మినహా రైతు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యవసాయ, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. పంటలవారీగా రాష్ట్ర ప్రభుత్వ వాటాకు రైతు వాటాను జత చేసేలా జాతీయ పంటల బీమా పోర్టల్ (ఎన్సీఐపీ)లో మార్పులు చేయించాలని వ్యవసాయశాఖ కమిషనర్కు సూచించారు. ప్రస్తుత ఖరీఫ్లో ప్రధానమంత్రి ఫసల్బీమా, వాతావరణ ఆధారిత బీమా పథకాలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్బీమా పథకానికి రాష్ట్ర వాటాగా రూ.147 కోట్లు విడుదల చేశారు. పంట రుణాలు తీసుకోని రైతులు సంబంధిత పత్రాలతో సమీపంలోని ఉమ్మడి సేవా కేంద్రం, మీసేవా కేంద్రాల్లో రూపాయి చెల్లించి పేర్లు నమోదు చేయించుకోవాలి.బ్యాంకులు పంట రుణాలు ఇచ్చే సమయంలో రైతు నుంచి రూపాయి మాత్రమే తీసుకోవాలి. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలోనే రైతు, పంట తదితర వివరాలను ఎన్సీఐపీ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి.