DailyDose

రేపు మహంకాళి బోనాలు

Mahankali Bonalu To Begin From Sunday-Today Telugu Devotional News-July 20 2019

1. రేపు మహంకాళి బోనాలు – ఆద్యాత్మిక వార్తలు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా ఈనెల 21, 22వ తేదీల్లో ఆలయం సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 21వ తేదీ తెల్లవారుజాము 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. బోనాల పండుగ సందర్భంగా వచ్చే భక్తులతో ఆలయం సమీపంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు, వాహనాలు పార్కింగ్కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
***ట్రాఫిక్ ఆంక్షలు..
21న ఉదయం 4గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు. పూజల సందర్భంగా మహంకాళి ఆలయం, టోబకో బజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్లో ట్రాఫిక్ రాకపోకలు పూర్తిగా నిలిపివేసి, రోడ్లను మూసివేస్తారు. సుభాష్ రోడ్, బాటా చౌరస్తా, రాంగోపాల్పేట మార్గాలను మూసివేస్తారు. ఆడవయ్య చౌరస్తా నుంచి మహంకాళి ఆలయం మార్గాలను మూసివేస్తారు.
-జనరల్ బజార్ నుంచి ఆలయం మార్గం రోడ్డు మూసివేస్తారు.
**దారి మళ్లింపు..
కర్బాల మైదాన్ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్, ఆర్టీసీ బస్సులను రాణిగంజ్ ఎక్స్ రోడ్డులో మినిస్టర్ రోడ్డు వైపు దారి మళ్లిస్తారు. ఆర్టీసీ బస్సులు రైల్వేస్టేషన్ నుంచి ట్యాంక్బండ్ వైపు వెళ్లేవి అల్ఫా ఎక్స్ రోడ్డు హోటల్, గాంధీ ఎక్స్రోడ్స్, ఓల్డ్మహంకాళి ట్రాఫిక్, బైబుల్ హౌస్, కర్బాల మైదాన్ రూట్లో వెళ్లాలి. తాడ్బన్ వెళ్లే బస్సులు క్లాక్టవర్, ప్యాట్నీ ఎక్స్రోడ్డు, వైఎంసీఏ, ఎస్బీహెచ్ ఎక్స్రోడ్స్ మీదుగా వెళ్లాలి. -బైబిల్ హౌస్ నుంచి వచ్చే వాహనాలను ఝాన్సీమండి ఎక్స్రోడ్డు నుంచి సజ్జన్నాల్ స్ట్రీ, హిల్స్ స్ట్రీట్ వైపు మళ్లిస్తారు. ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్ను ప్యాట్నీ చౌరస్తాలో దారి మళ్లిస్తారు.ప్యారడైజ్ నుంచి ఆర్పీ రోడ్డు వెళ్లే వాహనాలను ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్బీహెచ్, క్లాక్ టవర్ వైపు మళ్లిస్తారు. క్లాక్టవర్ నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను ప్యాట్సీ ఎక్స్రోడ్డు నుంచి ఎస్బీహెచ్ ఎక్స్రోడ్డు, ప్యారడైజ్ వైపు మళ్లిస్తారు. సీటీఓ జంక్షన్ నుంచి ఎంజీరోడ్డు వెళ్లే వాహనాలను ప్యారడైజ్ ఎక్స్ రోడ్డు వద్ద హెచ్డీఎఫ్సీ బ్యాంకు వైపు మళ్లిస్తారు. 22న మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10గంటల వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సెయింట్ మేరీ మార్గాలను మూసేస్తారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి హకీంపేట, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్పేట వెళ్లే ట్రాఫిక్ను క్లాక్ టవర్ నుంచి వయా ప్యాట్నీ, ఎస్బీహెచ్ వైపు నుంచి వెళ్లాలి.ఉత్సవాలకు వచ్చే వాహనాల పార్కింగ్ ప్రదేశాలు
సెయింట్ జాన్స్ రోటరీ, స్వీకార్, ఉపకార్, ఎస్బీహెచ్ వైపు నుంచి వచ్చే వాహనాలు హరిహర కళాభవన్, మహబూబీయ కాలేజీలో పార్కు చేయాలి. కార్బాల మైదన్, బైబిల్ హౌస్, ఝాన్సీమండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇస్లామియా హైస్కూల్ ప్రాంగణంలో పార్కు చేయాలి. రాణిగంజ్, అడవయ్య క్రాస్ రోడ్స్ వైపు వాహనాలు ప్రభుత్వ ఆడవయ్య మెమోరియల్ హైస్కూల్ ప్రాంగణంలో పార్కు చేయాలి. సుభాష్ రోడ్డు వైపు వాహనాలు ఓల్డ్ జిల్ఖానా ఓపెన్ ప్లేస్లో పార్కు చేయాలి. మంజు థియేటర్ వైపు నుంచి వచ్చే వాహనాలను అంజలి థియేటర్ లైన్లో పార్కు చేయాలి. ఉత్సవాలకు వస్తున్న భక్తులు విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని కమిషనర్ కోరారు.
2. ఎస్వీబీసీ ఛైర్మన్గా పృథ్వీరాజ్
శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్గా సినీనటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్ను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తితిదే నియమించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఛానల్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన పృథ్వీరాజ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు. 1993లో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.
3. బాసర ఆలయ ఏఈవోపై మరోసారి సస్పెన్షన్ వేటు
ప్రముఖ పుణ్యక్షేత్రం, నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ ఆలయంలో జరిగిన పలు అవకతవకలపై దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. గత నెలలో సస్పెన్షన్కు గురై న్యాయస్థానం ఉత్తర్వులతో వారం క్రితం విధుల్లో చేరిన ఏఈవో గంగా శ్రీనివాస్ను శుక్రవారం మరోసారి సస్పెండ్ చేశారు. ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ అసిస్టెంట్కు మెమోలు జారీ చేశారు. ఆలయంలో జరిగిన వ్యవహారాలపై గత కొంతకాలంగా పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించి దేవాదాయశాఖ కమిషనర్ విచారణ జరిపించారు. విచారణ అధికారిగా నియమితులైన ఆ శాఖ ఆర్జేడీ కృష్ణవేణి మే నెలలో ఆలయంలో విచారణ నిర్వహించారు. ఆర్జేడీ ఇచ్చిన నివేదిక మేరకు కమిషనర్ చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో వినోద్రెడ్డి తెలిపారు.
4. యాదాద్రీశుడికి రూ. 25లక్షలతో బంగారు రథం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి కర్ణాటకలోని రాయ్చూర్కు చెందిన ఇల్లూరు గోపాలకృష్ణమూర్తి అనే భక్తుడు రూ. 25, 00, 000 విలువైన బంగారంతో బంగారు రథాన్ని తయారు చేయించడానికి ముందుకు వచ్చారు. కర్ణాటకకు చెందిన పారిశ్రామికవేత్త గోపాలకృష్ణమూర్తి ఇప్పటికే రాయ్చూర్లోని శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి బంగారు రథాన్ని తయారు చేయించగా దాన్ని పరిశీలించాల్సిందిగా ఆలయ ఈవో ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బీ. నర్సింహమూర్తిలను ఆహ్వానించారు. శుక్రవారం రాయ్చూర్ వెళ్లి వారు పరిశీలించారు. ఇదే నమూనాలో ఉన్న బంగారు రథాన్ని యాదాద్రీశునికి కూడా తయారు చేయించి ఇస్తానని గోపాలకృష్ణమూర్తి ఆలయ ఈవోకు చెప్పడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కోసం ఇప్పటికే రథం తయారు చేయించామని దానికి బంగారు తాపడం చేయిస్తే బాగుంటుందని ఈవో గీత ఆయనకు తెలియపర్చారు. అందుకు ఆయన సమ్మతించి తప్పకుండా మీరు కోరినట్లుగానే బంగారు రథాన్ని తయారు చేయించి శ్రీవారికి సమర్పిస్తామని హామీ ఇచ్చారని ఈవో చెప్పారు. దేవాదాయ శాఖ కమీషనర్కు ఇతర అధికారులకు బంగారు రథం భక్తుడు తయారు చేయించి సమర్పించనున్న విషయాన్ని తెలియపరుస్తామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో దోర్భల భాస్కరశర్మ తదితరులు పాల్గొన్నారు.
5. జగన్మాతకు సారె సమర్పించడం పూర్వజన్మ సుకృతం
ఆషాఢ మాసంలో జగన్మాత దుర్గమ్మకు సారె సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారని దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాతకు శుక్రవారం పలు భక్త బృందాలు సంప్రదాయ బద్దంగా సారెను సమర్పించారు. నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి శివనాగేంద్రస్వామి భక్త బృందం, గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి లక్ష్మీప్రసన్న భక్తబృందం, సత్తెనపల్లి నుంచి ఆర్య వైశ్య చలివేంద్ర కమిటీ బృందం, సాయి లలితా భక్త సమాజం, విజయవాడ మల్లికార్జునపేట, విద్యాధరపురం, కృష్ణలంక నుంచి భక్త బృందాలు సారెను మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో అర్చకులకు అందజేశారు. సారె సమర్పించిన బృందాలకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలను అందజేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు పురావస్తు విభాగం కమిషనర్ వాణీమోహన్ సంప్రదాయ బద్దంగా సారెను సమర్పించారు. దేవస్థానం ఈవో కోటేశ్వరమ్మ ఆమెను సాదరంగా ఆహ్వానించారు. సారె సమర్పించిన తరువాత ఆమెకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేదపండితులు ఆమెకు ఆశీర్వచన మండపంలో ఆశీర్వచనం చేశారు. దేవస్థానం అధికారులు ఆమెకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
6. శుభమ – నేటి పంచాంగం
తేది : 20, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
వారము : శనివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : తదియ
(ఈరోజు ఉదయం 6 గం॥ 13 ని॥ వరకు)
నక్షత్రం : శతభిష
(ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 14 ని॥ వరకు)
యోగము : సౌభాగ్యము
కరణం : భద్ర(విష్టి)
వర్జ్యం : (ఈరోజు ఉదయం 10 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 12 గం॥ 27 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 11 గం॥ 19 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 6 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 11 గం॥ 19 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 6 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 6 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 28 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 51 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 53 ని॥ లకు
7. శుభమస్తు చరిత్రలో ఈ రోజు జూలై, 20
* సంఘటనలు*
1773: స్కాట్లాండు నుంచి వలసవచ్చిన వారు కెనడాలోని పిక్టౌ (నొవ స్కాటియా) కి వచ్చారు.
1868: సిగరెట్లమీద మొదటిసారిగా ‘టాక్స్ స్టాంపుల’ ను వాడారు అమెరికాలో.
1871: బ్రిటిష్ కొలంబియా, కెనడా సమాఖ్యలో చేరింది.
1872: అమెరికన్ పేటెంట్ కార్యాలయం, వైర్‌లెస్ టెలిగ్రఫీ మొదటి పేటెంట్ మహ్లాన్ లూమిస్ అనే వ్యక్తికి ఇచ్చింది.
1878: హవాయిలో మొట్టమొదటి టెలిఫోన్ ని ప్రవేశ పెట్టారు.
1903: ఫోర్డ్ మోటార్ కంపెనీ తన మొట్టమొదటి కారును ఎగుమతి చేసింది.
1921: న్యూయార్క్ నగరం నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకిఎయిర్ మెయిల్ సర్వీస్ మొదలైంది.
1930: వాషింగ్టన్, డి.సి. (జిల్లా రికార్డ్) 106 డిగ్రీల ఫారెన్ హీట్ (41 డిగ్రీల సెంటిగ్రేడ్).
1934: అయొవా రాష్ట్రం రికార్డు. అయొవా రాష్ట్రంలో ఉన్న ‘కియోకుక్’ లో 118 డిగ్రీల ఫారెన్ హీట్ (48 డిగ్రీల సెంటిగ్రేడ్).
1935: లాహోర్ లోని మసీదు విషయమై ముస్లిములకు, సిక్కులకు జరిగిన అల్లర్లలో, 11 మంది మరణించారు.
1944: రాస్తెన్ బర్గ్ లో జరిగిన మూడవ హత్యా ప్రయత్నం నుంచి, అడాల్ఫ్ హిట్లర్ తప్పించుకున్నాడు.
1947: ప్రధాని యు. అంగ్ సాన్ మీద, అతని మంత్రివర్గ సభ్యులుగా ఉన్న మరొక తొమ్మిది మంది మీద, హత్యా ప్రయత్నం చేసినందుకు, బర్మా (నేటి మియన్మార్) మాజీ ప్రధాని ‘యు. సా’ ని, మరొక 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
1947: 1947 జూలై 19 న జరిగిన అభిప్రాయ సేకరణలో చాలా ఎక్కువ ఓట్లతో, వాయవ్య సరిహద్దు ప్రాంతం ప్రావిన్స్ (నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్) ప్రజలు, భారతదేశంలో కంటే, పాకిస్తాన్ లోనే చేరటానికి, తమ సమ్మతిని తెలిపారని, భారతదేశపు వైస్రాయి 1947 జూలై 20 తేదీన, చెప్పాడు.
1960: సిరిమావో బండారు నాయకే, సిలోన్ (నేటి శ్రీలంక) ప్రధానిగా ఎన్నికైంది. ఈమె ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని (ప్రభుత్వాధినేత్రి).
1960: రోదసీలోకి వెళ్ళిన రెండుకుక్కలు తిరిగి భూమిమీదకు (యు.ఎస్.ఎస్.ఆర్) తిరిగి వచ్చాయి. రోదసీలోకి వెళ్ళి తిరిగివచ్చిన మొదటి జీవాలు ఇవే.
1962: కొలంబియాలో జరిగిన భూకంపంలో40మంది మరణించారు.
1969: భారత రాష్ట్రపతిగా వరాహగిరి వేంకటగిరిపదవీ విరమణ.
1969: భారత రాష్ట్రపతిగా ఎం.హిదయతుల్లాపదవిని స్వీకరించాడు.
1974: టర్కీ సైన్యం సైప్రస్ మీద దాడి చేసింది.
1975: ‘ది టైమ్స్’, ‘ది డెయిలీ టెలిగ్రాఫ్’, ‘న్యూస్ వీక్’ పత్రికా విలేకరులను, భారత ప్రభుత్వపు సెన్సార్ నిబంధనలను పాటించే పత్రంపై సంతకం చేయటానికి నిరాకరించటం వలన, భారత ప్రభుత్వం వారిని బహిష్కరించింది (అది అత్యవసర పరిస్థితి – ఎమెర్జెన్సీ కాలం)
1976: ‘వైకింగ్ 1’ అనే రోదసీ నౌక కుజగ్రహం మీద దిగింది. అపొల్లో 11 రోదసీ నౌక చంద్రుడిమీద దిగి ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా, అమెరికా ఈ ‘వైకింగ్ 1’ ని ప్రయోగించింది. మొదటిసారిగా కుజుడి నేలమీద ‘క్రిస్ ప్లానిటియా’ అనే చోట (కుజుడి నేల మీద ఉన్న ఒక స్థలం పేరు) ఈ వైకింగ్ దిగింది.
1976: అమెరికా తన సైనిక దళాలను థాయ్‌లేండ్ నుంచి ఉపసంహరించింది (వియత్నాం యుద్ధం కోసం అమెరికా ఈ సైనిక దళాలను ఇక్కడ ఉంచింది)
1989: బర్మాను పాలిస్తున్న సైనికా జుంటా ప్రభుత్వము, ప్రతిపక్ష నాయకురాలు ‘దా అంగ్ సాన్ సూ క్యి’ ని గృహ నిర్బంధం (ఇంటిలో నుంచి బయటకు రాకుండా) లో ఉంచారు.
1990: లండన్ స్టాక్ ఎక్షేంజ్ పై ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీబాంబు పేల్చింది.
* జననాలు*
1785: మహముద్ II ఒట్టొమాన్ సుల్తాన్, సంస్కర్త, పాశ్చాత్యీకరణ చేసిన వాడు.
1822: గ్రెగర్ జాన్ మెండెల్, ఆస్ట్రియా సన్యాసి, వృక్షశాస్త్రజ్ఞుడు. ‘లాస్ ఆఫ్ హెరెడిటీ’ జీవుల అనువంశికత సూత్రాలు కనుగొన్నాడు.
1864: ఎరిక్ కార్ల్‌ఫెల్డ్, స్వీడన్. కవి. ( 1918 లో నోబెల్ బహుమతి తిరస్కారము. 1931 లో నోబెల్ బహుమతి మరణానంతరం ఇచ్చారు).
1892: కవికొండల వెంకటరావు, ప్రముఖ తెలుగు కవి, జానపద మరియు నాటక రచయిత. (మ.1969)
1919: ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కాడు. (మ.2008)
1920: లెవ్ అరోనిన్, యు.ఎస్.ఎస్.ఆర్. ప్రపంచ చదరంగపు ఆటగాడు (1950)
1933: రొద్దం నరసింహ, భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత.
1941: వ్లాదిమిర్ ఎ ల్యాఖోవ్, రోదసీ యాత్రికుడు (సోయుజ్ 32, టి-9)
1947: గెర్డ్ బిన్నింగ్ ఫ్రాంక్‌ఫర్ట్, ఫిజిసిస్ట్ (టన్నెలింగ్ మైక్రోస్కోప్ – నోబెల్ బహుమతి గ్రహీత 1986)
1969: గిరిజా షెత్తర్, తెలుగు సినిమా నటి.
1980: గ్రేసీ సింగ్, ప్రముఖ భారతీయ సినీనటి
* మరణాలు*
1937: గూగ్లి ఎల్మో మార్కోని, రేడియోని కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1874)
1951: జోర్డాన్ రాజు, అబ్దుల్లా ఇబిన్ హుస్సేన్, ని జెరూసలెంలో హత్య చేసారు.
1972: గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (జ.1930)
1973: స్ లీ, ప్రపంచ ప్రసిద్ధ యుద్ధ వీరుడు. (జ.1940)
1980: పర్వతనేని బ్రహ్మయ్య, ప్రఖ్యాతి గాంచిన ఛార్టర్డ్ అకౌంటెంట్. (జ.1908)
*పండుగలు మరియు జాతీయ దినాలు*
810 : కొలంబియా దేశం స
8. తిరుమల \| సమాచారం* *_*ఓం నమో వేంకటేశాయ!!*_
• ఈ రోజు శనివారం.,
*20.07.2019*
ఉదయం 6 గంటల
సమయానికి,
_తిరుమల: *22C° – 32℃°*_
• నిన్న *78,325* మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో గదులన్నీ
భక్తులతో నిండినది, భక్తులు
బైట చేచియున్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*24* గంటలు పట్టవచ్చును
• నిన్న *36,818* మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 4.10* కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
మూడు గంటల సమయం
పట్టవచ్చును,
*_వయోవృద్దులు మరియు దివ్యాంగుల_*
• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
*_చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_*
• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
*శ్రీవేంకటేర సుప్రభాతం*
_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_
*తా:* _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_
_కావున లెమ్ము స్వామి_
9. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. రెండు రోజుల క్రితం వరకూ సాధారణంగా ఉన్న రద్దీ వీకెండ్ కావడంతో పెరిగింది.
భక్తులతో నిండిన వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టైంస్లాట్‌, నడక, ప్రత్యేక దర్శనాలకు 4 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది.
10. టిటిడి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ లైసెన్స్‌
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) లైసెన్స్‌ పొందిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అశ్విని కుమార్‌ చౌబి తెలిపారు. వైసిపి ఎంపి వంగా గీత విశ్వనాథ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ అంశం ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ చట్టం-2006 కిందకు వస్తుందని అన్నారు.ఏపీ ఉన్నత విద్యామండలిపై విచారణకు సర్కార్ ఆదేశం
11. టిటిడి శ్రీవాణి పథకానికి 10 వేల రూపాయలు విరాళంగా అందజేసిన భక్తులకు విఐపి బ్రేక్ దర్శనం టికెట్ కేటాయించేందుకు ప్రయత్నం జరుగుతోందని టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పినట్టుగా శనివారం ఒక పత్రికలో ప్రచురించిన వార్త వాస్తవం కాదు. ఇలాంటి విధానపరమైన నిర్ణయాలను టిటిడి ధర్మకర్తల మండలిలో చర్చించిన తరువాత బోర్డు ప్రకటిస్తుంది. అయితే, టిటిడి ఈఓ చెప్పినట్టుగా సదరు పత్రికలో ప్రచురించడం సరికాదు.