DailyDose

కొత్త గవర్నర్లు వచ్చేశారు-రాజకీయ–07/20

New Governors Take Charge In India-Today Telugu Politics-July 20 2019

* కేంద్రం గవర్నర్ల నియామకాలు, బదిలీల ప్రక్రియను కొనసాగిస్తోంది. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతో పాటు ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తోన్న వారిని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం కొత్త నియామకాలు చేపడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న ఆనందీబెన్‌ పటేల్‌ను యూపీకి బదిలీ చేయగా.. బిహార్‌ గవర్నర్‌ లాల్‌జీ టాండన్‌ను మధ్యప్రదేశ్‌కు నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బిహార్‌ గవర్నర్‌గా ఫగు చౌహాన్‌, పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌, త్రిపుర గవర్నర్‌గా రమేశ్‌ బయాస్‌, నాగాలాండ్‌ గవర్నర్‌గా ఆర్‌ఎన్‌ రవిని కేంద్రం నియమించింది. కొత్త గవర్నర్లు బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి వారి నియామకాలు అమల్లోకి వస్తాయి.
* నా లక్ష్యం నెరవేరింది: ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకోవడంపై చెలరేగిన వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. తాను ధర్నాకు దిగిన చునార్‌ అతిథి గృహం వద్దకు తరలివచ్చిన బాధిత కుటుంబాలను ప్రియాంక పరామర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ బాధితులకు ఎప్పుడూ అండగా ఉంటుందని వారిని ఓదార్చారు. చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి పార్టీ తరఫున రూ.10లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాధితులను పరామర్శించాలన్న తన లక్ష్యం నెరవేరిందన్నారు. మరోవైపు ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకోవడం గానీ, అరెస్టు గానీ చేయలేదని ఇప్పుడు ఆమె ఎక్కడికైనా వెళ్లొచ్చని మిర్జాపూర్‌ డీఎం తెలిపారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ‘‘నిన్నటి నుంచి నన్ను అడ్డుకున్న పోలీసులే ఇప్పుడు అరెస్టు చేయలేదంటున్నారు. ఎక్కడికైనా వెళ్లొచ్చంటున్నారు. వారికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. బాధితుల్ని పరామర్శించిన నేను ఇప్పటికి వెళ్లిపోతున్నా.. కానీ తిరిగి వస్తా’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
*కేసీఆర్ పై దత్తాత్రేయుడు ఫైర్
ఆగస్టు తర్వాత అసలైన పరిపాలన ఉంటుందన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. ఇన్నాళ్లు చేసింది నకిలీ పరిపాలనా అనుకోవాలా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడే ముఖ్యమంత్రి అయినట్లు అసెంబ్లీలో మాట్లాడటం ఆశ్చర్యం కలిగించిందని, మున్సిపల్‌ చట్టం సవరణ రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచేలా ఉందన్నారు. బిల్లులోని అంశాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని విమర్శించారు. శనివారం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తీరుపై ధ్వజమెత్తారు.
* సీఎం జగన్‌ అక్కడ ఎక్కువ రేటుకు విద్యుత్‌ను అమ్ముకుంటున్నారు – చంద్రబాబు
పీపీఏలు, పోలవరంపై చర్చతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. పీపీఎలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న సీఎం జగన్‌ ఆరోపణలను ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. . వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో విద్యుత్ వ్యాపారం చేస్తున్న సీఎం జగన్.. అక్కడ ఎక్కువ రేటుకు విద్యుత్‌ను అమ్ముకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఒప్పందాలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపణలు గుప్పించారు జగన్‌. అటు పోలవరంపైనా… అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది.విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. గత TDP ప్రభుత్వ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆరోపణలను ఖండించారు ప్రతిపక్షనేత చంద్రబాబు. పీపీఏలపై వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణలు, రెగ్యులేటరీ తెచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. కరెంట్ చార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తమ పాలనలో కోతలు లేని కరెంటు అందించామన్నారు. జగన్‌ చర్యలతో మళ్లీ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు తలెత్తాయని విమర్శించారు చంద్రబాబు. కర్ణాటకలో విద్యుత్ వ్యాపారం చేస్తున్న సీఎం జగన్ .. ఎక్కువ రేటుకు విద్యుత్‌ను అమ్ముకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. పీపీఏలపై సదరు సంస్థలను ఒప్పించి రేట్లను తగ్గిస్తే తాను కూడా సంతోషిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం తప్పులను ఎత్తిచూపే హక్కు తమకుందన్నారు.
* ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ కన్నుమూత
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ ఇకలేరు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 81ఏండ్ల షీలా దీక్షిత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1998 నుంచి 2013 వరకు 15ఏండ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 మార్చి నుంచి 2014 ఆగస్టు వరకు కేరళ గవర్నర్‌గా కూడా కొనసాగారు. 1938 మార్చి 31న పంజాబ్‌లోని కపుర్తాలలో జన్మించిన దీక్షిత్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేసిన ఆమె ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీ చేతిలో 3.66 లక్షల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. తొలిసారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌ నుంచి లోక్‌సభ(1984- 1989)కు ప్రాతినిధ్యం వహించారు. 19861989 మధ్య పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
* విశ్వాస పరీక్షపై కుమార పద్మవ్యూహం
ఎందరు ఎన్ని గడువులు విధించినా స్పీకర్‌ నిర్ణయమే అత్యున్నతమని సుప్రీంకోర్టే తేల్చి చెప్పిన నేపథ్యంలో కర్ణాటక విధానసభలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. విశ్వాస తీర్మానానికి గవర్నర్‌ దఫాలుగా ఆదేశించినా స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ఆ అంశంపై చర్చకు తావిచ్చి- ఓటింగ్‌ను ముందుకు జరుపుతూ చాణక్యం ప్రదర్శించడం శుక్రవారం పలు ప్రశ్నలను సృష్టించింది. సభాపతి జాతీయ స్థాయిలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. మూడుసార్లు తన సందేశాలు, ఆదేశాలతో సభలో చర్చనీయాంశంగా మారారు. దేశ అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్ర ప్రథముడి ఆదేశాలపై కోటి ఆశలతో సభలో ఎంతో వినమ్రత పాటించిన ప్రతిపక్ష భాజపాకు శుక్రవారం కాస్త ఊరట లభించింది. ఎవరు చెబితే సభకు శిరోధార్యమో.. ఆయనే విశ్వాస పరీక్షపై పెదవి దాటి సూచన ఇవ్వటంతో రెండు వారాల కర్ణాటక సంక్షోభానికి తెరపడే అవకాశం సమీపంలో ఉన్నట్లేనని ఓ అంచనా. మధ్యలో రాష్ట్రపతి పాలన, విధానసభ రద్ధు.వంటి ప్రక్రియలు చర్చకు వచ్చినా వచ్చే సోమవారం ఇన్ని రోజుల ఉత్కంఠ తొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* నిమ్మకాయలతో సీఎం పదవిని కాపాడుకుంటున్నారా.. – బీజేపీ ఎమ్మెల్యే
కర్నాటక సంక్షోభం ఇంకా ముగిసిపోలేదు. చివరి అంచున వేలాడుతూనే ఉంది. శుక్రవారమే శుభం కార్డు పడుతుంది అనుకుంటే.. సోమవారానికి సీక్వెల్‌ మొదలు కానుంది. సర్కార్ బలపరీక్షపై అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. అయితే సభలోకి సీఎం సోదరుడు నిమ్మకాయలతో రావడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిమ్మకాలతో సీఎం పదవిని కాపాడుకుంటున్నారా అంటూ ఎద్దేవ చేసింది. మంత్రాలకు సీఎం పదవులు వస్తాయా అంటూ కుమారస్వామి ఘాటుగానే కౌంటర్‌ ఇచ్చారు.కర్నాటక అసెంబ్లీలో అందరి ఫోకస్‌ నిమ్మకాయలపై పడింది. సీఎం కుమారస్వామి మంత్రాలతో తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. అందుకే ఓటింగ్‌ జరగకుండా చూసుకుంటున్నారని.. సభలో చేతబడి చేయాలనుకుంటున్నారు అంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. విపక్ష ఆరోపణలపై స్పందించిన కుమారస్వామి మంత్రాలతో అధికారాన్ని నిలబెట్టుకోవడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. మంత్రి రేవణ్ణ సహజంగానే భక్తుడని, రోజూ ఆలయానికి వెళుతూ ఉంటారని చెప్పారు. అదే సమయంలో గుడికి వెళ్లగా అక్కడ పూజారులు నిమ్మకాయలు ఇచ్చారని, వాటిని తీసుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లినా.. అక్కడ వారికి కూడా నిమ్మకాయలు ఇస్తారని చెప్పారు.
* సీఎం జగన్‌ అక్కడ ఎక్కువ రేటుకు విద్యుత్‌ను అమ్ముకుంటున్నారు – చంద్రబాబు
పీపీఏలు, పోలవరంపై చర్చతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. పీపీఎలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న సీఎం జగన్‌ ఆరోపణలను ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. . వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో విద్యుత్ వ్యాపారం చేస్తున్న సీఎం జగన్.. అక్కడ ఎక్కువ రేటుకు విద్యుత్‌ను అమ్ముకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఒప్పందాలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపణలు గుప్పించారు జగన్‌. అటు పోలవరంపైనా… అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది.విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. గత TDP ప్రభుత్వ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆరోపణలను ఖండించారు ప్రతిపక్షనేత చంద్రబాబు. పీపీఏలపై వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణలు, రెగ్యులేటరీ తెచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. కరెంట్ చార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తమ పాలనలో కోతలు లేని కరెంటు అందించామన్నారు. జగన్‌ చర్యలతో మళ్లీ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు తలెత్తాయని విమర్శించారు చంద్రబాబు. కర్ణాటకలో విద్యుత్ వ్యాపారం చేస్తున్న సీఎం జగన్ .. ఎక్కువ రేటుకు విద్యుత్‌ను అమ్ముకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. పీపీఏలపై సదరు సంస్థలను ఒప్పించి రేట్లను తగ్గిస్తే తాను కూడా సంతోషిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం తప్పులను ఎత్తిచూపే హక్కు తమకుందన్నారు.
*సోన్‌‌భద్ర్ ఘటనకు 1955 కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: యోగి
ఉత్తర్ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఆస్థి తగాదా వల్ల ఏర్పడ్డ తగాదాలో ఇరు వర్గాలు కాల్చుకున్నాయి. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. అయితే కాల్పుల ఘనటకు కారణం 1955 నాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు.‘‘1955లో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉంది. ఆ సమయంలోనే ఈ భూవివాదానికి నాంది పడింది. 1955లో ఆ గ్రామ పంచాయతీని ఆదర్శ సొసౌటీగా ప్రకటించారు. 1989లో ఈ భూమిని వేరొకరికి బదలాయించారు. ప్రధాన ఆరోపణ దారుడికి కొంత సొమ్ము చెల్లించి పీడితులు ఈ భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. అయితే ప్రధాన ఆరోపి ఈ భూమిపై కేసు వేయడంతో సొమ్ము చెల్లించడం ఆపేశారు. అనంతరం ఇరు వర్గాల మధ్య గొడవలు పెరిగి కాల్పుల వరకు వెళ్లింది’’ అని యోగి తెలిపారు.
*ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది: మాయావతి
ప్రజలకు రక్షణ కల్పించడంలో యోగి ప్రభుత్వం విఫలమైందని బీఎస్పీ అధ్యక్షురాలు మాయామతి వ్యాఖ్యానించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆమె మాట్లాడారు. సోన్‌భద్ర జిల్లాలోని సపాహీ గ్రామంలో చోటుచేసుకున్న భూ తగాదాలో 10 మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. పోలీసుల కాల్పుల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు బీఎస్పీ నేతలు అండగా ఉండాలని సూచించారు.
*గత ప్రభుత్వం చేసిన పొరపాటు జగన్ ప్రభుత్వం చెయ్యొద్దు : పురంధేశ్వరి
ప్రధాన మంత్రి స్కూటీ యోజన స్కీంపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురంధరేశ్వరి. అసలు అలాంటి పథకమే లేదని.. బీజేపీపై బురద చల్లేందుకే స్కూటీ స్కీం పేరుతో ప్రచారం చేస్తున్నారని అన్నారామె. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందన్న పురంధేశ్వరి.. గత ప్రభుత్వం చేసిన పొరపాటు జగన్ ప్రభుత్వం చేయొద్దని సూచించారు. కాకినాడలో బీజేపీ సంఘటనా పర్వ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పురంధేశ్వరి.. గోదారి జలాల పంపకాల విషయంలో అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు.
*తెలంగాణలో కొత్త మున్సిపల్‌ చ‌ట్టంపై బీజేపీ పోరుబాట
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త మున్సిపల్‌ చ‌ట్టంపై బీజేపీ పోరుబాట ప‌ట్టింది. రాజ్యంగ విరుద్దంగా అనేక అంశాలు చేర్చార‌ని.. ఆ క్లాజ్‌లను వెంటనే తొల‌గించాలంటూ మండిపతోంది. దీనిపై గ‌వ‌ర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు.. ప్రజా వ్యతిరేక క్లాజ్‌లను తొల‌గించకపోతే.. పోరాటం ఇంకాస్త ఉధృతం చేస్తామని హెచ్చరించారు.తెలంగాణలో కొత్త మున్సిపల్‌ చ‌ట్టం అమల్లోకి వ‌చ్చింది. అసెంబ్లిలో నూతన చట్టానికి లాంచ‌నంగా ఆమోదం ల‌భించింది. అన్ని పార్టీలు కొన్ని స‌వ‌ర‌ణ‌లు సూచించిన తరువాత ప్రభుత్వం.. తాను రూపొందించిన చ‌ట్టాన్ని మూజువాని ఓటుతో ఆమోదించుకునేలా చేసింది. కొత్త చ‌ట్టంతో మునిసిపాలిటీల్లో క‌లెక్టర్లకు పూర్తి అధికారాలు రాబొతున్నాయి. అయితే క‌లెక్టర్ల పెత్తనం పెరగడం.. స్థానిక ప్రజా ప్రతినిధుల, అధికారుల హ‌క్కులు హ‌రించేలా చట్టం ఉందని విప‌క్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
*వైసీపీ నుంచి బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారు – రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు
తెలంగాణలో ఇప్పటికే దూకుడు పెంచిన బీజేపీ.. ఇప్పుడు పూర్తిగా ఏపీపై ఫోకస్‌ చేసింది. 2024 ఎన్నికల నాటికి ప్రధాన పార్టీగా బలపడడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్‌ కమలాన్ని షురూ చేసిన ఆ పార్టీ.. త్వరలోనే టీడీపీ, వైసీపీలకు చెందిన కీలక నేతలు పార్టీలో చేరుతారంటూ ప్రచారం చేస్తోంది. మొన్నటి వరకు కేవలం టీడీపీనే టార్గెట్‌ చేసిన బీజేపీ నేతలు.. ఇప్పుడు వైసీపీ పాలపైనపై నిప్పులు చెరుగుతున్నారు.ఎన్నికల ముందు వరకు వైసీపీకి కాస్త సోపర్ట్‌గా ఉన్నట్టు కనిపించిన.. బీజేపీ ఇప్పుడు వాయిస్‌ మార్చింది.. జగన్‌ సర్కారు తీరుపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జగన్‌ పాలన అవీనితిమయంగా ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలే జగన్‌ అసమర్ధపాలనకు ఉదాహరణ అన్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారని చెప్పి అధికార పార్టీని హెచ్చరించారు.
*రాములు నాయక్ కు సుప్రీంలో ఊరట
ఎమ్మెల్సీల అనర్హత వేటు వ్యవహారంలో రాములు నాయక్‌ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాములు నాయక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఫైనల్ తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీ ఎన్నిక జరపవద్దని తెలంగాణ ప్రభుత్వం, మండలి ఛైర్మన్‌ కు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తనపై అనర్హత వేటు విధిస్తూ అప్పటి శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాములు నాయక్‌ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.అంతేకాకుండా మండలి ఛైర్మన్‌ తీసుకున్న నిర్ణయం సరైందేనని సమర్థించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు తన పిటిషన్‌ కొట్టివేయడాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. దీంతో రాములు నాయక్‌ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ కేసులో తర్వాతి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.
*యూపీ గవర్నర్‌గా ఆనందీ బెన్‌ పటేల్‌
కేంద్రం గవర్నర్ల నియామకాలు, బదిలీల ప్రక్రియను కొనసాగిస్తోంది. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతో పాటు ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తోన్న వారిని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం కొత్త నియామకాలు చేపడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న ఆనందీబెన్‌ పటేల్‌ను యూపీకి బదిలీ చేయగా.. బిహార్‌ గవర్నర్‌ లాల్‌జీ టాండన్‌ను మధ్యప్రదేశ్‌కు నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బిహార్‌ గవర్నర్‌గా ఫగు చౌహాన్‌, పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌, త్రిపుర గవర్నర్‌గా రమేశ్‌ బయాస్‌, నాగాలాండ్‌ గవర్నర్‌గా ఆర్‌ఎన్‌ రవిని కేంద్రం నియమించింది. కొత్త గవర్నర్లు బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి వారి నియామకాలు అమల్లోకి వస్తాయి.
*ఆమె అరెస్టు రాజ్యాంగ విరుద్ధం: వాద్రా
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోంభద్ర బాధితులను కలవడానికి వెళుతుండగా తన భార్య, కాంగ్రెస్‌ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకోవడంపై రాబర్ట్ వాద్రా అక్కడి భాజపా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని, ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మారనివ్వకూడదని మండిపడ్డారు. రెండు రోజుల క్రితం సోంభద్రలో జరిగిన ఘటనలో 10 మంది మరణించిన సంగతి తెలిసిందే.
*ఏపీ నూతన గవర్నర్‌ను కలిసిన విజయసాయి
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషన్ హరిచందన్‌ను వైకాపా పార్లమెంటరీ పార్టీనేత విజయసాయిరెడ్డి కలిశారు. భువనేశ్వర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి జగన్‌, ఏపీ ప్రజల తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బిశ్వభూషన్‌ను శాలువాతో సత్కరించి వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేశారు.
*లోపభూయిష్టంగా కొత్త పురపాలక చట్టం
రాజ్యాంగం కల్పించిన చట్టాన్ని పక్కనపెట్టి రాష్ట్రంలో లోపభూయిష్టంగా కొత్త పురపాలక చట్టం తయారు చేశారని భాజపా నాయకులు విమర్శించారు. కొత్త చట్టాన్ని పరిశీలించి, ఆపాలని కోరుతూ మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నేతృత్వంలోని భాజపా నేతల బృందం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను శుక్రవారం రాజ్భవన్లో కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ… ఆర్థిక వనరులు, పన్నులు, సామాజిక అంశాలు, రవాణా, తాగునీరు తదితరాలను పరిగణనలోకి తీసుకోకుండా తెలంగాణ పురపాలక చట్టం తెచ్చారని ఆరోపించారు.
*సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సురవరం సుధాకర్రెడ్డి అనారోగ్య కారణాల వల్ల ఆ బాధ్యతలు నిర్వహించలేనని గతంలోనే పార్టీకి తెలియజేశారు. ఈ నేపథ్యంలో మార్పునకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ప్రారభమైన పార్టీ జాతీయ మండలి సమావేశాలు ఆదివారంతో ముగుస్తాయి. ఈ సమావేశాల్లోనే రాజాను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోనున్నారు.
*అవసరమైతే మా అన్నా భాజపాలోకి
పార్టీ మార్పు నిర్ణయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా తనతో పాటు వస్తారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో భాజపాయే అధికారంలోకి వస్తుందన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. భట్టి విక్రమార్కను సభలో మాట్లాడనివ్వకపోవడం బాధాకరమన్నారు. రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ దేశ అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని చెప్పారు.
*పురపాలనపై కలెక్టర్ల పెత్తనం సరికాదు
పుర పాలనలో కలెక్టర్లకు పూర్తి అధికారాలు కట్టబెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని శాసనసభలో కాంగ్రెస్ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొత్త పురపాలక చట్టం పరిపాలనను కేంద్రీకృతం చేస్తోందన్నారు. ఎన్నికైన పాలక వర్గాల స్వేచ్ఛను హరించి నిర్ణయాధికారం కలెక్టర్ల చేతిలో పెట్టడం ఎంతమాత్రం సరికాదని.. డీటీసీపీ ఇవ్వాల్సిన లేఅవుట్ అనుమతులను కూడా వారికే అప్పగించారని అన్నారు.
*పరిశ్రమల స్థాపన పేరిట అక్రమాలు: కోదండరాం
పలు పరిశ్రమల స్థాపన పేరుతో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసి ఫిర్యాదు చేశారు. పరిశ్రమలకు భూ సేకరణను గ్రామసభ ద్వారా ప్రజల సమక్షంలో చేయాల్సి ఉన్నా, ఎవరినీ సంప్రదించకుండానే చేస్తున్నారన్నారు.
*రాములు నాయక్ పిటిషన్పై ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఎమ్మెల్సీ అనర్హత వేటుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాములు నాయక్ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గావిల ధర్మాసనం పిటిషన్ విచారణకు స్వీకరించి తెలంగాణ ప్రభుత్వం, శాసన మండలి ఛైర్మన్ తదితరులకు 4 వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.
*రాజ్భవన్కు మంచి పేరు తేవాలి: గవర్నర్ నరసింహన్
ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటవుతున్న కొత్త రాజ్భవన్కు మంచి పేరు తేవాలని అధికారులు, ఉద్యోగులకు తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. ఏపీకి కొత్త గవర్నర్ నియామకం నేపథ్యంలో అక్కడ ప్రారంభమవుతున్న రాజ్భవన్కు తెలంగాణ రాజ్భవన్ నుంచి సంయుక్త కార్యదర్శి అర్జున్ రావు, సంయుక్త సంచాలకురాలు శశికళ, మీడియా కార్యదర్శి గౌరీశంకర్ ఇతర సిబ్బందిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ సందర్భంగా రాజ్భవన్లో శుక్రవారం వారికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.
*విద్యుత్తు కొనుగోళ్లలో దోపిడీ స్పష్టం: సీఎం జగన్
తెదేపా హయాంలో అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టారని ముఖ్యమంత్రి జగన్ ధ్వజమెత్తారు. పీపీఏల సమీక్షపై శాసనభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. ‘‘2015-16లో ఆర్పీవో ప్రకారం 5 శాతం పునరుత్పాదక విద్యుత్తు కొనుగోలు చేయాల్సి ఉంటే.. ఈ ప్రభుత్వం 5.59 శాతం విద్యుత్తును కొనుగోలు చేసింది. 2016-17లో 8.6 శాతం కొనుగోలు చేశారు. ఆర్పీవో నిబంధన కంటే అదనంగా విద్యుత్తు కొనుగోలు చేయటం వల్ల రూ.436 కోట్ల మొత్తం భారం మోయాల్సి వచ్చింది.
*రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది: కన్నా
రాష్ట్రంలో తెదేపా అరాచక, అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు వైకాపాకు అధికారం ఇస్తే ఆ పార్టీ కూడా అదే రీతిలో పాలన సాగిస్తోందని, ప్రతి చోట పోలీసుల రాజ్యం నడుస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. స్థానిక ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన ‘సంఘటన్ పర్వ్-2019’ సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొన్నారు.
*గోదావరి జలాలను మళ్లిస్తే రైతులు ఊరుకోరు
గోదావరి నీటిని పక్క రాష్ట్రానికి మళ్లిస్తే రైతులు చూస్తూ ఊరుకోరని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఒంగోలులో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో రాజకీయంగా, ఆర్థికంగా, పోలీసులపరంగా సాయం అందించిన రాష్ట్రానికి ‘నీకిది- నాకిది’ కింద గోదావరి నీటిని తాకట్టు పెట్టేందుకు సీఎం జగన్ చూస్తున్నారని విమర్శించారు. ‘కృష్ణా బ్యారేజీ నుంచి వైకుంఠపురం వద్ద ఎత్తిపోతల ద్వారా సోమశిల, వెలుగొండ ప్రాజెక్టులకు నీటిని తరలించే అవకాశం ఉంది.
*గోప్యతను హరించేందుకు ప్రభుత్వ యత్నం: ఎంపీ గల్లా
గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినా.. ఆధార్, ఇతర బిల్లులతో దానిని హరించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ విమర్శించారు. మానవ హక్కుల రక్షణ సవరణ బిల్లు-2019 చర్చలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. ‘‘ఏ కంప్యూటర్ నుంచైనా ఎటువంటి అనుమతి లేకుండా సమాచారాన్ని తీసుకోవడం, సమాచార మార్పిడిని తెలుసుకునేందుకు కేంద్ర హోం శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ నా దృష్టిలో మానవ హక్కుల ఉల్లంఘనే. దానిని నిలిపివేయాలి. ప్రస్తుత బిల్లుతో న్యాయమూర్తులను ఎస్హెచ్ఆర్సీ ఛైర్మన్లుగా నియమించేందుకు వీలు కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎస్హెచ్ఆర్సీ ఛైర్మన్, సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన ఊహించని రీతిలో సాగుతోంది.
*కెమెరాల అమ్మకాలను నియంత్రించాలి: ఎంపీ వంగా గీత
ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ రహస్య కెమెరాలను అమరుస్తుండటంతో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలుగుతోందని వైకాపా ఎంపీ వంగా గీత ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో స్పై కెమేరాలు అమ్ముతున్నారని, రక్షణ కోసం తప్పించి ఇంకెక్కడా స్పై కెమెరాలు అమ్మడానికి వీలు లేకుండా చేయాలని కోరారు. శుక్రవారం లోక్సభలో ఆమె మాట్లాడారు.
*ప్రియాంక అరెస్టు దారుణం: రఘువీరా
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రాను అరెస్టు చేయడం దారుణమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. భూమి కోసం పోరాడుతున్న ఆదివాసీ రైతులు మరణిస్తే, వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంకను అరెస్టు చేయడం అన్యాయమని ఓ ప్రకటనలో మండిపడ్డారు.
*భాజపాలో చేరేందుకు తెదేపా ఎమ్మెల్సీల ఆసక్తి: మాధవ్
తెదేపాకు చెందిన ఎమ్మెల్సీలు చాలా మంది తమ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని, మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తమ పార్టీలో చేరే అవకాశముందని భాజపా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తెలిపారు. సినీ నటుడు చిరంజీవి తమ పార్టీలోకి వచ్చే అంశంపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
*‘అమరావతి’ని విజయవంతంగా అడ్డుకున్నారు: లోకేశ్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడంలో మొదటి అడుగును విజయవంతంగా వేశారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు హయాంలో కళకళ్లాడిన రాజధాని… జగన్ తుగ్లక్ చర్యలతో ఖాళీ అయ్యిందన్నారు. ‘‘రైతులను రెచ్చగొట్టడం, పంటలు తగలబెట్టడం, దొంగ ఉత్తరాలు…ఇలా జగన్ చరిత్ర తెలుసుకున్న ప్రపంచబ్యాంకు సెలవు తీసుకుంది’’ అని పేర్కొన్నారు.
*లోకేశ్ అక్రమాలపై విచారణ జరిపించాలి
రాష్ట్ర ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా లోకేశ్ ఉన్న సమయంలో అడ్డగోలు నిర్ణయాలతో రూ.వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ డిమాండ్ చేశారు. బాపట్లలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సోమవారం కలిసి అక్రమాలపై తన వద్ద ఉన్న ఆధారాలు అందజేస్తానన్నారు.