DailyDose

విశాఖలో 2019 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు -తాజావార్తలు-07/20

2019 Independence Day Celebrations In Vizag-Today Telugu Breaking News-July 20 2019

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విశాఖ మహానగరంలో నిర్వహించడానికి నిర్ణయించినట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి మొత్తం శెట్టి శ్రీనివాస రావు చెప్పారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేయడంలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని విశాఖ పార్లమెంటు సభ్యులతో కలిసి మంత్రి అవంతి శ్రీనివాస్ పరిశీలించారు. బీచ్ రోడ్ లో గతంలో నిర్వహించిన విధంగా నిర్వహించడానికి గల అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్ర వేడుకలు విశాఖలో నిర్వహించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించినందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకలలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
* అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఈస్ట్ కామెంగ్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో.. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ భూకంప కేంద్రం బొందిలకు ఈశాన్యంలో 64కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
* రాష్ట్రంలో భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. 90మంది స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి
* కేంద్రం గవర్నర్ల నియామకాలు, బదిలీల ప్రక్రియను కొనసాగిస్తోంది. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతో పాటు ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తోన్న వారిని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం కొత్త నియామకాలు చేపడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
*మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న ఆనందీబెన్‌ పటేల్‌ను యూపీకి బదిలీ చేయగా.. బిహార్‌ గవర్నర్‌ లాల్‌జీ టాండన్‌ను మధ్యప్రదేశ్‌కు నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బిహార్‌ గవర్నర్‌గా ఫగు చౌహాన్‌, పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌, త్రిపుర గవర్నర్‌గా రమేశ్‌ బయాస్‌, నాగాలాండ్‌ గవర్నర్‌గా ఆర్‌ఎన్‌ రవిని కేంద్రం నియమించింది. కొత్త గవర్నర్లు బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి వారి నియామకాలు అమల్లోకి వస్తాయి.
* కేంద్రం గవర్నర్ల నియామకాలు, బదిలీల ప్రక్రియను కొనసాగిస్తోంది. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతో పాటు ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తోన్న వారిని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం కొత్త నియామకాలు చేపడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న ఆనందీబెన్‌ పటేల్‌ను యూపీకి బదిలీ చేయగా.. బిహార్‌ గవర్నర్‌ లాల్‌జీ టాండన్‌ను మధ్యప్రదేశ్‌కు నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బిహార్‌ గవర్నర్‌గా ఫగు చౌహాన్‌, పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌, త్రిపుర గవర్నర్‌గా రమేశ్‌ బయాస్‌, నాగాలాండ్‌ గవర్నర్‌గా ఆర్‌ఎన్‌ రవిని కేంద్రం నియమించింది. కొత్త గవర్నర్లు బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి వారి నియామకాలు అమల్లోకి వస్తాయి.
* ఏపీ ప్రభుత్వం ఉన్నతవిద్యామండలిపై విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వంలో ఉన్నత విద్యామండలిలో అక్రమాలు జరిగాయని, పెద్దఎత్తున నిధుల గోల్ మాల్ జరిగాయని ఆరోపణలు లేవనెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి అద్వర్యంలో ఏకపక్ష కమిషన్ వేసిన ప్రభుత్వం వచ్చేనెలాఖరుకల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
* ఆంధ్రప్రదేశ్‌కు ఐదు, గుజరాత్‌కు ఏకంగా 14 టెక్స్‌టైల్‌ పార్కులు మంజూరు చేసినట్లు టిడిపి ఎంపి కేశినేని నాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర టెక్స్‌టైల్‌ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. స్కీం ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ పార్కు కింద ఎపిలో విఖపట్నం, నెల్లూరు (రెండు), హిందూపురం, గుంటూరుల్లో పార్కులు మంజూరు చేసినట్లు తెలిపారు.
వాటిలో విశాఖపట్నం టెక్స్‌టైల్‌ పార్కు పూర్తయ్యిందని, మిగతా నాలుగు ప్రారంభ దశలోనే ఉన్నాయని పేర్కొన్నారు. గుజరాత్‌కు సంబంధించి ఏడు పార్కులు పూర్తయ్యాయని, మిగిలిన పార్కుల పనుల జరుగుతున్నాయని తెలిపారు.
* ఆంధ్రప్రదేశ్‌కు నిర్భయ స్కీమ్‌ కింద వివిధ విభాగాల్లో గత ఐదేళ్లలో రూ.208 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మహిళ, శిశుఅభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. వైసిపి ఎంపిలు మార్గాని భరత్‌, వంగా గీత విశ్వనాథ్‌ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. నిర్భయ స్కీం కింద కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2015 నుంచి 2019 వరకు రూ.98 కోట్లు విడుదల చేసిందని, రూ.66.70 కోట్లకు యూసిలు అందాయని తెలిపారు. సివిసిఎఫ్‌ కింద రూ.66.20 కోట్లు విడుదల చేసినట్లు, అందులో రూ.14.60 కోట్లకు యూసిలు అందాయని చెప్పారు. సిసిపిడబ్ల్యుసి కింద రూ.44.20 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
*అతి తక్కువ ధరలతో ప్రయాణికులకు ఏసీ బోగీ సౌకర్యాన్ని కల్పిస్తున్న గరీబ్‌రథ్‌ రైళ్లను రద్దుచేసే ఆలోచన లేదని భారతీయ రైల్వేశాఖ శుక్రవారం తేల్చి చెప్పింది. గత కొన్ని రోజులుగా వీటిని రద్దుచేస్తారు అంటూ వదంతులు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం రైల్వే మంత్రిత్వశాఖ పై విధంగా స్పందించింది.
*వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దాడికేసు నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ రద్దయ్యింది. శ్రీనివాసరావుకు బెయిల్ రద్దు చేస్తూ ఇవాళ(శుక్రవారం) హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ రద్దు చేయాలంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.హైకోర్టులో ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అయితే NIA వాదనతో ఏకీభవించిన కోర్టు శ్రీనివాస్‌ బెయిల్‌ రద్దు చేసింది. అయితే నిందితుడు బెయిల్‌పై అప్పీలు చేసుకునే అవకాశాన్ని హైకోర్టు కల్పించింది.శ్రీనివాస్‌కు ఈ ఏడాది మే 22న బెయిల్‌ మంజూరు కాగా, 25న జైలు నుంచి విడుదల అయ్యాడు. దీంతో కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని NIA ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హైకోర్టులో అభ్యర్థించారు.2018 అక్టోబర్ 25న వైఎస్‌ జగన్‌పై శ్రీనివాసరావు కత్తితో విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో దాడి చేశాడు.
*వింటి లాగివదిలిన బాణంలా రోదసిలో దూసుకెళ్తున్న గ్రహశకలం.. 2019 ఎన్‌జే2! 207 అడుగుల వ్యాసం ఉన్న ఈ గ్రహశకలం గంటకు 48,280 కిలోమీటర్ల వేగంతో విశ్వంలో ప్రయాణిస్తోంది.భారత కాలమానం ప్రకారం, శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు ముందు.. భూమికి అత్యంత సమీపం నుంచి.. అనగా కేవలం 31 లక్షల మైళ్ల దూరం నుంచి ఇది దూసుకుపోయింది. 31 లక్షల మైళ్లంటే మనకు బాగా ఎక్కువే అనిపించొచ్చుగానీ, ఈ విశాల విశ్వాన్ని అందులోని గ్రహాల మధ్య దూరాన్ని లెక్కలోకి తీసుకుంటే ఖగోళ శాస్త్రజ్ఞుల లెక్కప్రకారం ఇది బాగా దగ్గర కిందే లెక్క. మళ్లీ ఇది మన భూమిని 2119, జూలై 7న.. అంటే దాదాపు వందేళ్ల తర్వాత పలకరించనుంది. అప్పుడు అది భూమికి 2.38 కోట్ల మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది.
* ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలు, వరదలతో సతమతమవుతున్న అరుణాచల్ ప్రశ్ రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున సంభవించిన భూప్రకంపనలు ప్రజల్లో భయాందోళనలు రేపాయి.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఈస్ట్ కామెంగ్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 4.24 గంటలకు భూకంపం వచ్చింది. భూప్రకంపనలతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 గా నమోదైందని కేంద్ర వాతావరణశాఖ ప్రకటించింది. ఈ భూకంప కేంద్రం బొందిలకు ఈశాన్యంలో 64 కిలోమీటర్ల లోతులో ఉందని తేలింది. వరదలు, భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన
* ముఖ్యమైన బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటు సమావేశాలను ఆగస్టు 2 వరకు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జూన్ 17న ప్రారంభమైన ఈ సమావేశాలు ఈ నెల 26న ముగియవలసి ఉంది. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా లోక్సభలో అంతరాయాలు లేకుండా చర్చలు జరుగుతున్నాయి.
*అరుణాచల్ ప్రదేశ్లో శుక్రవారం వెంటవెంటనే మూడు భూకంపాలు సంభవించాయి. రిక్టరు స్కేలుపై వరుసగా 5.6, 3.8, 4.9గా తీవ్రతలు నమోదయ్యాయి. తూర్పు కమెంగ్జిల్లాలో సంభవించిన ఈ భూకంపం ప్రభావంతో అరుణాచల్లోని ఇటానగర్తో పాటూ, అసోంలోని గువాహటి, మరికొన్ని ప్రదేశాలు, నాగాలాండ్లోని దిమాపుర్లలో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.
*వాహనాలు సాఫీగా ముందుకు సాగేందుకు, రద్దీని నివారించేందుకు డిసెంబర్ 1 నుంచి జాతీయ రహదారులపై టోల్ప్లాజాల వద్ద అన్ని వరసలను ఫాస్టాగ్ మార్గాలుగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
*నానాటికీ తీవ్రమవుతోన్న కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా వాహనాల కాలుష్యంపై కొరడా ఝుళిపించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 1.06 కోట్ల వరకు వాహనాలున్నాయి.
*ఇక నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నగదు రహిత సేవలు అందించనున్నారు. వినియోగదారులు డబ్బులు చెల్లించేందుకు తాజాగా టీ-వాలెట్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
*సొమ్ము మొత్తం చెల్లించినప్పటికీ ఫ్లాట్ను అప్పగించకపోగా నిర్మాణదారు మరొకరి పేరుతో రిజిస్టర్ చేయించినందున చెల్లించిన సొమ్ము రూ.19.25 లక్షలను 18శాతం వడ్డీతో సహా చెల్లించాలని మోనియా-ఇ-ఫ్లాట్స్ అండ్ ప్లాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ను రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.
*కాళేశ్వరం సహా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ వ్యవహారాల్లో దాఖలైన పిటిషన్ల పరిష్కారానికి ఓ మార్గాన్ని యోచించాలని శుక్రవారం హైకోర్టులో ప్రత్యేకంగా ఏర్పాటైన గ్రీన్బెంచ్ ప్రభుత్వానికి సూచించింది.
*పట్టణ పరిపాలనను అవినీతి రహితంగా, జవాబుదారీతనంతో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
*తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసిన వరవరరావుకు జైలులో మెరుగైన సదుపాయాలు కల్పించాలని వివిధ రంగాల ప్రముఖులు కోరారు. ఇదే విషయమై ఆయన సతీమణి పి.హేమలత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావుకు లేఖ రాశారు.
*ఆయుష్మాన్ భారత్ పథకంలోకి తెలంగాణను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ లోక్సభలో తెలిపారు. ‘‘ఈ పథకంలో తెలంగాణతో పాటు దిల్లీ, పశ్చిమ్ బంగ, ఒడిశా చేరలేదు.
*కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండ పోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పరిహారం చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు నిర్వాసితులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
*ఆయుష్మాన్ భారత్ పథకంలోకి తెలంగాణను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ లోక్సభలో తెలిపారు.
*తెలంగాణలో ఇటీవల అటవీ శాఖ అధికారులపై నమోదైన వేధింపుల(అట్రాసిటీ) కేసులపై సుప్రీం కోర్టు స్టే(యథాతథ స్థితి) విధించింది. ఇటీవల అటవీశాఖ అధికారులపై దాడుల నేపథ్యంలో సుమోటో పిటిషన్ను శుక్రవారం జస్టిస్ అరుణ్మిశ్ర, జస్టిస్ దీపక్గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది.
*రాష్ట్రంలో 11,114 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఉన్న ఖాళీలతోపాటు కొత్తగా 91,652 ఉద్యోగుల నియామకానికి అనుమతించింది. ఈ మేరకు శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రతి సచివాలయంలో పది మంది శాశ్వత ఉద్యోగులను నియమిస్తున్నారు.
*నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాయని వాతావరణశాఖ ప్రకటించింది. సాధారణంగా ఈ పరిణామం జులై 15వ తేదీకే పూర్తి కావాల్సి ఉంది. ఈసారి ఆలస్యమైందని అధికారులు తెలిపారు.
*భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సురవరం సుధాకర్రెడ్డి అనారోగ్య కారణాల వల్ల ఆ బాధ్యతలు నిర్వహించలేనని గతంలోనే పార్టీకి తెలియజేశారు.
*అక్రమంగా నగదు డిపాజిట్ల సేకరణను కట్టడి చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ శుక్రవారం లోక్సభలో అనియంత్రిత డిపాజిట్ల పథకాల నిషేధ బిల్లు-2019ను ప్రవేశపెట్టారు.
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనల ప్రకారం వ్యవహరించకపోవడంతో 2018-19 రబీ కాలానికి సంబంధించి కరవుపై ప్రకటన చేయలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వర్షాభావంపై రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
* కాపు కార్పొరేషన్ ఛైర్మన్గా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు వైకాపా వర్గాలు పేర్కొంటున్నాయి. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు తనయుడైన రాజా తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.