DailyDose

జబర్దస్త్ వినోద్‌పై ఇంటి ఓనర్ దాడి-నేరవార్తలు-07/20

House Owner Attacks Jabardasth Vinod-Today Telugu Crime News-July 20 2019

* జబర్దస్త్ కమెడియన్ వినోద్ పై దాడి జరిగింది. ఈ ఘటన కాచిగూడ పోలీస్టేషన్ పరిదిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జబర్ధస్త్ కమెడియన్ వినోద్.. కాచిగూడలో ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. ఇందుకు గాను 10 లక్షల రూపాయలను అడ్వాన్స్ గా ఆ ఇంటి ఓనర్ కు ఇచ్చానని చెప్పాడు. అయితే 30 గజాల స్థలంలో గోడ నిర్మాణం విషయంలో ఇళ్లు అమ్ముతున్న అతనికి తనకు గొడవ జరిగిందని అన్నాడు. దీంతో బాలాజీ, ప్రమీల, సాయి చందర్ లు తనపై దాడి చేసినట్లు గా పోలీసులకు ఫిర్యాదు చేశాడు వినోద్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వినోద్ జబర్ధస్త్ షో లోని చంద్ర టీంలో ఫిమేల్ రోల్స్ చేస్తుంటాడు.
* పులి చర్మాన్ని తరలిస్తున్న ఐదుగుర్ని కేరళ అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. తమిళనాడు- కేరళ సరిహద్దులోని వల్లక్కడవు అటవీ ప్రాంతంలో అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. కుములి నుంచి కొట్టాయం వైపు వెళ్తున్న ఓ కారును సోదా చేశారు. అందులో పులి చర్మాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిసింది. శివకాశికి చెందిన నారాయణన్‌ (71), కుముదికి చెందిర సక్కరై (51), మురుగన్‌ (42), కొడైక్కానల్‌కు చెందిన కరుప్పయ్య, తిరునెల్వేలికి చెందిన రత్నవేల్‌ (50)లు కారులో ఉన్నారు. వారు కొట్టాయంలో ఒకరికి పులి చర్మాన్ని అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిసింది. నిందితులను అధికారులు అరెస్టు చేశారు. పులి చర్మం, కారును స్వాధీనం చేసుకున్నారు.
* కృష్ణా జిల్లా నందివాడ మండలం టెలిఫోన్ నగర్ వద్దరోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతిచెందగా, 9మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు
* ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సోంభద్రలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈనెల 17న జరిగిన భూవివాద ఘటనలో 10మంది మృతిచెందారు. దీంతో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న టీఎంసీ ఎంపీలు వెళ్తుండగా బాబత్ పూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
* అనంతపురం 1 టౌన్ పరిధి లోని రాణినగర్ లో దారుణం జ‌రిగింది. వడ్డీడబ్బులు ఇవ్వలేదని అప్పు తీసుకున్న వ్యక్తిని వడ్డీ వ్యాపారి అతి దారుణం గా కొట్టాడు. వ‌డ్డి తీసుకున్న వ్య‌క్తి అపస్మారక స్థితికి చేర‌గా అత‌ని స్నేహితులు అనంతపురం సర్వజన ఆసుపత్రి కి తరలించారు. బాధితుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. కాగా అనంత పురం 1 టౌన్ రాణి నగర్ లో ఎన్నో సంవత్సరాలుగా 10,20,30 రూపాయల వడ్డీ తీసుకుంటూ బాధితులను వడ్డీ వ్యాపారులు జ‌ల‌గ‌ల్లా పీడిస్తున్నారు
* మహారాష్ట్రలోని పుణె – సోలాపూర్ హైవేపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు – లారీ ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను పుణెకు సమీపంలోని యావత్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి
* రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని జేడీఏ సర్కిల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సర్కిల్‌లో సిగ్నల్ క్రాస్ చేస్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని.. వేగంగా వచ్చిన ఆడి కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి గాల్లోకి ఎగిరి 30 అడుగుల దూరంలో పడిపోయాడు. అనంతరం కారు డ్రైవర్ సిద్ధార్థ్ శర్మ అక్కడ్నుంచి పారిపోయాడు. గాయపడ్డ అభయ్ దగార్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మొత్తానికి సిద్ధార్థ్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు
*తిరుపతిలో నిర్మాణ దశలో ఉన్న భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. మరొకరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.
*మేడ్చల్‌లోని ఓ బస్తీలో దారుణం చోటుచేసుకుంది. బస్తీ సమీపంలో గోనెసంచిలో 14 ఏళ్ల ఓ బాలిక మృతదేహం లభించడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక గొంతుకోసి, ఆనవాళ్లు గుర్తించకుండా కనుగుడ్లు పీకి, మొహంచెక్కి అత్యంత కిరాతకంగా హతమార్చారు. అనంతరం గోనెసంచిలో కుక్కి.. సమీపంలోని చెత్తకుండిలో పడేశారు
*శనివారం అర్థరాత్రి పూణె-షోలాపూర్ హైవేపై ఓ కారు ప్రమాదానికి గురి కావడంతో  మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పూణె జిల్లాలోని కడంవాక్ వాస్తి ప్రాంతంలో అర్థరాత్రి  గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన విద్యార్థులంతా  నుంచి  ఏళ్ల వయసువారని వారు పేర్కొన్నారు. వారంతా యావత్పూణె జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారనిరాయగడ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు లోని కల్భోర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్‌పెక్టర్ సూరజ్ బండ్గర్ తెలిపారు.
*పులి చర్మాన్ని తరలిస్తున్న ఐదుగుర్ని కేరళ అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. తమిళనాడు- కేరళ సరిహద్దులోని వల్లక్కడవు అటవీ ప్రాంతంలో అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. కుములి నుంచి కొట్టాయం వైపు వెళ్తున్న ఓ కారును సోదా చేశారు. అందులో పులి చర్మాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిసింది. శివకాశికి చెందిన నారాయణన్‌ (71), కుముదికి చెందిర సక్కరై (51), మురుగన్‌ (42), కొడైక్కానల్‌కు చెందిన కరుప్పయ్య, తిరునెల్వేలికి చెందిన రత్నవేల్‌ (50)లు కారులో ఉన్నారు. వారు కొట్టాయంలో ఒకరికి పులి చర్మాన్ని అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిసింది. నిందితులను అధికారులు అరెస్టు చేశారు. పులి చర్మం, కారును స్వాధీనం చేసుకున్నారు.
*మహారాష్ట్రలోని పుణె – సోలాపూర్ హైవేపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు – లారీ ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను పుణెకు సమీపంలోని యావత్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
*రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని జేడీఏ సర్కిల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సర్కిల్‌లో సిగ్నల్ క్రాస్ చేస్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని.. వేగంగా వచ్చిన ఆడి కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి గాల్లోకి ఎగిరి 30 అడుగుల దూరంలో పడిపోయాడు. అనంతరం కారు డ్రైవర్ సిద్ధార్థ్ శర్మ అక్కడ్నుంచి పారిపోయాడు. గాయపడ్డ అభయ్ దగార్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మొత్తానికి సిద్ధార్థ్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం రోజు కూడా ఇదే సిగ్నల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు.. సిగ్నల్ వద్ద ఆగిన ఇతర వాహనాలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
*అనంతపురం కంబదురు మండల కేంద్రంలో చెక్ పోస్ట్ సమీపంలో గత రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.ఆ వ్యక్తి ని బాండ రాయి తో కొట్టి చంపిన దుండగులు ఎరుకుల రవి గా గుర్తింపు.
*కృష్ణాజిల్లా మచిలీపట్నంలో తెల్లవారు జామున నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంప్రధాన రహదారులన్నీ జలమయంమోకాళ్ళ లోతు నీటిలో మచిలీపట్నం ప్రధాన రహదారి, కోనేరు సెంటర్, లక్ష్మీస్ టాకీస్ పలు ప్రాంతాలుపొంగి ప్రవహిస్తున్న డ్రైనేజీలుతీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ప్రయాణీకులుమోకాళ్ల లోతు నీటిలోనే ప్రయాణాన్ని సాగిస్తున్న బందరు వాసులులోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరిన వర్షపు నీరునీటిని తోడేందుకు ఏర్పాట్లు చేస్తున్న మచిలీపట్నం నగరపాలక సంస్థ అధికారులు.
*ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇండ్లను పగలు రెక్కి నిర్వహించి రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్న ఆంధ్రా రాష్ర్టానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగను పోలీస్లు అరెస్ట్ చేశారు.
*తాలూకాలోని కడగందొడ్డిలో అక్రమంగా నిల్వ ఉంచిన 100కేజీల సీహెచ్ పౌడర్ను రాయచూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. హైదారాబాద్, పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో రాజు, అనిత(24) దంపతులు నివాసముంటున్నారు. అనితపై కొంతకాలంగా రాజు వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో సహించలేక పోయిన అనిత(24) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
*రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన సంతోష్, శ్యాం, విజయ్, వేములవాడకు చెందిన రాజేందర్ అంతా వైద్యులు. వీరందరు శుక్రవారం కడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి వస్తుండగా జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నాయకపుగూడెం సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో వీరు ప్రయాణిస్తున్న కారు రహదారి పక్కనే ఉన్న వ్యవసాయబావిలోకి దూసుకెళ్లింది.
*బాలికను అపహరించి అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామాంధుడిపై అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు నిర్భయ చట్టాన్ని ప్రయోగించారు.
*తెదేపా కార్యకర్తలపై వైకాపా వర్గీయులు దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా పొందూరు పంచాయతీ పరిధిలోని లక్ష్మక్కపాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది.
*భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెతో పాటు అత్తనూ దారుణంగా నరికి చంపాడు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాంపాలెంలో కాంతారావు, లక్ష్మి భార్యా భర్తలు.
*ఆరుగాలం కష్టపడి పండించిన చీనీ పంట నీరు లేక నిట్టనిలువునా ఎండిపోవడంతో… చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనతో అనంతలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామ రైతు సుబ్బయ్య (52) తనకున్న మూడు ఎకరాల్లో చీనీ సాగు చేశారు.
*తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని వాల్తేర్ డివిజన్లో టికెట్ తనిఖీ అధికారులు ఈ నెల 1 నుంచి 18వ తేదీ వరకూ ప్రత్యేకంగా చేపట్టిన తనిఖీల్లోభాగంగా రికార్డుస్థాయిలో రూ. 31.11 కోట్లు వసూలు చేశారు.
*దాదాపు పదకొండేళ్ల క్రితం దారుణహత్యకు గురైన బ్రిటిష్ బాలిక స్కార్లెట్ ఈడెన్ కీలింగ్(15) కేసులో దోషిగా రుజువైన శాంసన్ డిసౌజా అనే వ్యక్తికి బొంబయి హైకోర్టు శుక్రవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
* అధిక వడ్డీలు ఇస్తామని ‘ఐ మనీ అడ్వయిజరీ’ (ఐఎంఏ) సంస్థను నెలకొల్పి 41 వేల మందికి పైగా మదుపుదారుల నుంచి రూ.వేల కోట్ల నగదు డిపాజిట్లను స్వీకరించి, పరారైన సంస్థ యజమాని మహ్మద్ మన్సూర్ ఖాన్ను ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్), ఈడీ అధికారులు దిల్లీలో గురువారం అర్ధరాత్రి దాటాక అరెస్టు చేశారు.
*విలాసవంతమైన కార్లలో భారత్కు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టును ప్రత్యేక పోలీసులు రట్టుచేశారు. రూ.600 కోట్ల విలువైన అఫ్గాన్ హెరాయిన్తో పాటు, రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
*బిహార్లో దారుణం. గేదెను దొంగిలించడానికి ప్రయత్నించారన్న ఆరోపణతో ముగ్గురు వ్యక్తులపై కొందరు మూకగా దాడిచేసి, తీవ్రంగా కొట్టి చంపారు.
* రెండు నెలల చిన్నారిని అపహరించి, విక్రయించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలను శుక్రవారం ఎస్పీ రెమారాజేశ్వరి వెల్లడించారు.
*తల్లిదండ్రులు విడిపోయి బామ్మ ఇంట్లో ఉంటున్న ఇద్దరు బాలికలపైౖ పది మంది యువకులు ఆరు నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
* ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన ఒడిశాలోని కొంధమాల్ జిల్లా బెల్ఘర్ ఠాణా పరిధిలో వెలుగుచూసింది.
*ఒడిశాలోని బరగఢ్లో కొంతమంది యువతీ యువకులు ఓ నాగుపామును పట్టుకుని సెల్ఫీలు దిగారు. వీరిలో ఓ యువకుడు రోహిత్ మేహర్ దానితో ఆటలాడాడు. సర్పంతో దిగిన స్వీయచిత్రాలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. అవి కాస్తా వైరల్ అయ్యాయి. వన్యప్రాణి సంరక్షణ అధికారులు కేసు నమోదు చేసి రోహిత్ను శుక్రవారం అరెస్టు చేశారు.
*ఆర్థిక ఇబ్బందులు, వర్షాభావంతో వేసిన పంట పండుతుందో లేదోననే బెంగతో ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఒకరు, కామారెడ్డి జిల్లాలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
*అవినీతి కేసులో అరెస్టైన కొందుర్గు వీఆర్వో అనంతయ్య అనిశా అధికారుల ముందు తమ అక్రమాల చిట్టా విప్పుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో అరెస్టైన కేశంపేట తహసీల్దార్ లావణ్య నుంచి మాత్రం అధికారులు సమాధానాలు రాబట్టలేకపోతున్నారు. ఆమె పేరుతో ఉన్న రెండు బ్యాంక్ పాసుబుక్లను అనిశా అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.
*యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చరణ్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
*పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భార్య, అత్తను ఓ వ్యక్తి కత్తితో నరికాడు. ఈ ఘటన గోపాలపురం మండలంలోని దొండపూడిలో చోటు చేసుకుంది.
*ఐఎమ్ఏ అనినీతి కుంభకోణంలో ప్రధాన నిందితుడు మహ్మద్ మన్సూర్ ఖాన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అదుపులోకి తీసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన అతడిని అధికారులు శుక్రవారం వేకువజామున 1:30 గంటలకు అరెస్టు చేశారు.
*ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన ఒడిశాలోని కొంధమాల్ జిల్లా బెల్ఘర్ ఠాణా పరిధిలో వెలుగుచూసింది.