WorldWonders

ఎన్నో పాములను రక్షించాడు. వాటి కాటుకే మరణించాడు.

Snake Friend Sreenivas From Sadasivapet Dies Of Snake Bite

ఇండ్లలోకి వచ్చిన పాములను పట్టుకుని వాటిని చంపకుండా..అడవిలో వదిలే స్నేక్ ఫ్రెండ్ అదే పాము కాటుకి బలయ్యాడు. ఈ ఘటన పటాన్ చెరులో జరిగింది. వివరాల్లోకి వెళితే..పటాన్ చెరులో ఉండే శ్రీనవాస్ ముదిరాజ్ అలియాస్ ధనుష్(35) సదాశిపేటలోని ఎంఆర్ఎఫ్ టైర్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జాబ్ తో పాటు పాములను పట్టడాన్ని హాబీగా మార్చుకున్నాడు. ఫెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థలో శ్రీనివాస్ మెంబర్ గా ఉన్నాడు.అన్ని రకాల పాములను పట్టే శ్రీనివాస్..వాటిని అడవిలో వదిలేవాడు. ఎవరైనా తమ ఇంట్లోకి పాము వచ్చిందన ఫోన్ చేస్తే అక్కడికి వెళ్లి శ్రీనివాస్ వాటిని పట్టుకుని వదిలేసేవాడు. గురువారం సాయంత్రం మోమిన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్పల్లి మండలం కొంశెట్టిపల్లి గ్రామంలో ఓ ఇంట్లోకి నాగుపాము వచ్చింది. దీని గురించి సమాచారం అందుకున్న శ్రీనివాస్ అక్కడికి వెళ్లి నాగుపామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పాము శ్రీనివాస్ ను కాటేసింది. పాముకాటుకు గురైన శ్రీనివాస్ కళ్లు తిరిగి పడిపోయాడు. అతడిని సదాశివపేటలోని హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ శ్రీనివాస్ చనిపోయాడు. పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు..డెడ్ బాడీని కుటుంబీకులకు అప్పగించారు.