DailyDose

వాట్సాప్ పేమెంట్ సేవలు-వాణిజ్య-07/20

WhatsApp To Begin Payment Services-Today Telugu Business News-July20 2019

*‘గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, అమెజాన్’లాగే ఆన్ లైన్ పేమెంట్ సర్వీస్ లోకి ‘వాట్సాప్’ కూడా అడుగుపెట్టబోతోంది. వాట్సాప్ మాతృసంస్థ ‘ఫేస్ బుక్’ దీనికి సంబంధించిన అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. నిజానికి గతంలోనే ‘వాట్సాప్ పేమెంట్’ సేవలు ప్రారంభం కావాల్సి ఉన్నా, డేటా సెక్యూరిటీ కారణాలతో వాయిదా పడింది. అయితే యూజర్ల డేటాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వానికి కంపెనీ వివరించింది. దీంతో ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకు అనుమతి కోసం ప్రయత్నిస్తోంది. ఆర్బీఐ అనుమతులు రాగానే ‘వాట్సాప్ పేమెంట్’ సేవలు ప్రారంభమవుతాయి. వాట్సాప్ యూజర్లు భారీ సంఖ్యలో ఉన్నందున తాము విజయం సాధిస్తామని సంస్థ నమ్ముతోంది. దేశంలో వాట్సాప్ కు ముప్పై కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు.
*రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది..
ప్రముఖ మొబైల్‌ సంస్థ షియోమి ప్రతిష్టాత్మకమైన రెడ్‌ మి K20, K20 Pro ఫోన్లను బిగ్‌ సీ ద్వారా ఏపీ, తెలంగాణ మార్కెట్‌లో విడుదల చేయడం తమకెంతో సంతోషంగా ఉందని బిగ్ సీ ఫౌండర్ బాలు చౌదరి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ బిగ్ సీ షోరూంలో రెడ్‌మీ K20, K20 Pro ఫోన్లను షియోమి సంస్థ ఎండీ మనుకుమార్ జైన్‌తో కలిసి బాలు చౌదరి ఆవిష్కరించారు. 48 మెగా పిక్సల్ త్రిబుల్ కెమెరా, 20 మెగా పిక్సల్ పోప్‌ అప్ సెల్ఫీ కెమెరాతో పాటు అత్యాధునిక ఫ్యూచర్స్ ఈ ఫోన్ లలో అందుబాటులో ఉన్నాయని మను కుమార్ తెలిపారు. ప్రముఖ బ్రాండ్‌ మొబైల్స్ అన్ని బిగ్ సీ ద్వారా మార్కెట్‌లోకి పరిచయం చేయడం అనవాయితీగా వస్తుందని బాలు చౌదరి అన్నారు.
*సీపీఎస్ఈ ఈటీఎఫ్ ఆరో ఇష్యూకు సంస్థాగత, రిటైల్ మదుపర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఇష్యూ పరిమాణం రూ.8,000 కోట్లు కాగా, ఇంతకు 5 రెట్ల (రూ.40,000 కోట్ల విలువైన) బిడ్లు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు దాఖలయ్యాయని దీపమ్ కార్యదర్శి తెలిపారు.
*విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు జులై 12తో ముగిసిన వారానికి 111 కోట్ల డాలర్లు (రూ.7,700 కోట్లు) తగ్గి, 42879.7 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి.
*టెక్స్టైల్ రిటైల్ మార్ట్ అయిన మాంగల్య షాపింగ్ మాల్ భారీ విస్తరణ ప్రణాళికను అమలు చేయబోతోంది.
*తాము ప్రతిపాదించిన టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్లో బ్రూక్ఫీల్డ్ రూ.25,215 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) శుక్రవారం వెల్లడించింది.
*జనరిక్ అలెగ్రా-డీ ఔషధాన్ని యూఎస్ మార్కెట్లో విడుదల చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ శుక్రవారం వెల్లడించింది.
*ఒక కంపెనీ ఆర్థిక స్థితి, రుణ చెల్లింపు సామర్థ్యం బాగుంటేనే కొత్త రుణాలు పుడతాయి. ఈ కంపెనీలు జారీచేసే బాండ్లను కొనుగోలు చేసేందుకు మదుపర్లు ముందుకొస్తారు.
*ఆతిథ్య సంస్థ ఓయోలో ప్రారంభ పెట్టుబడిదారులకు ఉన్న రూ.13,770 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేసేందుకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ రితేశ్ అగర్వాల్ సిద్ధమయ్యారు. ఆర్ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్ ద్వారా ఆ వాటాల్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కూడా చేసుకున్నారు.
*‘బ్లాక్చైన్’ సాంకేతిక పరిజ్ఞానంలో అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ప్రత్యేకంగా ‘బ్లాక్చైన్ డిస్ట్రిక్ట్’ ఏర్పాటు చేయాలని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.
*జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికంలో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ రూ.310 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మొదటి త్రైమాసికంలో బంధన బ్యాంక్ రూ.701 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికంలో ఎఫ్ఎమ్సీజీ సంస్థ డాబర్ ఇండియా రూ.363.81 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.330 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 10.24 శాతం అధికం.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ రూ.267.10 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్ ఆర్జించిన రూ.190 కోట్లతో పోలిస్తే ఇది 41 శాతం ఎక్కువ.
*ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తికి రాయల్ హాలోవే యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ బహుకరించింది. కంప్యూటర్ సైన్స్ రంగంలో ఆయన సేవలకు గాను పురస్కారం వరించింది.
*మొబైల్ కనెక్షన్లలో రిలయన్స్ జియో రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా భారతీ ఎయిర్టెల్ మూడోస్థానానికి పరిమితమైంది.
*ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1,203.14 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*స్మార్ట్ ఫోన్లు, పవర్ బ్యాంకులు, రిస్ట్ బ్యాండ్ల విపణిలో అగ్రగామిగా ఎదిగిన షియోమి ఇకపై గృహోపకరణాల విపణిపై దృష్టి సారించనుంది.