NRI-NRT

న్యూజెర్సీలో అలరించిన జొన్నవిత్తుల-వడ్డేపల్లిల సాహితీ సదస్సు

న్యూజెర్సీలో అలరించిన జొన్నవిత్తుల-వడ్డేపల్లిల సాహితీ సదస్సు - NATS-TFAS Telugu Literary Meet In New Jersey

నాట్స్ -న్యూజెర్సీ తెలుగు కళా సమితి(టీ స్)తో కలిసి తెలుగు సాహిత్యంలో చమత్కారం అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ కవి వడ్డేపల్లి కృష్ణ, వీణా విద్వాంసులు ఫణి నారాయణలు ఈ కార్యక్రమానికి విచ్చేసి తెలుగు సాహిత్య చమత్కారాలతో తెలుగు ప్రజలను కడుపుబ్బా నవ్వించారు. వివిధ అంశాలపై జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అలవోకగా చెప్పిన శతకాలకు తెలుగు ప్రేక్షకులకు కరతాళధ్వనులతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. నాట్స్ మాజీ అధ్యక్షులు, నాట్స్ బోర్డు డైరెక్టర్ మోహన కృష్ణ మన్నవ, తెలుగు కళా సమితి అధ్యక్షులు సుధాకర్ ఉప్పల నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి న్యూజెర్సీలో తెలుగువారి నుంచి మంచి స్పందన లభించింది. నాట్స్ జాయింట్ సెక్రటరీ రంజిత్ చాగంటి, తెలుగుకళా సమితి సెక్రటరీ మధు రాచకుళ్ల, వంశీ వెనిగళ్ల, శ్రీహరి మందాడి, రమేష్ నూతలపాటి, శ్యాం నాలం, శేషగిరి కంభమ్మెట్టు, విష్ణు ఆలూరు, రాజేశ్ బేతపూడి, చందు ఉప్పాల, రమేశ్ బాబు కర్న, రేణు తాడేపల్లి, దాము గేదెల, ప్రమీలగోపు,జ్యోతి గండి, ఉషా దర్శిపుడి, ఆనంద్ పాలూరి, హరి ఇప్పనపల్లి, గురు అలంపల్లి, రామకృష్ణ ఏలేశ్వరపు తదితరులు పాల్గొన్నారు.