Health

మొటిమలకు జామపండు చికిత్స

Acne Can Be Treated With Guava

దోర జామపండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పోషకాలతో పాటు ఔషధగుణాలూ చాలా ఉన్నాయి. దంతాలు, చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్యతో బాధపడుతున్నవారు జామకాయను కొరికి, బాగా నమిలి చప్పరించి, ఆ పిప్పిని ఊసేయాలి. ఇలా చేస్తే రక్తస్రావం తగ్గి, దంతాలకు మేలు జరుగుతుంది. గుండె బలహీనంగా ఉన్నవారు, క్షయవ్యాధితో బాధపడేవారు, నెలసరి నొప్పులు అధికంగా ఉన్నవారు పండిన జామగుజ్జుతో తేనె, పాలు కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. జామ ఆకులను మెత్తగా నూరి ముఖం మీద వచ్చే మొటిమలకు రాసినట్లయితే అవి తగ్గిపోతాయి. తరచుగా జలుబుతో బాధపడేవారు పండిన జామపండులో 5 గ్రాముల జామచెట్టు బెరడును కలిపి తీసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు.