NRI-NRT

ప్రవాసులు టైం స్లాట్ బుక్ చేసుకుని ఆధార్ తీసుకోవచ్చు

NRIS can get aadhaar by arranging for a time slot in India

భారత్‌ పాస్‌పోర్ట్‌ కలిగిన ప్రవాసులకు ఆధార్‌కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత విశిష్ట ప్రాథికార గుర్తింపు సంస్థ(యూఐడీఏఐ) తెలిపింది. మూడు నెలల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకూ ప్రవాసులు ఆధార్‌కార్డు పొందాలంటే 180రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చేది. ఈ ఏడాది బడ్జెట్‌ సందర్భంగా ఆ నిబంధనను తొలగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇందులో భాగంగా తాజా చర్యలు చేపట్టినట్లు యూఐడీఏఐ సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే వెల్లడించారు. ‘ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ జారీ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. సాంకేతికంగా ఇందుకోసం మార్పులు చేస్తున్నాం. ఇతరదేశాల్లో ఉన్న వాళ్లు ఆధార్‌ పొందేందుకు తమ టైమ్‌ స్లాట్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ఆ సమయానికి భారత్‌కు వచ్చి వారు ఆధార్‌ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకొని, ఆధార్‌ను పొందవచ్చు’ అని అజయ్‌ తెలిపారు.